కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/08 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2008
  • ఉపశీర్షికలు
  • జనవరి 14తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 21తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 28తో ప్రారంభమయ్యే వారం
  • ఫిబ్రవరి 4తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2008
km 1/08 పేజీ 2

సేవా కూటాల పట్టిక

జనవరి 14తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (45)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. జనవరి-మార్చి కావలికోటను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించడానికి 8వ పేజీలోని సూచనను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగించండి.

15 నిమి: “పరిచర్యలో మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.”a క్షేత్రసేవా కూటాన్ని నిర్వహించడంలో మాదిరికరంగా ఉన్న సహోదరుణ్ణి ఇంటర్వ్యూ చేయండి. ఆ కూటాన్ని ప్రేరణాత్మకంగా ప్రోత్సాహకరంగా ఉండేలా నిర్వహించడానికి ఆయనేమి చేస్తాడు?

20 నిమి: “‘మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పువేసినట్టు రుచిగలదిగా ఉండనివ్వండి.’”b 2వ పేరా పరిశీలిస్తున్నప్పుడు యోహాను 4:7-15, 39 వచనాలను చదవండి.

పాట 11 (85)

జనవరి 21తో ప్రారంభమయ్యే వారం

పాట 22 (130)

10 నిమి: స్థానిక ప్రకటనలు. ఫిబ్రవరిలో అందించవలసిన ప్రచురణలను ప్రస్తావించి, ఒక అందింపును ప్రదర్శించండి. ఫిబ్రవరి 4తో ప్రారంభమయ్యే వారంలో జరిగే సేవా కూటంలో నిర్వహించబడే చర్చకు సిద్ధపడడంలో భాగంగా మార్పిడి—ప్రత్యామ్నాయ ఆరోగ్య సంరక్షణ—రోగి అవసరాలు, హక్కులు తీర్చడం అనే వీడియోను చూడమని అందరినీ ప్రోత్సహించండి.

10 నిమి: ప్రతిదినం లేఖనాలను పరిశోధించడం అనే పుస్తకాన్ని మీరు ఉపయోగిస్తున్నారా? ప్రతిదినం లేఖనాలను పరిశోధించడం—2008, ముందుమాట ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. లేఖన వచనాన్ని, వ్యాఖ్యానాలను పరిశీలించేందుకు ప్రతీరోజు కొంత సమయం వెచ్చించడంలోని ప్రాముఖ్యత గురించి చర్చించండి. దినవచనాన్ని పరిశీలించడానికి వారు ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు, దానివల్ల ఎలా ప్రయోజనం పొందారు అనే విషయాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను అడగండి. ఒకటి, రెండు వ్యాఖ్యానాలను ముందుగానే ఏర్పాటుచేసుకోవచ్చు. 2008వ వార్షిక వచనాన్ని క్లుప్తంగా చర్చించండి.

25 నిమి: “ప్రకటించేటప్పుడు ధైర్యాన్ని, వివేచనను కనపర్చడం.”c ఇన్‌సర్ట్‌లోని 1-13 పేరాలను ఒక పెద్ద, ప్రేక్షకులతో చర్చిస్తారు. కూటంలో ఈ సమాచారాన్ని చర్చించడానికి ముందు పెద్దలందరూ స్థానిక పరిస్థితులను బట్టి దాన్ని ఎంతవరకూ అన్వయించుకోవచ్చు అనేది చర్చించాలి.

పాట 7 (51)

జనవరి 28తో ప్రారంభమయ్యే వారం

పాట 23 (200)

10 నిమి: స్థానిక ప్రకటనలు. జనవరి క్షేత్రసేవా రిపోర్టులు ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి. అక్కౌంట్స్‌ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. జనవరి-మార్చి కావలికోట ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. ఆ సంచికపై క్లుప్తంగా వ్యాఖ్యానించిన తర్వాత, క్షేత్రంలోని ప్రజలకు ఏ ఆర్టికల్‌లు ఆకట్టుకొనే విధంగా ఉంటాయి, ఎందుకలా ఉంటాయి అని ప్రేక్షకుల్ని అడగండి. తాము అందించాలనుకుంటున్న ఆర్టికల్‌లో నిర్దిష్ట అంశాలను ప్రస్తావించమని వారిని అడగండి. సంభాషణను ప్రారంభించడానికి ఏ ప్రశ్న అడగవచ్చు? ఆ తర్వాత ఆ ఆర్టికల్‌లోని ఏ లేఖనాన్ని చదవవచ్చు? ఆ లేఖనాన్ని ఎలా అన్వయించవచ్చు? సముచితమైన అందింపును ఉపయోగిస్తూ పత్రికను ఎలా ప్రతిపాదించవచ్చో ప్రదర్శించండి.

10 నిమి: స్థానిక అవసరాలు.

25 నిమి: “ప్రకటించేటప్పుడు ధైర్యాన్ని, వివేచనను కనపర్చడం.”d ఇన్‌సర్ట్‌లోని 14-27 పేరాలను ప్రశ్నాజవాబుల రూపంలో చర్చించాలి. ఒక పెద్ద నిర్వహిస్తారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమాచారాన్ని అన్వయించండి.

పాట 16 (143)

ఫిబ్రవరి 4తో ప్రారంభమయ్యే వారం

పాట 22 (130)

10 నిమి: స్థానిక ప్రకటనలు. ప్రశ్నాభాగాన్ని సమీక్షించండి.

15 నిమి: “బైబిలు విద్యార్థులు రాజ్య సువార్త ప్రచారకులయ్యేందుకు సహాయం చేయండి.”e సమయముంటే, ఉదాహరించబడిన లేఖనాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను అడగండి.

20 నిమి: “మీరు దాన్ని వాయిదా వేస్తున్నారా?” ఒక పెద్ద నిర్వహిస్తారు. రోగి అవసరాలు, హక్కులు అనే వీడియోపై ఆర్టికల్‌లో ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగించి ప్రేక్షకులతో చర్చ. ముగింపులో చివరి పేరా చదివి, కావలికోట, మన రాజ్య పరిచర్య సంచికల్లో నుండి ఉదాహరించబడిన ఆర్టికల్‌లను సమీక్షించమని అందరినీ ప్రోత్సహించండి. ఇంకా పూరించని ప్రతిఒక్కరూ, రక్తంలోని సూక్ష్మభాగాల గురించి, వైద్య పద్ధతుల గురించి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకొని వాటిని డిపిఎ కార్డులో నింపడానికి మన రాజ్య పరిచర్య నవంబరు 2006లోవున్న ఇన్‌సర్ట్‌లోని ప్రశ్నాపత్రాలను ఎలా ఉపయోగించవచ్చో వివరించండి. డిపిఎ కార్డును ఇప్పటికే పూరించినవారు తాము చేసుకున్న ఎంపికను మరోసారి పరిశీలించుకొని అవసరమైతే మరో కార్డును పూరించాలి.

పాట 2 (15)

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

e ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి