సేవా కూటాల పట్టిక
డిసెంబరు 10తో ప్రారంభమయ్యే వారం
పాట 5 (46)
10 నిమి: స్థానిక ప్రకటనలు. 6వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే ప్రతిపాదనలను ఉపయోగిస్తూ, డిసెంబరు 15 కావలికోటను, అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను పరిచర్యలో ఎలా అందించాలో ప్రదర్శించండి.
20 నిమి: 2008వ సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల. పాఠశాల పైవిచారణకర్త ఇచ్చే ప్రసంగం. అక్టోబరు 2007 మన రాజ్య పరిచర్య మధ్య పేజీల్లోనుండి స్థానికంగా అవసరమైన అంశాలను చర్చించండి. సహాయక సలహాదారుడు నిర్వహించే పాత్రను వివరించండి. తమతమ నియామకాలను నిర్వహించడానికి, బైబిలు ముఖ్యాంశాల భాగంలో వ్యాఖ్యానించడానికి, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి పుస్తకం నుండి ప్రతివారం ఇవ్వబడే సలహాలను పాటించడానికి కృషిచేయమని అందరినీ ప్రోత్సహించండి.
15 నిమి: “నలిగిన హృదయంగలవారికి ఓదార్పు.”a ఒకటి లేదా రెండు స్థానిక అనుభవాలను క్లుప్తంగా చెప్పండి.
పాట 9 (37)
డిసెంబరు 17తో ప్రారంభమయ్యే వారం
పాట 20 (93)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.
15 నిమి: “పరిచర్యపట్ల మన ఉత్సాహం తగ్గకుండా చూసుకుందాం.”b పరిచర్యపట్ల ఉత్సాహం కనబరిచే ఒక ప్రచారకుణ్ణి ఇంటర్వ్యూ చేయండి. ఈ ప్రశ్నలు అడగండి: మీ ఉత్సాహం నీరుగారిపోకుండా ఉండడానికి మీరెలాంటి కృషి చేస్తున్నారు? ఉత్సాహం తగ్గకుండా ఉండడానికి మీకేది సహాయపడింది?
20 నిమి: “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చే పత్రికను ఉపయోగించండి.”c నవంబరు 2006 మన రాజ్య పరిచర్య 8వ పేజీలోని విషయాలపై వ్యాఖ్యానించమని అడగండి. జనవరి-మార్చి కావలికోట పత్రికను చదవమని ప్రేక్షకులను ప్రోత్సహించండి. తర్వాతి వారం జరిగే కూటానికి ఆ పత్రికను తీసుకురమ్మని చెప్పండి.
పాట 16 (143)
డిసెంబరు 24తో ప్రారంభమయ్యే వారం
పాట 26 (212)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. జనవరిలో అందించే సాహిత్యాల గురించి చెప్పి, స్థానికంగా అన్వయించుకోగల ఒక ప్రతిపాదనను ప్రదర్శింపజేయండి.
15 నిమి: తాజా పత్రికను పరిచర్యలో ఉపయోగించడానికి సిద్ధపడండి. జనవరి-మార్చి కావలికోట పత్రిక ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. పత్రిక గురించి క్లుప్తంగా వివరించిన తర్వాత, క్షేత్రంలోని ప్రజలకు దానిలోని ఏ ఆర్టికల్ ఆసక్తికరంగా ఉండవచ్చో, ఎందుకు ఉండవచ్చో ప్రేక్షకులను అడగండి. ప్రేక్షకులు తాము పరిచర్యలో చూపించాలనుకుంటున్న కొన్ని ఆర్టికల్స్ గురించి ఏమి చెప్పవచ్చో సలహాలివ్వమని అడగండి. సంభాషణను ప్రారంభించడానికి ఎలాంటి ప్రశ్న అడిగితే బాగుంటుంది? ఆర్టికల్‌లోని ఏ లేఖనం చదివితే బాగుంటుంది? లేఖనాన్ని ఆర్టికల్‌తో ఎలా ముడిపెట్టవచ్చు? పత్రికను ఎలా అందించాలో చూపించడానికి మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడిన నమూనా ప్రతిపాదనను లేదా ప్రేక్షకులు సూచించిన ఒక ప్రతిపాదనను ప్రదర్శింపజేయండి.
20 నిమి: “బైబిలు అధ్యయనాన్ని నిర్వహించాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి.”d ఈమధ్యే బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించిన ఒకరిద్దరిని ఇంటర్వ్యూ చేయండి. బైబిలు అధ్యయనం ఎలా ప్రారంభించబడింది? అదెలా నడుస్తోంది?
పాట 8 (53)
డిసెంబరు 31తో ప్రారంభమయ్యే వారం
పాట 23 (200)
10 నిమి: స్థానిక ప్రకటనలు. డిసెంబరు క్షేత్రసేవా రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి.
15 నిమి: దైవభక్తికున్న ప్రేరణా శక్తి. కావలికోట జూలై 1, 1990 22-3 పేజీల్లోని సమాచారం ఆధారంగా ఇచ్చే ప్రోత్సాహకరమైన ప్రసంగం.
20 నిమి: కష్టాలను ఎదుర్కొనేటప్పుడు ఆధ్యాత్మిక సమతుల్యతను కాపాడుకోండి. కావలికోట ఆగస్టు 15, 2006, 26-7 పేజీల్లోని 5-9 పేరాల ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ.
పాట 1 (13)
జనవరి 7తో ప్రారంభమయ్యే వారం
పాట 13 (124)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: స్థానిక అవసరాలు.
20 నిమి: “దేవుని సేవను ఎక్కువగా చేయండి.”e దేవుని సేవను ఎక్కువగా చేయడానికి కృషిచేస్తున్న సహోదరసహోదరీలు అలా చేసేందుకు అవకాశాల కోసం ఎలా వెదుకుతున్నారో చెప్పమనండి. ఒకటి, రెండు వ్యాఖ్యానాలను ముందుగానే సిద్ధంచేసుకోవచ్చు.
పాట 24 (185)
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితంచేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితంచేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితంచేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితంచేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
e ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషంకన్నా తక్కువ సమయానికి పరిమితంచేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.