ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు సెప్టెంబరులో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? మొదటి సందర్శనంలోనే బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రత్యేకంగా కృషి చేయండి. గృహస్థుల దగ్గర ఈ ప్రచురణ అప్పటికే ఉన్నట్లైతే, బైబిలు అధ్యయనాన్ని క్లుప్తంగా ప్రదర్శించడం ద్వారా వారు ఆ పుస్తకం నుండి ఎలా ప్రయోజనం పొందగలరో చూపించండి. అక్టోబరులో: కావలికోట, తేజరిల్లు! పత్రికలు. ఆసక్తి చూపించిన చోట, బైబిలు అధ్యయనాలను ప్రారంభించాలనే ఉద్దేశంతో మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్ని అందించి దానిని చర్చించండి. నవంబరులో: నా బైబిలు కథల పుస్తకము. తమకు పిల్లలు లేరని గృహస్థులు చెబితే వారికి అప్రమత్తంగా ఉండండి! బ్రోషుర్‌ని అందించండి. డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకం. దానికి ప్రత్యామ్నాయంగా, యెహోవాకు సన్నిహితమవండి లేదా కుటుంబ సంతోషానికిగల రహస్యము పుస్తకాలను అందజేయవచ్చు.
◼ సెప్టెంబరు నెలలో ఐదు వారాంతాలు ఉన్నాయి కాబట్టి, సహాయ పయినీరు సేవ చేయడానికి అది అనువైన నెల.
◼ సంఘాలు వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ 2006, సీడీ-రామ్‌లో ఉన్న వాచ్‌టవర్ లైబ్రరీ—2007 ఎడిషన్ (ఆంగ్లం) కోసం తమ రిక్వెస్టులను తర్వాతి సాహిత్యపు రిక్వెస్ట్‌తోపాటు పంపించడం ప్రారంభించాలి. ఈ వాచ్‌టవర్ లైబ్రరీ—2007 ఎడిషన్ సంఘంలో కేవలం బాప్తిస్మం తీసుకున్న ప్రచారకులకే లభ్యమవుతుందని, అది కేవలం సంఘం ద్వారానే లభ్యమౌతుందని దయచేసి గమనించండి.
◼ 2008వ సంవత్సరపు జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఇచ్చే ప్రత్యేక బహిరంగ ప్రసంగం 2008, మార్చి 31వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఇవ్వబడుతుంది. ప్రసంగాంశం తర్వాత ప్రకటించబడుతుంది. ఆ వారాంతంలో ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శన లేక సమావేశం ఉండే సంఘాలకు ఆ తర్వాతి వారంలో ప్రత్యేక ప్రసంగం ఇవ్వబడుతుంది. ఏ సంఘంలో కూడా మార్చి 31వ తేదీతో ప్రారంభమయ్యే వారంకన్నా ముందు ప్రత్యేక ప్రసంగం ఇవ్వకూడదు.
◼ 2008 జనవరి మొదలుకొని తేజరిల్లు! తెలుగు, నేపాలీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ప్రచురించబడదు. కన్నడ, గుజరాతీ, తమిళం, పంజాబీ, మలయాళం, హిందీ భాషల్లో త్రైమాసిక ప్రతిగా ప్రచురించబడుతుంది.
◼ సంఘ పైవిచారణకర్త లేదా ఆయన నియమించిన మరొకరు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన సంఘ అకౌంట్స్‌ను ఆడిట్ చేయాలి. ఆడిట్ చేసిన తర్వాత, సంఘంలో తర్వాతి అకౌంట్స్ రిపోర్టుతోపాటు దాన్ని చదవాలి.—ఇన్‌స్ట్రక్షన్ ఫర్ కాంగ్రిగేషన్ అకౌంటింగ్ (S-27) చూడండి.
◼ ట్రస్టు ఏర్పాటున్న సంఘాలు తమ ఆన్యూవల్ జనరల్ మీటింగ్స్‌ను (ఎజిఎమ్) నిర్ణీత సమయంలోగా నిర్వహించాలని గుర్తుచేయబడుతున్నాయి. ఎజిఎమ్‌లో, ఇంకా ఇతర ట్రస్టు మీటింగ్‌లలో చర్చించిన అన్ని విషయాలను తగిన రీతిలో మినిట్స్ పుస్తకంలో రాసిపెట్టాలి. ట్రస్టుకు సంబంధించిన జమాఖర్చులను చార్టర్డ్ అకౌంటెంట్ (CA) ద్వారా ఆడిట్ చేయించాలి. ఆడిట్ చేయబడిన ట్రస్టు జమాఖర్చులకు సంబంధించిన కాపీని బ్రాంచి కార్యాలయానికి పంపించాలి. 2006-2007 ఆర్థిక సంవత్సరంలో, ట్రస్టుకు సంబంధించిన ఖర్చులు చేయడానికన్నా ముందు మీ ట్రస్ట్ ఆదాయం 1,00,000/- కన్నా పైగా ఉంటే ఆదాయపు పన్నును ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంటుకి తప్పనిసరిగా చెల్లించాలి. ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961, 12A సెక్షన్ క్రింద ట్రస్ట్ రిజిష్టర్ అయ్యేలా కూడా చూడండి. 12A సెక్షన్ క్రింద మీ ట్రస్టు ఆదాయం పన్నును చెల్లించే విషయంలో, రిజిస్ట్రేషన్ విషయంలో మీ చార్టర్డ్ అకౌంటెంట్ మీకు సహాయం చేయగలుగుతాడు.
◼ లభ్యమయ్యే కొత్త ప్రచురణలు:
యెహోవాకు స్తుతిగీతాలు పాడండి (29 పాటలు)—గుజరాతీ
మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? (కరపత్రం నం. 26)—కొంకణి (దేవనాగరి)
◼ మళ్ళీ లభ్యమయ్యే ప్రచురణలు:
గొప్ప బోధకుడి నుంచి నేర్చుకోండి—తమిళం
కుటుంబ సంతోషానికిగల రహస్యము—కన్నడ, నేపాలీ, పంజాబీ, మలయాళం, హిందీ
యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు—ఆంగ్లం, తమిళం, నేపాలీ, హిందీ
మాట్లాడే సామర్థ్యాన్నీ, బోధించే సామర్థ్యాన్నీ మీరు ఎలా మెరుగుపర్చుకోవచ్చు?—నేపాలీ
‘వెళ్ళి బాప్తిస్మమిస్తూ వారిని శిష్యులను చేయండి’—బెంగాలీ
యెహోవాకు స్తుతిగీతాలు పాడండి (29 పాటలు)—నేపాలీ
బాధలు ఎప్పటికైనా అంతమవుతాయా? (కరపత్రం నం. 75)—అస్సామీ, ఆంగ్లం, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, పంజాబీ, మలయాళం, మరాఠీ, హిందీ