పరిచర్యలో మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి
1 మనం పరిచర్యలో నిర్వర్తించవలసింది ఇంకా చాలా ఉంది, కానీ సమయం మాత్రం కొంచమే మిగిలివుంది. (యోహా. 4:35; 1 కొరిం. 7:29) చక్కని వ్యవస్థీకరణతో, ముందస్తు ప్రణాళికతో పరిచర్య కోసం మనం కేటాయించుకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
2 సిద్ధంగా ఉండండి: క్షేత్రసేవా కూటానికి వెళ్ళేముందు, మీకు అవసరమయ్యే సాహిత్యాలు మీ దగ్గర ఉంచుకోండి, అలాగే మీరు చెప్పాలనుకుంటున్న విషయాలను మనసులో ఉంచుకోండి. ప్రార్థనతో కూటం ముగియగానే క్షేత్రంలోకి వెళ్ళండి. అలా వెళ్తే క్షేత్రసేవకు కేటాయించుకున్న సమయంలో చేయగలిగినంత చేయడానికి మీకు, మీతోపాటు పనిచేస్తున్నవారికి సహాయపడుతుంది.
3 క్షేత్రసేవా కూటాన్ని నిర్వహించే బాధ్యత మీకు అప్పగించబడితే కూటాన్ని సమయానికి ప్రారంభించండి. అది చాలా క్లుప్తంగా ఉండాలి, అంటే 10-15 నిమిషాలకు మించకూడదు. మీరు గుంపును పంపించేముందు, ఎవరు ఎవరితో పనిచేయాలో, ఎక్కడ పని చేయాలో చెప్పండి.
4 పరిచర్యలో ఉన్నప్పుడు: క్షేత్రసేవా కూటం అయిపోగానే, అనవసరంగా కాలయాపన చేయకుండా క్షేత్రానికి వెళ్ళండి. మీరొకవేళ క్షేత్రసేవ నుండి త్వరగా వెళ్ళిపోవాలనుకుంటే మీతోపాటు పనిచేసే వ్యక్తి, మీరు వెళ్ళిపోయిన తర్వాత మరో ప్రచారకునితో కలిసి పరిచర్య కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా ఆ విషయాన్ని వారికి ముందుగానే తెలియజేయవచ్చు. గుంపుతో కలిసి పనిచేస్తున్నప్పుడు, మీరు చర్చ ముగించి రావాలని మీ కోసం ఎదురుచూస్తున్న వారిని పరిగణలోకి తీసుకోండి. వాదిస్తున్న వ్యక్తి నుండి యుక్తిగా తప్పించుకుని రావడం, ఆసక్తి చూపిస్తున్న వ్యక్తిని పునర్దర్శించడానికి ఏర్పాటు చేసుకునిరావడం వంటివి అందులో భాగమే.—మత్త. 10:11.
5 పునర్దర్శనాలు చేయడానికి మరో ప్రదేశానికి వెళ్ళేముందు ఒక ప్రదేశంలోవున్న పునర్దర్శనాలన్నీ ముగించుకుంటే అనవసరంగా తిరిగి రావడాన్ని నివారించవచ్చు. ఇదెలా సాధ్యమౌతుందంటే మనమెవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నామో వారు ఇంట్లో ఉంటారో లేదో తెలుసుకోవడానికి ఫోనుచేయవచ్చు. (సామె. 21:5) మీరు వెళ్ళబోయే పునర్దర్శనంలో ఎక్కువ సమయం పట్టవచ్చని మీకనిపిస్తే, వేరే పునర్దర్శనానికి మీతోపాటు వచ్చే వ్యక్తిని మీరొచ్చేంతవరకు దగ్గర్లో ప్రకటించడానికి లేదా మరో పునర్దర్శనం చేయడానికి ఏర్పాటు చేయవచ్చు.
6 గొప్ప ఆధ్యాత్మిక కోతపని జరిగే సమయంలో మనం జీవిస్తున్నాము. (మత్త. 9:37, 38) ఆ పని త్వరలో పూర్తవుతుంది. కాబట్టి, పరిచర్యలో ఉన్నప్పుడు మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం కోరుకోవాలి.