సేవా కూటాల పట్టిక
సెప్టెంబరు 10తో ప్రారంభమయ్యే వారం
పాట 9 (37)
5 నిమి: స్థానిక ప్రకటనలు.
20 నిమి: “ఇంటర్‌నెట్ ఉపయోగించడంలో రాగల ప్రమాదాల విషయమై అప్రమత్తులుగా ఉండండి!” మన రాజ్య పరిచర్య నవంబరు 1999 సంచికలోని మధ్యపేజీల్లో 10-18 పేరాలను, 27-36 పేరాలను సమర్థుడైన ఒక పెద్ద ప్రశ్నాజవాబుల చర్చ ద్వారా నిర్వహిస్తాడు. 12, 13, 18 పేరాలను చదవండి.
20 నిమి: “యేసు ఉంచిన మాదిరిని అనుకరించండి.”a ఇతరుల మంచి మాదిరి ద్వారా తామెలా ప్రయోజనం పొందారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 22 (130), ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 17తో ప్రారంభమయ్యే వారం
పాట 17 (187)
10 నిమి: స్థానిక ప్రకటనలు. 4వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ సెప్టెంబరు 15 కావలికోటను, జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను ఎలా అందించాలో ప్రదర్శించండి. మాట్లాడేది ఒక పత్రిక గురించే అయినా ప్రతీ ప్రదర్శనలో రెండు పత్రికలను జంటగా ఇవ్వాలి.
15 నిమి: గత సంవత్సరంలో మనమెలా చేశాం? పరిచర్యలో సాధించిన ప్రోత్సాహకరమైన విషయాలపై దృష్టి నిలుపుతూ సేవా పైవిచారణకర్త గత సేవా సంవత్సరంలో చేసిన సేవను సమీక్షిస్తాడు. సముచితమైన విధంగా మెచ్చుకోండి. కొత్త సేవా సంవత్సరంలో దృష్టి నిలపాల్సిన ఒకటి రెండు రంగాలను వివరించండి. పయినీర్ల కార్యకలాపాల గురించి వ్యాఖ్యానించండి, వారు ఉత్సాహంగా చేస్తున్న పనిని మెచ్చుకోండి. నిష్క్రియులైనవారికి సహాయపడేందుకు చేసిన కృషివల్ల సాధించిన సత్ఫలితాల గురించి చెప్పండి.
20 నిమి: సమైక్య సౌభ్రాతృత్వం. యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం అనే పుస్తకంలోని 16వ అధ్యాయం ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ.
పాట 11 (85), ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 24తో ప్రారంభమయ్యే వారం
పాట 18 (162)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి.
15 నిమి: ప్రశ్నా భాగం. ప్రేక్షకులతో పెద్ద చేసే చర్చ. సమయం అనుమతిస్తే, ఉదాహరించబడిన లేఖనాలను చదివి చర్చించండి.
20 నిమి: అక్టోబరులో, బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి బైబిలు గురించి తెలుసుకోండి అనే కరపత్రాన్ని ఉపయోగించండి. అక్టోబరులో కావలికోట, తేజరిల్లు! పత్రికలను అందించాలి. ఆసక్తి కనబరచిన చోట బైబిలు అధ్యయనాలు ఆరంభించడానికి బైబిలు గురించి తెలుసుకోండి అనే కరపత్రాన్ని ఉపయోగించవచ్చు. కరపత్రం అందుబాటులో ఉంటే, అటెండెంట్లు హాజరైన వారందరికీ ఒక్కొక్క కాపీని అందించిన తర్వాత దాన్ని క్లుప్తంగా చర్చించండి. గృహస్థునికి మొదటి సందర్శనంలో లేదా పునర్దర్శనంలో కరపత్రంలోని విషయాలను, పూర్తిగా గానీ కొంతభాగాన్ని గానీ వివరించవచ్చు. 4వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ అక్టోబరు 1 కావలికోటను, అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ఒక ప్రదర్శనలో ప్రచారకుడు, గృహస్థుడు పత్రికలను తిరస్కరించిన తర్వాత కరపత్రం ఇస్తాడు. వేరే ప్రదర్శనలో, గృహస్థుడు పత్రికలను స్వీకరించిన తర్వాత ప్రచారకుడు కరపత్రాన్ని అందించి, దానిలోని 5వ పేజీని గృహస్థునితో చర్చించి, బైబిలు బోధిస్తోంది అనే పుస్తకంలోని విషయసూచికను చూపించి, బైబిలు అధ్యయనాల కోసం పుస్తకం తయారుచేయబడిందని వివరించి, పుస్తకాన్ని అందిస్తాడు.
పాట 29 (222), ముగింపు ప్రార్థన.
అక్టోబరు 1తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (45)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. సెప్టెంబరు క్షేత్రసేవ రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తుచేయండి.
15 నిమి: బ్రాంచి ఉత్తరం. ఈ సంచిక ముందుపేజీలోవున్న ఉత్తరం ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. గత సంవత్సరం “విడుదల సమీపించింది” జిల్లా సమావేశానికి ప్రజలను ఆహ్వానించేందుకు ఏర్పాటుచేయబడిన ప్రచార కార్యక్రమంలో లేదా ఈ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణ హ్యాండ్‌బిల్‌ను అందించడానికి ఏర్పాటుచేయబడిన ప్రచార కార్యక్రమంలో భాగం వహిస్తున్నప్పుడు స్థానికంగా ఎదురైన అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను అడగండి.
20 నిమి: “ఉత్తేజకరమైన మార్పులతో కావలికోట!”b
పాట 4 (43), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.