క్రొత్త ప్రత్యేక సమావేశదిన కార్యక్రమం
2008వ సేవా సంవత్సరంలోని ప్రత్యేక సమావేశదిన కార్యక్రమ ముఖ్యాంశం, “మనము జిగటమన్ను—యెహోవా మన కుమ్మరి.” ఇది యెషయా 64:8 పై ఆధారపడింది. ఈ కార్యక్రమం ద్వారా అందించబడే లేఖన ఉపదేశం గొప్ప కుమ్మరిగావున్న యెహోవా జ్ఞానంపట్ల, న్యాయంపట్ల, శక్తిపట్ల, ప్రేమపట్ల మనకున్న గౌరవాన్ని, అవగాహనను పెంచుతుంది.
ప్రాంతీయ పైవిచారణకర్త ఇచ్చే “పరిచర్యలో ఘనమైన పాత్రలుగా పనిచేయడం” అనే ప్రసంగం, అనేకమంది సత్యాన్ని తెలుసుకొని, దానిని ఇతరులతో పంచుకోవడం ద్వారా అధిక ఆశీర్వాదాలను ఎలా పొందుతున్నారో చూపిస్తుంది. యెహోవా నీతి సూత్రాలను ధ్యానించడం ఎలా ఒక కాపుదలగా ఉంటుందో “ధ్యానం మిమ్మల్ని కాపాడుతుంది” అనే ప్రసంగం తెలియజేస్తుంది. సందర్శక ప్రసంగీకుడు ‘ఈ లోక మర్యాదను అనుసరించకుండా’ ఉండడం, “గొప్ప కుమ్మరిచేత మలచబడండి” అనే అంశాలపై ప్రసంగిస్తాడు. “యెహోవాకు ఉపయోగపడే యౌవనులు,” “మలచే ప్రక్రియలో తల్లిదండ్రుల ప్రముఖ పాత్ర” అనే భాగాల ద్వారా తల్లిదండ్రులు, యౌవనులు ప్రోత్సహించబడతారు. మన సహోదర, సహోదరీలు తమ పరిచర్యలో ఏమి సాధించగలుగుతున్నారో ప్రదర్శనల ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా వినేందుకు, గమనించేందుకు మనం సంతోషిస్తాం. దేవునికి తాము చేసుకున్న సమర్పణకు సూచనగా నీటిద్వారా బాప్తిస్మం తీసుకోవాలనుకునేవారు వీలైనంత త్వరగా సంఘ పైవిచారణకర్తకు తెలియజేయాలి. ప్రత్యేక సమావేశదిన కార్యక్రమం రోజున ఆ వారంలో అధ్యయనం చేయబోయే మీ కావలికోట ప్రతిని తప్పకుండా తెచ్చుకోండి.
గొప్ప కుమ్మరి తాను సంకల్పించింది నెరవేరుస్తాడు. అయితే ఆయన మనల్ని మలుస్తున్నప్పుడు ఎలా స్పందిస్తామో మనలో ప్రతీ ఒక్కరం నిర్ణయించుకోవాలి. యెహోవా ప్రమాణాలకు, దిద్దుబాట్లకు జ్ఞానయుక్తంగా విధేయులయ్యేవారు, కుమ్మరి సారె మీదున్న మట్టిముద్దలా, చక్కగా రూపొందించబడిన, మెరుగులుదిద్దబడిన, ఉపయోగకరమైన పాత్రలుగా మలచబడవచ్చు. మనం యెహోవాతో సహకరించినప్పుడు, మనమాయన సర్వాధిపత్యాన్ని మహిమపర్చి అనేక ఆశీర్వాదాలను పొందుతాం.