జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన జ్ఞాపికలు
జ్ఞాపకార్థ ఆచరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నప్పుడు పెద్దలు ఈ క్రింది విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి:
▪ సూర్యాస్తమయానికి ముందే చిహ్నాలు అందించబడకుండా చూడండి.
▪ జ్ఞాపకార్థ ఆచరణకు తగిన రొట్టెలను, ద్రాక్షారసాన్ని సేకరించి, సిద్ధంగా ఉంచుకోవాలి.—కావలికోట ఫిబ్రవరి 15, 2003 14-15 పేజీలు చూడండి.
▪ ప్లేట్లూ, గ్లాసులూ, మంచి టేబుల్, టేబుల్క్లాత్ వంటివాటిని ఆచరణ జరిగే స్థలానికి ముందే తీసుకొచ్చి, వాటివాటి స్థానాల్లో పెట్టుకోవాలి.
▪ రాజ్యమందిరాన్ని లేదా కూటం జరిగే స్థలాన్ని ముందుగానే బాగా శుభ్రంచేసుకోవాలి.
▪ అటెండెంట్లనూ, చిహ్నాలు అందించే సహోదరులనూ ముందే ఎంపిక చేసుకొని, వారు చేయవలసిన పనుల గురించి, ఆచరణా పద్ధతి గురించి, వారి వస్త్రధారణ, కనబడే తీరు గౌరవప్రదంగా ఉండాల్సిన అవసరత గురించి వారికి ముందుగానే చెప్పాలి.
▪ వృద్ధాప్యం, అనారోగ్య కారణాలవల్ల హాజరవలేని అభిషిక్తులు ఎవరైనా ఉంటే వారికి చిహ్నాలు అందించబడేలా తగిన ఏర్పాట్లు చేయాలి.
▪ ఒకే రాజ్యమందిరాన్ని ఒకటికన్నా ఎక్కువ సంఘాలు ఉపయోగిస్తున్నప్పుడు వరండాలో లేదా ప్రవేశ మార్గాల్లో, ఫుట్పాత్లపైనా, పార్కింగ్ స్థలాల్లోనూ అనవసరమైన రద్దీ ఏర్పడకుండా జాగ్రత్తపడేందుకు సంఘాల మధ్య మంచి సమన్వయం ఉండాలి.
▪ జ్ఞాపకార్థ ఆచరణ కోసం వేరే స్థలాన్ని ఉపయోగిస్తున్నట్లయితే, హాజరైనవారంతా ప్రసంగీకుడు చెప్పేది వినగలిగేలా సౌండ్ సిస్టమ్ సరిగా ఉండేలా చూసుకోవాలి.