కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/08 పేజీ 6
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2008
మన రాజ్య పరిచర్య—2008
km 7/08 పేజీ 6

ప్రకటనలు

▪ సాహిత్య ప్రతిపాదనలు జూలై ఆగస్టులలో: ఈ క్రింద ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్లలో దేన్నైనా అందించవచ్చు: సర్వమానవాళి కొరకైన గ్రంథం, సంతృప్తికరమైన జీవితం దాన్నెలా సాధించవచ్చు, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?, జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సెప్టెంబరులో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? మొదటిసారి కలుసుకున్నప్పుడే బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించడానికి ప్రత్యేకంగా కృషిచేయండి. ఈ పుస్తకం అంతకుముందే గృహస్థుని దగ్గర ఉన్నట్లైతే, బైబిలు అధ్యయనాన్ని క్లుప్తంగా ప్రదర్శిస్తూ ఆయన దాని నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చో చూపించండి. అక్టోబరులో: కావలికోట. ఆసక్తి చూపించిన చోట, బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో, మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్ని అందించి, దానిని చర్చించండి.

▪ ఆగస్టులో ఐదు వారాంతాలు ఉన్నాయి కాబట్టి సహాయ పయినీరు సేవ చేయడానికి అది అనువైన నెల.

▪ సెప్టెంబరు మొదలుకొని జిల్లా పైవిచారణకర్తలు “యథార్థతా మార్గంలో నడవండి” అనే అంశంగల బహిరంగ ప్రసంగాన్నిస్తారు.

▪ బ్రాంచి కార్యాలయం ప్రచారకులు వ్యక్తిగతంగా కోరే సాహిత్యాలను సరఫరా చేయదు. ప్రతీనెల తమ సంఘం కోసం సాహిత్యాన్ని కోరుతూ బ్రాంచి కార్యాలయానికి వ్రాసే ముందు, స్వంత సాహిత్యాలు కావాలనుకునే వారందరూ సాహిత్యాలకు సంబంధించిన విషయాలను చూసుకునే సహోదరునికి తమకు కావల్సిన వాటిని తెలియజేసేందుకు వీలుగా సంఘ పైవిచారణకర్త సంఘంలో ప్రతీనెల ప్రకటన చేయబడేలా ఏర్పాటు చేయాలి. ఏ సాహిత్యాలు ప్రత్యేకంగా కోరవలసినవో గుర్తుంచుకోండి.

▪ స్టాకులో ఉన్న పత్రికలతో సహా సాహిత్యాలన్నిటి వార్షిక ఇన్వెంటరీ 2008, ఆగస్టు 31న లేదా ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా తీసుకోవాలి. ప్రతీనెల లిటరేచర్‌ కో-ఆర్డినేటర్‌ లెక్కించే విధంగానే ఈ ఇన్వెంటరీ చేయాలి, అలా లెక్కించిన స్టాకు వివరాలను లిటరేచర్‌ ఇన్వెంటరీ (S-18)లో ఎక్కించాలి. స్టాకులో ఎన్ని పత్రికలున్నాయో పత్రికా సేవకుని(ల) నుండి తెలుసుకోవాలి. ఈ ఇన్వెంటరీని కో-ఆర్డినేటింగ్‌ సంఘ కార్యదర్శి పర్యవేక్షించాలి. ఆయనతోపాటు కో-ఆర్డినేటింగ్‌ సంఘ పైవిచారణకర్త కూడా ఆ ఫారం మీద సంతకం చేస్తారు. ప్రతి కో-ఆర్డినేటింగ్‌ సంఘం మూడు లిటరేచర్‌ ఇన్వెంటరీలను అందుకుంటుంది. దయచేసి ఒరిజినల్‌కాపీని బ్రాంచి కార్యాలయానికి సెప్టెంబరు 6వ తేదీకి ముందే పంపించండి. మీ ఫైళ్ళ కోసం ఒక కాపీ ఉంచుకోండి. మూడవ కాపీని చిత్తు ప్రతిగా ఉపయోగించుకోవచ్చు.

▪ బైబిలు అధ్యయనాలను ప్రారంభించడానికి, వాటిని నిర్వహించడానికి దేవుడు కోరుతున్నాడు బ్రోషురుకు బదులు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఉపయోగించాలి. దేవుడు కోరుతున్నాడు బ్రోషురు స్టాకు అయిపోయేంతవరకు దానిని పరిచర్యలో అందించవచ్చు.

▪ స్పెషల్‌ రిక్వెస్ట్‌ ఫామ్‌ ఫర్‌ ఆన్యుల్‌ ఐటమ్స్‌ అన్ని సంఘాలకు పంపించబడుతోంది. 2009వ సంవత్సరానికి సంబంధించిన వార్షిక పుస్తకము (ఆంగ్లం), క్యాలెండర్‌ (ఆంగ్లం), లేఖనాలను పరిశోధించడం వంటి వార్షిక ప్రచురణల కోసం ఇంకా కోరని సంఘాలు, వెంటనే వాటికోసం విజ్ఞప్తి చేయాలి. కింగ్‌డమ్‌హాల్‌ లిటరేచర్‌ ఇన్వెంటరీ అరేంజ్‌మెంట్‌ క్రింద వచ్చే సంఘాలు తమ రిక్వెస్టులను “కో-ఆర్డినేటింగ్‌ కాంగ్రిగేషన్‌” ద్వారానే పంపించాలి. అయితే, కో-ఆర్డినేటింగ్‌ కాంగ్రిగేషన్‌కు చెందిన కార్యదర్శి తమ లిటరేచర్‌గ్రూపులో ఉన్న సంఘాలన్నిటికీ సరిపోయేంత సాహిత్యం ఆర్డర్‌ చేయబడేలా చూసుకోవాలి.

▪ లభ్యమవుతున్న క్రొత్త ప్రచురణలు:

మాట్లాడే సామర్థ్యాన్నీ, బోధించే సామర్థ్యాన్నీ మీరు ఎలా మెరుగుపర్చుకోవచ్చు? —బెంగాలీ

▪ మళ్ళీ లభ్యమవుతున్న ప్రచురణ:

యెహోవాకు స్తుతిగీతాలు పాడండి (29 పాటలు) —మరాఠీ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి