ప్రకటనలు
◼ అందించాల్సిన ప్రచురణలు డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. అది లేకపోతే, యెహోవాకు సన్నిహితమవండి లేదా కుటుంబ సంతోషానికిగల రహస్యము పుస్తకాలను మీరు అందించవచ్చు. జనవరిలో: పాతబడిపోతున్న లేదా 1991కు ముందు ప్రచురించబడిన 192 పేజీల ఏ పుస్తకాన్నైనా ప్రతిపాదించవచ్చు. ఒకవేళ సంఘాల్లో ఇలాంటి పాత పుస్తకాలేవీ అందుబాటులో లేకపోతే, జ్ఞానము పుస్తకాన్ని (స్టాకులో ఉంటే) గానీ లేదా అప్రమత్తంగా ఉండండి! బ్రోషుర్‌ను గానీ ఉపయోగించవచ్చు. ఫిబ్రవరిలో: మీపట్ల శ్రద్ధగల సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) లేదా కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకాన్ని ప్రతిపాదించవచ్చు. మార్చిలో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి కృషి చేయండి.
◼ సంఘ పైవిచారణకర్తచే నియమించబడిన సహోదరుడు సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల సంఘ అకౌంట్స్‌ను ఆడిట్ చేయాలి. తర్వాతి మూడునెలల అకౌంట్స్ కోసం అదే సహోదరుణ్ణి నియమించకూడదు. ఆడిటింగ్ పూర్తయ్యాక సంఘంలో తర్వాతి అకౌంట్స్ రిపోర్టుతోపాటు దాన్ని చదవాలి.—ఇన్‌స్ట్రక్షన్ ఫర్ కాంగ్రిగేషన్ అకౌంటింగ్ (S-27)ను చూడండి.
◼ 2009 సంవత్సరపు జ్ఞాపకార్థ ఆచరణ గురువారం ఏప్రిల్ 9న, సూర్యాస్తమయం తర్వాత జరుగుతుందని గుర్తుంచుకోండి. ఒకవేళ ఒకే రాజ్యమందిరాన్ని ఒకటికంటే ఎక్కువ సంఘాలు ఉపయోగిస్తున్నట్లయితే, సహోదరులు అందుబాటులో ఉన్న వేరే హాలును బుక్ చేసుకోవడానికి వీలుగా ఈ తేదీ ముందుగా తెలియజేయబడుతోంది. జ్ఞాపకార్థ ఆచరణ ప్రశాంతంగా, క్రమబద్ధంగా జరిగేలా ఆ భవనంలోని ఇతర కార్యకలాపాలవల్ల భంగంవాటిల్లకుండా ఉండేందుకు పెద్దలు ముందుగానే హాలు యాజమాన్యంతో మాట్లాడాలి.
◼ లభ్యమవుతున్న క్రొత్త ప్రచురణలు:
నా బైబిలు కథల పుస్తకము—చిన్నసైజు—నేపాలీ
◼ అమెరికన్ సంజ్ఞా భాషలో లభ్యమవుతున్న క్రొత్త డీవీడీలు
లూకా సువార్త
యెహోవా అధికారాన్ని గౌరవించండి
మన కాలానికి హెచ్చరికా మాదిరిలు