సేవా కూటాల పట్టిక
ఏప్రిల్ 14తో ప్రారంభమయ్యే వారం
పాట 27 (221)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్యలో నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 8వ పేజీలోని సూచనలను లేదా మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనను ఉపయోగించి, ఏప్రిల్-జూన్ కావలికోటను ఎలా అందించాలో ప్రదర్శించండి.
15 నిమి: “‘కృతజ్ఞులై ఉండండి’”a సమయం ఉంటే, ఉదాహరించబడిన లేఖనాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను అడగండి.
20 నిమి: “దుఃఖిస్తున్నవారిని ఓదార్చండి.”b తమ ప్రియమైనవారిని కోల్పోవడంవల్ల, దుఃఖిస్తున్నవారిని ఓదార్చిన విశేషమైన అనుభవాలను వివరించమని ప్రేక్షకులను అడగండి.
పాట 21 (191)
ఏప్రిల్ 21తో ప్రారంభమయ్యే వారం
పాట 11 (85)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. పత్రికలు తీసుకున్నవారికి మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్ని ఎలా ఇవ్వాలో క్లుప్తంగా ప్రదర్శింపజేయండి. గృహస్థులు సుముఖంగా ఉంటే మొదటి ఐదు పేరాలను చూపించి, బైబిలు అధ్యయనం చేస్తారేమో అడగండి. జ్ఞాపకార్థ ఆచరణకు లేదా ప్రత్యేక బహిరంగ ప్రసంగానికి హాజరై ఇంకా బైబిలు అధ్యయనం చేయనివారిని కలవండి. తర్వాతి వారం జరిగే సేవాకూటానికి ఏప్రిల్- జూన్ కావలికోట పత్రికను తీసుకురావాలని, అంతేకాక స్థానిక క్షేత్రానికి అనువైనవిగా ఉండే ప్రతిపాదనలను చర్చించడానికి సిద్ధపడి ఉండమని సహోదర సహోదరీలకు గుర్తుచేయండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
25 నిమి: “బైబిలు నుండి చదవడం, పత్రికలను ఇవ్వడం ఎప్పుడు సముచితం?”c అర్హతగల పెద్ద దీనిని నిర్వహిస్తారు. సమాచారాన్ని స్థానిక పరిస్థితులకు అన్వయించి చెప్పండి.
పాట 6 (45)
ఏప్రిల్ 28తో ప్రారంభమయ్యే వారం
పాట 1 (13)
15 నిమి: స్థానిక ప్రకటనలు. ఏప్రిల్ క్షేత్ర సేవా రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తుచేయండి. ఏప్రిల్-జూన్ కావలికోట గురించి క్లుప్తంగా వివరించిన తర్వాత, మనం కలిసేవారికి అందులో ఏ ఆర్టికల్ ఆసక్తికరంగా ఉండవచ్చో, ఎందుకు ఉండవచ్చో ప్రేక్షకులను అడగండి. సహోదర సహోదరీలు తాము పరిచర్యలో చూపించాలనుకుంటున్న కొన్ని ఆర్టికల్స్ గురించి ఏమి చెప్పవచ్చో సలహాలివ్వమని అడగండి. సంభాషణను ప్రారంభించడానికి ఎలాంటి ప్రశ్న అడిగితే బాగుంటుంది? ఆర్టికల్‌లోని ఏ లేఖనం చదివితే బాగుంటుంది? లేఖనాన్ని ఆర్టికల్‌తో ఎలా ముడిపెట్టవచ్చు? పత్రికను ఎలా అందించాలో చూపించడానికి ప్రేక్షకులు చెప్పిన ఒక ప్రతిపాదనను ప్రదర్శింపజేయండి.
10 నిమి: ప్రశ్నాభాగం. ప్రేక్షకులతో చర్చ.
20 నిమి: “‘ఆయన అడుగుజాడల్లో నడవండి.’”d సమయం అనుమతిస్తే, ఉదాహరించబడిన లేఖనాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.
పాట 23 (200)
మే 5తో ప్రారంభమయ్యే వారం
పాట 9 (37)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: యెహోవా మిమ్మల్ని ఎంతమాత్రం విడిచిపెట్టడు. కావలికోట అక్టోబరు 15, 2005, 8-11 పేజీల ఆధారంగా ప్రోత్సాహకరమైన ప్రసంగం.
20 నిమి: “ప్రకటనాపనిలో అంతకంతకూ నైపుణ్యవంతులవండి.”e 3వ పేరాను చర్చిస్తున్నప్పుడు పరిచర్య పాఠశాల పుస్తకంలోని 6-8 పేజీల్లోవున్న “సంపూర్ణ ప్రయోజనం ఎలా పొందవచ్చు?” అనే ఉపశీర్షికలోని వ్యాఖ్యానాలను చేర్చండి.
పాట 8 (53)
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.
d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.
e ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.