పత్రికల గురించి ఏమని చెప్పాలి?
కావలికోట మే 15
“మీరు ఈ ప్రశ్నకు ఏమని జవాబిస్తారు? [కవరు పేజీపై ఉన్న ప్రశ్నను చదివి, ప్రతిస్పందించనివ్వండి.] బైబిలు, ఆశావహ దృక్పథంతో ఉండడానికిగల కారణాన్ని వివరిస్తోంది. [మత్తయి 6:9, 10 చదవండి.] ఈ పత్రిక, దేవుని రాజ్యం భూమిపట్ల దేవునికున్న సంకల్పం నెరవేరేలా ఎలా చేస్తుందో వివరిస్తుంది.”
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“ఇక్కడున్న మాటలు ఎప్పటికైనా నెరవేరడాన్ని మనం చూస్తామని మీకు అనిపిస్తుందా? [యెషయా 33:24 చదవండి. ఆ తర్వాత ప్రతిస్పందించనివ్వండి.] వైద్యశాస్త్రం ఏమి సాధిస్తోంది, బైబిలు వాగ్దానం ఎలా నెరవేరబోతోంది అనే ఈ పత్రిక విషయాలను వివరిస్తోంది.”
కావలికోట జూన్ 1
“చెడు కార్యాలు చేసే ప్రజల గురించిన వార్తలు మనం దాదాపు ప్రతి రోజూ వింటూనే ఉన్నాం. [ఇటీవల జరిగిన, స్థానికంగా తెలిసిన ఒక ఉదాహరణను పేర్కొనండి.] అదృశ్యమైన దుష్ట శక్తి ఏదో ప్రజలను ప్రభావితం చేస్తోందని మీకెప్పుడైనా అనిపించిందా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత ప్రకటన 12:12 చదవండి.] ఈ పత్రిక మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చో వివరిస్తుంది.”
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“ఈ ప్రాచీన సామెతను మీరు అంగీకరిస్తారని నేననుకుంటున్నాను. [సామెతలు 22:3 చదవండి.] మన చుట్టూ నైతిక ప్రమాణాలు త్వరితగతిన క్షీణిస్తుండగా, మనం ఈ మంచి సలహాను పాటించి, చెడు ఒత్తిడిని ఎదిరించేందుకు మన యౌవనస్థులను ఎలా సిద్ధం చేయవచ్చు? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత 26వ పేజీలో ఉన్న ఆర్టికల్‌ను చూపించండి.] ఈ విషయంలో ఈ పత్రిక మనకు ఎంతో ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తుంది.”