కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/07 పేజీ 3
  • ప్రశ్నా భాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నా భాగం
  • మన రాజ్య పరిచర్య—2007
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘తగినవేళ ఆహారం’ మీరు పొందుతున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • 2వ సెక్షన్‌ రెఫరెన్సులు
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • 1వ సెక్షన్‌ రెఫరెన్సులు
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • ఇంటర్‌నెట్‌ ఉపయోగించడంలో రాగల ప్రమాదాల విషయమై అప్రమత్తులుగా ఉండండి!
    మన రాజ్య పరిచర్య—1999
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2007
km 9/07 పేజీ 3

ప్రశ్నా భాగం

◼ లేఖనాలను పరిశోధించడానికి లేదా చర్చించడానికి స్వతంత్రంగా సమకూడే సాక్షుల గుంపులను “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ఆమోదిస్తున్నాడా?​—మత్త. 24:45, 47.

లేదు, ఆమోదించడం లేదు. అయినా, ప్రపంచంలోని ఆయా ప్రాంతాల్లో, మన సంస్థలోని కొందరు సాక్షులు బైబిలు సంబంధిత అంశాలపై స్వతంత్రంగా పరిశోధన చేసేందుకు గుంపులుగా ఏర్పడ్డారు. కొందరు నూతనలోక అనువాదపు ప్రామాణికతను స్వయంగా విశ్లేషించడానికి బైబిలు సంబంధిత హీబ్రూ, గ్రీకు భాషలను అధ్యయనం చేసే స్వతంత్ర గుంపును ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు బైబిలుకు సంబంధించిన విజ్ఞానశాస్త్ర అంశాలను పరిశోధిస్తున్నారు. వారు తమ అభిప్రాయాలను ఒకరితో ఒకరు పంచుకునేందుకు లేదా చర్చించుకునేందుకు వెబ్‌సైట్లను, ఛాట్‌రూమ్‌లను తయారుచేసుకున్నారు. తాము కనుగొన్నవాటిని తెలియజేసి మన సాహిత్యాల ద్వారా మన క్రైస్తవ కూటాల్లో మనకు అందించబడుతున్న వాటికి అదనపు సమాచారం చేర్చేందుకు చిన్న చిన్న సమావేశాలను కూడా జరుపుకొని, పుస్తకాలను ముద్రిస్తున్నారు.

ప్రపంచమంతటా ఉన్న యెహోవా ప్రజలు, సంఘ కూటాలద్వారా, సమావేశాలద్వారానే కాక, యెహోవా సంస్థ అందించే సాహిత్యాలద్వారా కూడా సమృద్ధిగా ఆధ్యాత్మిక ఉపదేశాన్ని, ప్రోత్సాహాన్ని పొందుతున్నారు. తన ప్రజలందరూ ‘ఏకమనస్సుతో ఏకతాత్పర్యముతో’ ‘విశ్వాసమందు స్థిరపరచబడేలా’ యెహోవా తన పరిశుద్ధాత్మ నిర్దేశంలో, తన సత్యవాక్యం ఆధారంగా, మనకవసరమైన దానిని దయచేస్తాడు. (1 కొరిం. 1:10; కొలొ. 2:6, 7) ఈ అంత్యదినాల్లో యెహోవా అందించే ఆధ్యాత్మిక ఏర్పాట్లపట్ల నిశ్చయంగా మనం కృతజ్ఞతను కలిగివున్నాం. కాబట్టి, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ తన నిర్దేశంలో ప్రచురించబడని లేదా వ్యవస్థీకరించబడని ఎలాంటి సాహిత్యాలనైనా, కూటాలనైనా, లేదా వెబ్‌సైట్లనైనా ఆమోదించడం లేదు.​—మత్త. 24:45-47.

సువార్తకు మద్దతునివ్వడానికి కొందరు తమ ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించాలనుకోవడం మెచ్చుకోదగిన విషయమే. అయితే, నేడు భూమిపైనున్న తన సంఘంద్వారా యేసుక్రీస్తు నెరవేరుస్తున్నదాని నుండి వ్యక్తిగత ప్రయత్నమేదైనా ప్రక్కదారిపట్టకూడదు. ‘విశ్వాససంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము’ ఉన్న ‘మితంలేని వంశావళులు’ వంటి అంశాల గురించిన చర్చలు అలసట కలిగించి, సమయాన్ని వృథాచేస్తాయి. అలాంటి చర్చల్లో నిమగ్నమయ్యే విషయంలో అపొస్తలుడైన పౌలు మొదటి శతాబ్దంలో హెచ్చరించాడు. (1 తిమో. 1:3-7) క్రైస్తవులందరూ “అవివేక తర్కములును వంశావళులను కలహములును ధర్మశాస్త్రమునుగూర్చిన వివాదములును నిష్‌ప్రయోజనమును వ్యర్థమునై యున్నవి గనుక వాటికి దూరముగా ఉండ[డానికి]” ప్రయత్నించాలి.​—తీతు 3:9.

బైబిలును అదనంగా అధ్యయనం చేయాలనుకునే లేదా పరిశోధించాలనుకునే వారు లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం), “ప్రతిలేఖనము విశ్వసనీయమైనది, ప్రయోజనకరమైనది,” బైబిల్లోని దానియేలు, యెషయా, ప్రకటన పుస్తకాల్లోని ప్రవచనాల వంటివాటిని చర్చించే మరితర సాహిత్యాలను పరిశీలించాల్సిందిగా మేము సిఫారసు చేస్తున్నాం. ఈ సాహిత్యాలు బైబిలు అధ్యయనానికి, ధ్యానించడానికి అవసరమైన అధిక సమాచారాన్ని అందిస్తాయి, ఆ విధంగా మనం “సంపూర్ణజ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచు[కుంటాం].”​—కొలొ. 1:9-12.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి