దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, 2007 ఏప్రిల్ 30వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు మౌఖికంగా పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2007 మార్చి 5 నుండి 2007 ఏప్రిల్ 30 మధ్య వారాల్లోని నియామకాల సమాచారంపై 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేకపోతే, మీరే స్వయంగా పరిశోధించి జవాబులను తెలుసుకోవాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]
ప్రసంగ లక్షణాలు
1. మన ప్రసంగ సంక్షిప్త ప్రతిని ఎలా సరళంగా ఉంచుకోవచ్చు? [be 168వ పేజీ, 4వ పేరా]
2. సమాచారాన్ని తర్కబద్ధంగా అందించగల నాలుగు మార్గాలను పేర్కొనండి. [be 170వ పేజీ, 3వ పేరా-172వ పేజీ 4వ పేరా]
3. ప్రసంగంలో ఏమి చేర్చాలి అనేది నిర్ణయించుకునేటప్పుడు ఏ విషయాలను మనసులో ఉంచుకోవాలి? [be 173వ పేజీ, 1-2 పేరాలు]
4. పదేపదే నోట్సు చూడకుండా ప్రసంగించడంలోని కొన్ని ప్రయోజనాలేమిటి? [be 175వ పేజీ, 3-5 పేరాలు]
5. సంభాషణా శైలిలో మాట్లాడడం ఎందుకు ప్రాముఖ్యం, ఈ లక్షణాన్ని మనం ఎలా పెంపొందించుకోవచ్చు? [be 179వ పేజీ, 4వ పేరా, బాక్సు; be 180వ పేజీలోని బాక్సు]
ఒకటవ నియామకం
6. వారపు బైబిలు పఠనంలో నుండి ముఖ్యాంశాలను అందించడానికి నియమించబడిన సహోదరుడు ఎలా సిద్ధపడాలి? [be 47వ పేజీ, 3-4 పేరాలు]
7. క్రీస్తు విమోచన క్రయధనం ద్వారా మనం పొందే ప్రయోజనాలకన్నా ఏది అత్యంత ప్రాముఖ్యమైనది? [w05 11/1 14వ పేజీ, 1వ పేరా]
8. బహిరంగ ప్రసంగంలో లేఖనాలను ఎలా ఉపయోగించాలి? [be 53వ పేజీ, 1-2 పేరాలు]
9. బోధకునిగా యేసు లక్ష్యమేమిటి, ఆయనను మనమెలా అనుకరించవచ్చు? [be 57వ పేజీ, 1వ పేరా]
10. బోధించడంలో రెండు విషయాలకున్న వ్యత్యాసాల్ని చూపించడం ఎందుకు ప్రభావవంతంగా ఉంటుంది? [be 57వ పేజీ, 3-4 పేరాలు]
వారపు బైబిలు పఠనం
11. ‘పురాతన మార్గములో, మేలు కలుగు మార్గంలో’ నడవమని యిర్మీయా 6:16 లో ఇవ్వబడిన సలహాను అన్వయించుకోవడానికి మనమెలా కృషి చేయవచ్చు?
12. విశ్వాసఘాతకులైన యూదులకు గుణపాఠం చెప్పడానికి యెహోవా సంకుబుడి కొంగను ఎందుకు ఎంపిక చేసుకున్నాడు, దీనినుండి మనమేమి నేర్చుకోవచ్చు? (యిర్మీ. 8:7)
13. నేడు వినోదం విషయంలో మనకున్న దృక్కోణాన్ని యిర్మీయా 15:17 ఎలా ప్రభావితం చేస్తుంది?
14. గొప్ప కుమ్మరియైన యెహోవా దేవుని చేతిలో మానవులు ఎలా జిగటమన్నులా ఉన్నారు? (యిర్మీ. 18:5-11)
15. యిర్మీయా 25:17-26 లో పట్టిక వేయబడిన జనాంగాల క్రమం, మన కాలంలో ఎలాంటి ప్రాధాన్యతను కలిగివుంది?