కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/08 పేజీలు 3-5
  • ఆధ్యాత్మిక విందు ఆరగించి, ఆనందించే సందర్భం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆధ్యాత్మిక విందు ఆరగించి, ఆనందించే సందర్భం
  • మన రాజ్య పరిచర్య—2008
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆధ్యాత్మిక విందు ఆరగించడానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నారా?
    మన రాజ్య పరిచర్య—2009
  • గౌరవాన్ని ప్రదర్శించడం ద్వారా క్రీస్తును అనుసరించండి
    మన రాజ్య పరిచర్య—2007
  • యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండండి
    మన రాజ్య పరిచర్య—2006
  • జిల్లా సమావేశాలు—సంతోషంగా ఆరాధించే సమయం
    మన రాజ్య పరిచర్య—2010
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2008
km 7/08 పేజీలు 3-5

ఆధ్యాత్మిక విందు ఆరగించి, ఆనందించే సందర్భం

1. యెహోవా తన సేవకుల ఆధ్యాత్మిక అవసరాలపట్ల ఎలా శ్రద్ధ తీసుకుంటున్నాడు?

1 యెహోవా తన సేవకుల ఆధ్యాత్మిక అవసరాలపట్ల ప్రేమపూర్వకంగా శ్రద్ధ తీసుకుంటున్నాడు. లోకంలోని ప్రజలు ఆధ్యాత్మికంగా కుపోషణకు గురవుతుంటే, మనం మాత్రం పుష్టిగా పోషించబడుతున్నాం. (యెష. 65:13) వార్షిక జిల్లా సమావేశాల ద్వారా కూడా యెహోవా మనలను ఆధ్యాత్మికంగా పోషిస్తున్నాడు. “పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తోంది” అనే రానున్న జిల్లా సమావేశానికి మూడు రోజులూ అన్ని కార్యక్రమాలకూ హాజరయ్యేందుకు మీరు ఏర్పాట్లు చేసుకుంటున్నారా? రుచికరమైన, బలవర్ధకమైన ఆధ్యాత్మిక విందు ఏర్పాటు చేయబడింది.

2. సమావేశానికి హాజరయ్యేందుకు ముందే ఏర్పాట్లు చేసుకోవాలంటే ఏమి చేయాలి?

2 ముందే ఏర్పాట్లు చేసుకోండి: “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు.” (సామె. 21:5) కాబట్టి, సమావేశానికి మూడు రోజులూ హాజరవడానికి మీరు ఏర్పాట్లు చేసుకుంటున్నప్పుడు మీ పై అధికారిని సెలవు కోసం అడగడాన్ని వాయిదా వేయకండి. మీకు వసతి అవసరమైతే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారా? సమావేశ స్థలంవద్ద సహోదరులతో కలిసి తినేందుకు వీలుగా మీరు తేలికపాటి ఆహారం తెచ్చుకోవాలని అనుకోవచ్చు. సీట్లు పెట్టుకునేందుకు, ప్రారంభ పాటకు, ప్రార్థనకు ఉండేందుకు వీలుగా సమావేశానికి తగినంత ముందుగానే రావడానికి ఏర్పాట్లు చేసుకోండి.

3. మనం ఎలాంటి బట్టలు వేసుకోవాలని నిర్ణయించుకోవాలి?

3 మనం వేసుకునే బట్టలు మర్యాదపూర్వకంగా ఉండేలా చూసుకోవాలని కోరుకుంటాం. (1 తిమో. 2:9, 10) జిల్లా సమావేశాలు స్థానికులకు సాక్ష్యమిచ్చేందుకు మంచి అవకాశాన్నిస్తాయి. సమావేశం జరుగుతున్న నగరంలో మనం మర్యాదపూర్వకమైన విధంగా తయారవడం ద్వారా, సమావేశ బాడ్జిని పెట్టుకోవడంద్వారా అవిశ్వాసులకు భిన్నంగా కనిపిస్తాం, అంతేకాదు మనల్ని గమనించేవారికి మనపట్ల మంచి అభిప్రాయాన్ని కలిగిస్తాం.

4. మనం, మన కుటుంబం కార్యక్రమం నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే ఏమి చేయాలి?

4 జాగ్రత్తగా వినండి: ఈ ఆధ్యాత్మిక విందులో మన కోసం అందజేయబడే వాటిలో దేనినీ వదులుకోవాలని మనం కోరుకోము! (సామె. 22:17, 18) లేఖనాలు చదవబడుతున్నప్పుడు మనం బైబిలు తెరిచి చూసుకుంటూ క్లుప్తంగా నోట్సు వ్రాసుకుంటుంటే కార్యక్రమాన్ని శ్రద్ధగా వినగలుగుతాం, మన దృష్టి అటూ ఇటూ వెళ్ళకుండా ఉంటుంది. సాయంత్రం, ఆ కార్యక్రమంలోని ముఖ్యాంశాల గురించి ఇతరులతో మాట్లాడడానికి మనం వ్రాసుకున్న నోట్సును ఉపయోగించవచ్చు. ఇటీవలి సంవత్సరాల్లో, సమావేశ కార్యక్రమం జరుగుతున్నప్పుడు కొందరు యౌవనస్థులు ఒకే దగ్గర కూర్చొని లేదా బయట నిలబడి మాట్లాడుకుంటున్నట్లు, సెల్‌ ఫోన్లలోనుండి ఎస్‌.ఎం.ఎస్‌.లు పంపిస్తున్నట్లు గమనించబడింది. చిన్న పిల్లలున్నవారు, అలాగే టీనేజీ పిల్లలున్నవారు తమ పిల్లలను ఇతర పిల్లలతో కూర్చోవడానికి అనుమతించే బదులు వారిని తమతో కూర్చోబెట్టుకొని ఒక కుటుంబంగా కార్యక్రమాన్ని వినడం ప్రయోజనకరంగా ఉంటుంది.

5. సమావేశంలో మనం మన ఆనందాన్ని ఎలా అధికం చేసుకోవచ్చు?

5 సహవాసాన్ని ఆనందించండి: రుచికరమైన ఆహారాన్ని స్నేహితులతో పంచుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది. (సామె. 15:17) అలాగే, మన సహోదర సహోదరీలతో సహవసించడం మన ఆనందాన్ని అధికం చేస్తుంది. సమావేశ కార్యక్రమానికి ముందు, ఆ తర్వాతా, ఇతరులను పరిచయం చేసుకోవడం, వారి సహవాసాన్ని ఆనందించడం ఎంత ఆహ్లదకరంగా ఉంటుందో కదా! (కీర్త. 133:1) సంగీతం ప్రారంభం కావడానికి ముందు ఛైర్మన్‌ కూర్చోమని చెప్పినప్పుడు మనం మాటలు ఆపి, కూర్చోవడం మంచిది.

6. సమావేశం జరుగుతున్న నగరంలో ఇతరులకు ఎలా సాక్ష్యమివ్వవచ్చో చూపించే ఒక అనుభవాన్ని చెప్పండి.

6 సాక్ష్యమిచ్చేందుకు ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోండి: సాధారణంగా సమావేశాలు సాక్ష్యమివ్వడానికి చక్కని అవకాశాలనిస్తాయి. సమావేశానికి వచ్చినవారు కార్యక్రమం ముగిసిన తర్వాత హోటళ్ళకు వెళ్ళినప్పుడు అక్కడున్న వెయిటర్లు, ఇంకా ఇతరులు బాడ్జిపై ఉన్న సమావేశ అంశాన్ని గురించి అడిగారు. ఇది సంభాషణకు, సత్యం గురించి చక్కని సాక్ష్యమివ్వడానికి దారితీసింది. అలా అడిగిన కొందరిని సమావేశానికి ఆహ్వానించినప్పుడు వారు దానికి హాజరయ్యారు.

7. సమావేశ స్థలంలో మన క్రైస్తవ మర్యాదను ఏ లేఖన సూత్రం నిర్దేశిస్తుంది?

7 క్రైస్తవ మర్యాద, దేవుని ఆత్మతో నడిపించబడుతున్నాం అనడానికి నిదర్శనం: సమావేశానికి వచ్చిన వారిలో కొందరు అటెండెంట్లతో సహకరించకుండా, చివరికి వారితో క్రైస్తవులు మాట్లాడకూడని విధంగా మాట్లాడారని గమనించబడింది. నేను ముందు అనే మనస్తత్వం మంచివారనే గుర్తింపునివ్వదు, అది యెహోవా దేవునికి ఘనతనూ తీసుకురాదు. కాబట్టి మనం దానికి భిన్నంగా అంటే ప్రేమించేవారిగా, సహనంగలవారిగా, సహకరించేవారిగా ఉంటూ, మన జీవిత విధానం దేవుని పరిశుద్ధాత్మతో నిర్దేశించబడుతోందని చూపిద్దాం. (గల. 5:22, 25) అంతేగాక, సీట్లు పెట్టుకోవడానికి సంబంధించిన సమస్య ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సమావేశపు హాలు తలుపులు ఉదయం 8 గంటలకు తెరవగానే, కొందరు సహోదర సహోదరీలు ఒకరినొకరు నెట్టుకుంటూ, తోసుకుంటూ “మంచి” సీట్ల కోసం పరుగెత్తడం కనబడింది. అలాంటి ప్రవర్తనవల్ల కొందరికి గాయాలయినట్లు తెలిసింది. కొందరు సహోదరులు, తమ కుటుంబాలతోపాటు తాము సమావేశానికి ముందుగా చేరుకున్నా, అప్పటికే కొందరు చాలా సీట్లు పెట్టుకోవడం గమనించామని తెలియజేశారు. చాలా సందర్భాల్లో హాలు తలుపులు తెరవగానే ఒక వ్యక్తి ప్రవేశించి తన కుటుంబం కోసం, స్నేహితుల కోసం ఒక వరుస మొత్తం సీట్లను పెట్టేసుకుంటాడు. ప్రేమ నిస్వార్థానికి పరిపూర్ణ వ్యక్తీకరణగా వర్ణించబడింది. క్రీస్తు యేసు కూడా తన శిష్యులుగా గుర్తింపు పొందడానికి ప్రాథమిక విధానం నిస్వార్థమైన ప్రేమ అని స్పష్టంచేశాడు. (యోహా. 13:35) ఎక్కువసంఖ్యలో సీట్లు పెట్టుకోవడం, దేవుని పోలిన ఇలాంటి ప్రేమను క్రియల్లో చూపించడానికి మంచి మాదిరిగా ఉంటుందా? క్రైస్తవ ప్రేమ క్రీస్తు చెప్పిన దీనిని పాటించడానికి మనలను పురికొల్పాలి, “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.”—మత్త. 7:12.

8. రానున్న జిల్లా సమావేశానికి మనమెందుకు హాజరవ్వాలి?

8 ఈ కార్యక్రమాన్ని సిద్ధం చేసేందుకు, సమావేశ హాలును ఏర్పాటు చేసేందుకు, సమావేశ డిపార్టుమెంటులను వ్యవస్థీకరించేందుకు, ప్రసంగాలను సిద్ధంచేసేందుకు కొన్ని వేల గంటలు వెచ్చించబడ్డాయి. ఈ ఆధ్యాత్మిక విందును తయారుచేసేందుకు ప్రేమపూర్వకంగా చేయబడిన కృషి, యెహోవాకు తన ప్రజలపట్ల ఎంతో శ్రద్ధ ఉందని చూపిస్తుంది. మనందరం హాజరై ఆ విందును సుష్ఠుగా ఆరగిద్దాం! మనమలా చేస్తే, లోకానికి భిన్నంగా, మనం ‘హృదయానందంతో కేకలు వేస్తాం.’—యెష. 65:14.

[5వ పేజీలోని బాక్సు]

జిల్లా సమావేశపు జ్ఞాపికలు

▪ కార్యక్రమ వేళలు: మూడు రోజులూ కార్యక్రమం ఉదయం 9:20కు ప్రారంభమౌతుంది. ఉదయం 8 గంటలకు తలుపులు తెరుస్తారు. ప్రారంభ సంగీతం మొదలవగానే కార్యక్రమం గౌరవప్రదంగా ప్రారంభమయ్యేలా మనమందరం సీట్లలో కూర్చోవాలి. శుక్రవారం, శనివారం కార్యక్రమం సాయంత్రం 4:55కు ముగుస్తుంది, ఆదివారం సాయంత్రం 4:00కు ముగుస్తుంది.

▪ పార్కింగ్‌: పార్కింగును నియంత్రించే అవకాశం మనకు దొరికిన అన్ని సమావేశ స్థలాల్లో, పార్కింగ్‌ స్థలం ఎవరు ముందు వస్తే వారికి ఉచితంగా ఇవ్వబడుతుంది. సమావేశ బ్యాడ్జి కార్డులు పార్కింగ్‌ చేయడానికి గుర్తింపుగా పనిచేస్తాయి.

▪ సీట్లు పెట్టుకోవడం: మీతోపాటు ఒకే వాహనంలో ప్రయాణించేవారికి లేదా మీ ఇంటివారికి మాత్రమే సీట్లు పెట్టుకోవచ్చు.

▪ మధ్యాహ్న భోజనం: మధ్యాహ్నం విరామ సమయంలో భోజనం చేయడానికి సమావేశ స్థలాన్ని విడిచి వెళ్ళే బదులు దయచేసి మీ వెంట భోజనాన్ని తెచ్చుకోండి. మీ సీటు క్రింద పెట్టేందుకు వీలయ్యే టిఫిన్‌ కారియర్లను తెచ్చుకోండి. సమావేశ స్థలంలోకి పెద్దపెద్ద క్యానులు, గాజు సామాను, మద్యపానీయాలు తీసుకురాకూడదు.

▪ విరాళాలు: మన రాజ్య మందిరంలో లేక సమావేశంలో, ప్రపంచవ్యాప్త పని కోసం స్వచ్ఛంద విరాళాలు ఇవ్వడం ద్వారా మనం సమావేశ ఏర్పాట్లపట్ల కృతజ్ఞతను చూపించవచ్చు. సమావేశంలో చెక్కు రూపంలో విరాళం ఇవ్వాలనుకున్నవారు “Watch Tower” పేరున వ్రాయాలి.

▪ ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులు: సమావేశ స్థలంలో ఎవరికైనా అత్యవసరంగా వైద్య సహాయం అవసరమైతే దగ్గర్లో ఉన్న అటెండెంటును సంప్రదించండి, అర్హత పొందిన ప్రథమచికిత్సా సిబ్బంది పరిస్థితి గంభీరతను అంచనా వేసి, సహాయపడేందుకు ఆయన వెంటనే దానిని ప్రథమ చికిత్సా విభాగం దృష్టికి తీసుకువస్తాడు. అవసరమైతే, మన ప్రథమ చికిత్సా విభాగం 102 నెంబర్‌కు ఫోన్‌ చేస్తుంది.

▪ బధిరులు: కోయంబత్తూర్‌, కొచ్చిలలో జరిగే సమావేశాల్లోను, బెంగుళూరులో జరిగే ఇంగ్లీషు సమావేశంలోను కార్యక్రమ భాగాలు సంజ్ఞాభాషలో అందజేయబడతాయి.

▪ బేబీ స్ట్రాలర్లు: వీటిని సమావేశ స్థలంలోకి తీసుకురాకూడదు. అయితే, తల్లిదండ్రులు తమ ప్రక్క సీట్లలో చైల్డ్‌ సేఫ్టీ సీట్లను అమర్చుకోవచ్చు.

▪ సెంట్లు: కొన్ని సమావేశాలు వెంటిలేషన్‌ కోసం ఫ్యాన్లు బిగించిన హాళ్లలో జరుగుతాయి. కాబట్టి అలాంటి హాళ్ళలో, శ్వాస సంబంధ సమస్యలు లేక తత్సంబంధిత సమస్యలు ఉన్నవారిపై ప్రతిచర్యచూపే ఘాటు సెంట్లను, అత్తర్లను పరిమితంగా వాడడం ద్వారా మనం వారిపై దయ చూపించవచ్చు.—1 కొరిం. 10:24.

▪ ఫాలో అప్‌ ఫారమ్‌లు: సమావేశ సమయంలో మనం అనియత సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆసక్తి చూపించినవారి సమాచారం అందించడానికి ప్లీజ్‌ఫాలో అప్‌ ఫారమ్‌ (S-43)ను ఉపయోగించాలి. ప్రచారకులు సమావేశానికి ఒకటి లేదా రెండు ఫాలో అప్‌ ఫారమ్‌లను తెచ్చుకోవాలి. పూర్తి చేయబడిన ఫారాలను పుస్తక విభాగానికి లేదా మీరు తిరిగివెళ్ళిన తర్వాత మీ సంఘ కార్యదర్శికి అందజేయండి.—మన రాజ్య పరిచర్య ఫిబ్రవరి 2005, 6వ పేజీ చూడండి.

▪ హోటళ్ళు: హోటళ్ళకు వెళ్ళినప్పుడు మీ మంచి ప్రవర్తనద్వారా యెహోవా నామాన్ని ఘనపర్చండి. చాలా ప్రాంతాల్లో లభ్యమవుతున్న సేవలనుబట్టి 10 శాతం టిప్‌ ఇవ్వడం పరిపాటి.

▪ లాడ్జీలు: (1) అవసరమయ్యే దానికన్నా ఎక్కువ రూములు రిజర్వు చేసుకోకండి, రూములో అనుమతించబడినదానికన్నా ఎక్కువమంది ఉండకండి. (2) మీరు మీ రూము రిజర్వేషన్‌ను రద్దు చేయాల్సివస్తే, దాని గురించి లాడ్జి వారికి వెంటనే తెలియజేయండి. (3) మీరు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే లగేజి కార్డ్‌ తీసుకోండి, ఇతరులు వాడేందుకు వీలుగా వెంటనే దానిని తిరిగి ఇచ్చేయండి. (4) వంట చేసేందుకు అనుమతిలేని రూములో వంట చేయకండి. (5) ప్రతీరోజు రూమ్‌ బాయ్‌కు టిప్‌ ఇవ్వండి. (6) అతిథులు లాడ్జిలలో ఉన్నప్పుడు వారికి అందించే అల్పాహారం, కాఫీ లేక ఐస్‌లాంటి అదనపు ఏర్పాట్లను దుర్వినియోగం చేయకండి. (7) లాడ్జి సిబ్బందితో వ్యవహరిస్తున్నప్పుడు అన్నిసమయాల్లో ఆత్మఫలాలను ప్రదర్శించండి. (8) టాక్స్‌ మినహాయించి రూమ్‌ అద్దె ఒక రోజుకు ఎంతవుతుందో సిఫారసు చేయబడిన లాడ్జీల జాబితాలో ఇవ్వబడింది. మీరు కోరని లేదా ఉపయోగించని వాటి కోసం అదనంగా బిల్లు కట్టమని అడిగితే దానిని తిరస్కరించి, వీలైనంత త్వరగా రూమింగ్‌ విభాగానికి తెలియజేయండి. (9) మీ లాడ్జిరూమ్‌కు సంబంధించి ఏదైనా సమస్య ఎదురైతే, సమావేశంవద్ద ఉన్నప్పుడే రూమింగ్‌ విభాగానికి తెలియజేయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి