దైవపరిపాలనా పరిచర్య పాఠశాల
పునఃసమీక్ష పరిచర్య పాఠశాలలో, 2008 ఏప్రిల్ 28వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2008 మార్చి 3 నుండి ఏప్రిల్ 28 మధ్య వారాల్లోని నియామకాల సమాచారంపై 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు.
ప్రసంగ లక్షణాలు
1. మన ప్రసంగాలను నియమిత సమాచారం చుట్టూ అల్లడం ఎందుకు ప్రాముఖ్యం, దీనిని మనమెలా చేయవచ్చు? [be-TU 234వ పేజీ, 1వ పేరా-235వ పేజీ, 1వ పేరా]
2. మనం బోధిస్తున్నప్పుడు ప్రశ్నలు అడగడం ఎందుకంత ప్రాముఖ్యం? [be-TU 236వ పేజీ, 1-5 పేరాలు]
3. ఒక విషయంపై తర్కించడానికి ప్రశ్నలు మన శ్రోతలకు ఎలా సహాయపడవచ్చు? [be-TU 237వ పేజీ, 3వ పేరా-238వ పేజీ, 1వ పేరా]
4. బోధిస్తున్నప్పుడు, శ్రోతల అంతర్గత భావాలను వెలికితీయడానికి నైపుణ్యవంతంగా ప్రశ్నలు ఉపయోగించడం ఎందుకు ప్రాముఖ్యం? (సామె. 20:5; మత్త. 16:13-16; యోహా. 11:26) [be-TU 238వ పేజీ, 3–5 పేరాలు]
5. బోధిస్తున్నప్పుడు ఉపమాలంకారాలను ఉపయోగించడం ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుంది? (ఆది. 22:17; యిర్మీ. 13:11) [be-TU 240వ పేజీ, 1-3 పేరాలు]
ఉపదేశ ప్రసంగం
6. దేవుని రాజ్యంలో జీవించడానికి సహాయం చేసే, మార్కు పుస్తకంలో నొక్కిచెప్పబడిన కొన్ని నిర్దేశక సూత్రాలు ఏవి? [bsi0 8-1-TU 8వ పేజీ, 32వ పేరా]
7. పరిశుద్ధాత్మ నేడు దేవుని సేవకులకు ఎలా సహాయం చేస్తుంది? (యోహా. 14:25, 26) [be-TU 19వ పేజీ, 2-3 పేరాలు]
8. చదవడం వల్ల చేకూరే అత్యంత గొప్ప ప్రయోజనం ఏమిటి? [be-TU 21వ పేజీ, 3వ పేరా]
9. అధ్యయనంలో ఏమి ఇమిడివుంది? [be-TU 27వ పేజీ, 3వ పేరా-28వ పేజీ, 1వ పేరా]
10. లూకా సువార్త, హెబ్రీ లేఖనాలు దైవప్రేరేపితమైనవి అనే నమ్మకాన్ని ఎలా బలపరుస్తుంది? [bsi0 8-1-TU 10వ పేజీ, 30-1 పేరాలు]
వారపు బైబిలు పఠనం
11. యేసు తనను “సద్బోధకుడా” అని సంబోధించిన వ్యక్తిని ఎందుకు సరిదిద్దాడు? (మార్కు 10:17, 18) [w0 8-TU 2/15 “యెహోవా వాక్యము సజీవమైనది—మార్కు పుస్తకం నుండి ముఖ్యాంశాలు”]
12. ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించిన ఏ విషయాన్ని చూపించడానికి యేసు అంజూరపు చెట్టును ఉపయోగించాడు? (మార్కు 11:12-14, 20, 21) [w0 3-TU 5/15 26వ పేజీ 2-3 పేరాలు]
13. దేవుని పరిశుద్ధాత్మ మరియ మీదికి వచ్చి, దేవుని శక్తి ఆమెను కమ్ముకోవడంవల్ల ఆమె ‘గర్భం ధరిస్తుంది’ అని గబ్రియేలు దూత ఆమెతో చెప్పిన మాటల భావమేమిటి? (లూకా 1:30, 31, 34, 35) [w0 8-TU 3/15 “యెహోవా వాక్యము సజీవమైనది—లూకా సువార్తలోని ముఖ్యాంశాలు”; it-2 56వ పేజీ, 2వ పేరా]
14. యేసు శిష్యులు నిజంగానే ‘విశ్రాంతిదినమున చేయదగనిది’ చేశారా? (లూకా 6:1, 2) [gt-TU 31వ అధ్యా.]
15. యేసు మార్తకిచ్చిన సలహానుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు? (లూకా 10:40-42) [w99-TU 9/1 31వ పేజీ]