కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/08 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2008
  • ఉపశీర్షికలు
  • ఫిబ్రవరి 11తో ప్రారంభమయ్యే వారం
  • ఫిబ్రవరి 18తో ప్రారంభమయ్యే వారం
  • ఫిబ్రవరి 25తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 3తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2008
km 2/08 పేజీ 2

సేవా కూటాల పట్టిక

ఫిబ్రవరి 11తో ప్రారంభమయ్యే వారం

పాట 8 (53)

8 నిమి: స్థానిక ప్రకటనలు. జనవరి-మార్చి కావలికోటను ఎలా అందించాలో చూపించడానికి 12వ పేజీలో ఇవ్వబడిన అందింపుని లేక మీ క్షేత్రానికి అనువైన వేరే అందింపుని ఉపయోగించండి.

15 నిమి: “మన క్షేత్రంలో యోగ్యులైన వారిని వెదకడం.”a మూడవ పేరాను పరిశీలించిన తర్వాత, ఒక ప్రచారకుడు సాధారణ విషయాల గురించి మాట్లాడి, గృహస్థునికి ఆసక్తి ఉందో లేదో తెలుసుకున్న తర్వాత ఒక లేఖనాన్ని అతనికి చదివి వినిపిస్తున్నట్లు క్లుప్తంగా ప్రదర్శింపజేయండి.

22 నిమి: “‘సువార్తనుగూర్చి సాక్ష్యమివ్వండి.’”b (1-10 పేరాలు) దీనిని సేవా పైవిచారణకర్త నిర్వహించాలి. ఇతర పనుల్లో బిజీగా ఉన్నా లేదా శారీరక అస్వస్థతలు ఉన్నా, గత సంవత్సరంలో సహాయ పయినీరు సేవ చేసిన ప్రచారకుల్లో ఒకరిద్దరిని ఇంటర్వ్యూ చేయండి. దానిని వారెలా చేయగలిగారు? ఎలాంటి ఆనందాన్ని, ఆశీర్వాదాలను పొందారు? 7వ పేరాను పరిశీలిస్తున్నప్పుడు మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో క్షేత్ర సేవా కూటాలు ఎప్పుడెప్పుడు ఉంటాయనే వివరాలను తెలియజేయండి.

పాట 9 (37)

ఫిబ్రవరి 18తో ప్రారంభమయ్యే వారం

పాట 7 (51)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.

15 నిమి: స్థానిక అవసరాలు.

20 నిమి: “‘సువార్తనుగూర్చి సాక్ష్యమివ్వండి.’”c (11-17 పేరాలు) ప్రత్యేక జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానప్రతులు అందుబాటులో ఉన్నట్లయితే, 14వ పేరాను పరిశీలిస్తున్నప్పుడు ప్రేక్షకులందరికీ ఒక్కో ప్రతిని అందించండి. క్షేత్రంలో ఆహ్వానప్రతులను అందించడానికి స్థానికంగా చేయబడిన ఏర్పాట్లను తెలియజేయండి.

పాట 17 (187)

ఫిబ్రవరి 25తో ప్రారంభమయ్యే వారం

పాట 26 (212)

10 నిమి: స్థానిక ప్రకటనలు. ఫిబ్రవరి క్షేత్రసేవా రిపోర్టులు ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి. అక్కౌంట్స్‌ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానప్రతిని ఇచ్చి ఒక కుటుంబ సభ్యుణ్ణి లేదా పొరుగువారిని ఎలా ఆహ్వానించవచ్చో ప్రదర్శింపజేయండి.

20 నిమి: “విమోచన క్రయధనాన్ని కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకోవడం.”d సమయముంటే, ఉదాహరించబడిన లేఖనాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను అడగండి.

15 నిమి: క్రొత్తవారు పరిచారకులుగా ప్రగతి సాధించడానికి సహాయం చేయండి. ఉపోద్ఘాతం నిమిషంకన్నా తక్కువ ఉండేలా చూసుకొని, కావలికోట డిసెంబరు 1, 2005 సంచికలోని 31వ పేజీలో ఇవ్వబడిన అధ్యయన ప్రశ్నలను ఉపయోగిస్తూ ప్రశ్నా జవాబుల చర్చను నిర్వహించండి. 18వ పేరా చర్చించిన తర్వాత, ఒక క్రొత్త ప్రచారకుడు అనుభవజ్ఞుడైన ప్రచారకునితో పనిచేస్తున్నప్పుడు గృహస్థుడు అభ్యంతరం చెప్పే ప్రదర్శనను చూపించండి. క్రొత్త ప్రచారకుని సమాధానం సమర్థవంతంగా లేకపోవడం వల్ల గృహస్థుడు సంభాషణ కొనసాగించడానికి ఇష్టపడడు. ఆ ఇంటి దగ్గర నుండి వచ్చేసిన తర్వాత, అనుభవజ్ఞుడైన ప్రచారకుడు క్రొత్త ప్రచారకుడు చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకొని, భవిష్యత్తులో సంభాషణను అడ్డుకునేవారు తారసపడితే వారితో మాట్లాడడానికి బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకాన్ని ఎలా ఉపయోగించవచ్చో చూపిస్తాడు.

పాట 6 (45)

మార్చి 3తో ప్రారంభమయ్యే వారం

పాట 28 (224)

10 నిమి: స్థానిక ప్రకటనలు. “జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన జ్ఞాపికలు” అనే బాక్సులోని ముఖ్య విషయాలను పరిశీలించండి.

15 నిమి: రాజ్య ప్రచారకుల అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సేవచేయడం మీకు వీలవుతుందా? కావలికోట జూలై 15, 2003 సంచికలోని 20వ పేజీ ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. సంస్థీకరించబడ్డాం పుస్తకంలో, 111వ పేజీలోని 1వ పేరా నుండి 112వ పేజీలోని 1వ పేరా వరకు ఉన్న విషయాలను వ్యాఖ్యానాల్లో చేర్చండి. రాజ్య ప్రచారకుల అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు తరలివెళ్ళిన వారినెవరినైనా క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు, వాటిని ఎలా అధిగమించారు? ఎలాంటి ఆశీర్వాదాలను పొందారు? మన దేశంలో, అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకి వెళ్ళి అక్కడ సేవచేయడానికి సుముఖంగా ఉన్న యోగ్యులైనవారి అవసరం చాలా ఎక్కువగా వుంది. కాబట్టి ఈ విషయాన్ని గురించి ప్రార్థనాపూర్వకంగా ఆలోచించమని సహోదర సహోదరీలను ప్రోత్సహించండి. మన రాజ్య పరిచర్యలోని జూలై 2007 సంచికలోని ప్రకటనలను చూడండి.

20 నిమి: “దృఢమైన విశ్వాసానికి నిదర్శనం!”e సేవా పైవిచారణకర్త నిర్వహించాలి. ముగింపులో, గత సేవా సంవత్సరం సంఘంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రోత్సాహకరంగా మాట్లాడండి.

పాట 20 (93)

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

e ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి