ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు ఏప్రిల్, మేలలో: కావలికోట, తేజరిల్లు! విడి పత్రికలు అందించండి. ఆసక్తిగలవారిని పునర్దర్శిస్తున్నప్పుడు లేదా జ్ఞాపకార్థ ఆచరణకు లేదా సంఘంలోని ఇతర ప్రత్యేక దైవపరిపాలనా కార్యక్రమాలకు హాజరవుతూ సంఘంతో మాత్రం క్రియాశీలంగా సహవసించని వారిని సందర్శిస్తున్నప్పుడు, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది అనే క్రొత్త పుస్తకాన్ని ప్రతిపాదించడానికి కృషి చేయండి. వారితో బైబిలు అధ్యయనం ఆరంభించే లక్ష్యంతో ఆ పుస్తకాన్ని ప్రతిపాదించండి. జూన్: సృష్టికర్త లేదా కుటుంబ సంతోషం పుస్తకాన్ని అందించండి. జూలై, ఆగస్టులలో: ఈ క్రింద ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, అప్రమత్తంగా ఉండండి!, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, పరదైసును తీసుకొనివచ్చు ప్రభుత్వము, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే.
◼ మే నెల మొదలుకొని మీరు రిక్వెస్టు చేయకుండానే 2007 జిల్లా సమావేశ బ్యాడ్జి కార్డులు మీ సాహిత్యాలతోపాటు పంపించబడతాయి. ప్రతీ సంఘ పరిమాణాన్ని పరిగణలోకి తీసుకొని 25 బ్యాడ్జి కార్డులున్న కట్టలను పంపిస్తారు. కాబట్టి మీ సంఘపు ప్రాథమిక భాషలో కాక వేరే భాషలో బ్యాడ్జి కార్డులు లేక అదనపు బ్యాడ్జి కార్డులు అవసరమైతే తప్ప వాటి కోసం రిక్వెస్ట్ చేయనవసరం లేదు. అదనపు బ్యాడ్జి కార్డులు అవసరమైతే, లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్ (S-14)ను ఉపయోగించి రిక్వెస్టు చేయాలి.
◼ అప్లికేషన్ ఫర్ రెగ్యులర్ పయినీర్ సర్వీస్ (S-205) ఫారాలూ, అప్లికేషన్ ఫర్ ఆగ్జిలరీ పయినీర్ సర్వీస్ (S-205b) ఫారాలూ సంఘంలో కావలసినన్ని ఉండేలా సంఘ కార్యదర్శులు చూసుకోవాలి. ఈ ఫారాలను లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్ (S-14) ద్వారా ఆర్డర్ చేయవచ్చు. ఒక సంవత్సరానికి సరిపడే ఫారాలు అందుబాటులో ఉండేలా చూసుకోండి. క్రమ పయినీరు దరఖాస్తులను బ్రాంచికి పంపే ముందు వాటిలో వివరాలన్నీ నింపబడేలా చూడండి.
◼ సంఘ పైవిచారణకర్తల, కార్యదర్శులందరి చిరునామాలనూ టెలిఫోన్ నంబర్లనూ బ్రాంచి కార్యాలయం తాజాగా నమోదు చేసుకోవాలి. కాబట్టి చిరునామా లేదా టెలిఫోన్ నంబరు మారితే సంఘ సేవా కమిటీ, ప్రిసైడింగ్ ఓవర్‌సీయర్/సెక్రటరీ ఛేంజ్ ఆఫ్ అడ్రస్ (S-29) ఫారమ్‌ను పూరించి, సంతకం చేసి వెంటనే బ్రాంచి కార్యాలయానికి పంపించాలి. టెలిఫోన్ ఎస్‌టిడి కోడ్‌లు మారితే వాటిని కూడా తెలియజేయాలి.
◼ మీరు స్వంత పనులమీద విదేశాలకు వెళ్తున్నప్పుడు, ఆ దేశంలోని సంఘ కూటాలకుగానీ, ప్రాంతీయ సమావేశానికిగానీ, జిల్లా సమావేశానికిగానీ హాజరవాలనుకుంటే, వాటి తేదీల, సమయాల, చిరునామాల గురించిన సమాచారం కోసం మీరు వెళ్ళే దేశాన్ని పర్యవేక్షించే బ్రాంచి కార్యాలయానికే వ్రాయాలి. బ్రాంచి కార్యాలయాల చిరునామాలు ఇప్పటి వార్షికపుస్తకము (ఆంగ్లం)లో చివరిపేజీలో ఉన్నాయి.
◼ లిటరేచర్ ఐటమ్స్ కోసమైన వార్షిక క్యాలెండర్ ప్రకారం, లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్ (S-14)లో ఇవ్వబడిన ఫారాలను రాబోయే సేవా సంవత్సరం కోసం ఏప్రిల్ నెలలో రిక్వెస్ట్ చెయ్యాలి. దయచేసి లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్ (S-14)లో పేర్కొన్న ఫారాల్లో మీకు సంవత్సరానికి ఎన్ని ఫారాలు కావాలో సమీక్షించి, వచ్చే నెలలో సాహిత్యాల కోసం మీరు పంపే రిక్వెస్ట్‌తో కలిపి పంపించండి. తరచూ సంఘాలు ఒకటి లేదా రెండు ఫారాలకు మాత్రమే అత్యవసర రిక్వెస్టులు పంపిస్తున్నట్లు గమనించబడింది. ఫారాల రిక్వెస్టును సాహిత్య రిక్వెస్టుతో జతచేసి పంపించాలి, అలా చేస్తే వాటిని పంపించడానికయ్యే ఖర్చు, సమయం బ్రాంచికి ఆదా అవుతాయి.
◼ నవంబరు 2006, 27వ తేదీతో ప్రారంభమయ్యే వారంలోని సేవా కూటంలో చర్చించబడిన “రక్తంలోని సూక్ష్మభాగాలను, నా రక్తం ఇమిడివున్న వైద్యవిధానాలను నేనెలా దృష్టిస్తాను?” అనే అంశానికి సంబంధించి ప్రచారకులకు అదనంగా జ్ఞాపకం చేయాల్సిన అంశాలు ఏమైనావుంటే వాటిని పుస్తక అధ్యయన పైవిచారణకర్తలు ప్రచారకులకు తెలియజేయాలి.
◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:
నా బైబిలు కథల పుస్తకం కోసం అధ్యయన ప్రశ్నలు—మిజో
◼ అందుబాటులో ఉన్న రివైజ్డ్ సీడీ:
కింగ్‌డమ్ మెలొడీస్ (MP3), 4వ వాల్యూమ్
◼ అందుబాటులో ఉన్న క్రొత్త డీవీడీలు:
యోహాను సువార్త—అమెరికన్ సంజ్ఞా భాష
సువార్తను ప్రకటించడానికి సంస్థీకరించబడ్డాము మరియు విశ్వవ్యాప్తంగా ఉన్న మన సౌభ్రాతృత్వం—ఆంగ్లం
ఒక డీవీడీ కాపీ మార్చి 2007, మన రాజ్య పరిచర్యతోపాటు పంపించబడింది, ప్రచారకులు వీడియో చూడాలనుకున్నప్పుడు దాన్ని సంఘ లైబ్రరీలో నుండి తీసుకొని తర్వాత తిరిగి ఇచ్చివేయవచ్చు. మరిన్ని కాపీలు లభ్యమైతే వాటి గురించి మన రాజ్య పరిచర్యలో ప్రకటించబడుతుంది, అప్పుడు మాత్రమే మీరు అదనపు కాపీల కోసం రిక్వెస్టులను పంపించవచ్చు.
◼ మళ్ళీ లభ్యమవుతున్న ప్రచురణలు:
అప్రమత్తంగా ఉండండి!—నేపాలీ
సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు?—ఆంగ్లం, కన్నడ, తెలుగు, మరాఠీ