కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/07 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2007
  • ఉపశీర్షికలు
  • ఏప్రిల్‌ 9తో ప్రారంభమయ్యే వారం
  • ఏప్రిల్‌ 16తో ప్రారంభమయ్యే వారం
  • ఏప్రిల్‌ 23తో ప్రారంభమయ్యే వారం
  • ఏప్రిల్‌ 30తో ప్రారంభమయ్యే వారం
  • మే 7తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2007
km 4/07 పేజీ 2

సేవా కూటాల పట్టిక

గమనిక: సంవత్సరమంతటిలో ప్రతీవారం కోసం, మన రాజ్య పరిచర్యలో ఒక సేవా కూటం పట్టిక వేయబడుతుంది. “క్రీస్తును అనుసరించండి!” అనే జిల్లా సమావేశానికి హాజరయ్యేందుకు వీలుగా సంఘాలు తగిన మార్పులు చేసుకోవచ్చు. సముచితమైన చోట, జిల్లా సమావేశానికి హాజరవడానికి ముందు జరిగే సేవా కూటంలో, ఈ నెల ప్రతిలోని మధ్యపేజీల్లోవున్న స్థానికంగా అన్వయించే సలహాలను, జ్ఞాపికలను మరోసారి గుర్తుచేయడానికి 15 నిమిషాలను వెచ్చించండి. సమావేశం ముగిసిన ఒకటి లేదా రెండు నెలల తర్వాత ఒక సేవా కూటంలో (బహుశా స్థానిక అవసరాలు భాగాన్ని నిర్వహించే బదులు) ప్రచారకులకు పరిచర్యలో సహాయకరమనిపించిన సమావేశ అంశాలను పునఃసమీక్షించడానికి 15 నుండి 20 నిమిషాలను కేటాయించండి. సమీక్షను సేవా పైవిచారణకర్త నిర్వహించాలి. ఆ సమాచారాన్ని ప్రచారకులు తమ పరిచర్యలో ఎలా అన్వయించుకుంటున్నారో లేదా ఎలా అన్వయించుకోవాలనుకుంటున్నారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.

ఏప్రిల్‌ 9తో ప్రారంభమయ్యే వారం

పాట 8 (53)

10 నిమి: స్థానిక ప్రకటనలు. 8వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగించి, ఏప్రిల్‌ 15 కావలికోటను, ఏప్రిల్‌-జూన్‌ తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ఒక ప్రదర్శనలో, ప్రచారకుడు ఏదైనా ఒక ప్రశ్నను అడిగి, దానికి సమాధానం పునర్దర్శనంలో ఇస్తానని చెప్పడాన్ని చేర్చండి.

15 నిమి: “కొత్త శిష్యులను చేయడంలో అందరూ భాగం వహించవచ్చు.”a 4వ పేరాను పరిశీలిస్తున్నప్పుడు, బాప్తిస్మం తీసుకునేముందు సంఘంలోని సభ్యులు తమనెలా ప్రోత్సహించారో చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి. ఒకటి, రెండు వ్యాఖ్యానాలను ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు.

20 నిమి: “‘క్రీస్తును అనుసరించండి!’ అనే జిల్లా సమావేశపు ప్రచారానికి ప్రపంచవ్యాప్తంగా చేసే సమైక్య కృషి.”b 3వ పేరాను చర్చిస్తున్నప్పుడు, గత సంవత్సరం జిల్లా సమావేశపు ఆహ్వానప్రతులను పంచినప్పుడు స్థానికంగా తమకు ఎదురైన చక్కని అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను అడగండి లేదా మన వార్షిక పుస్తకములోని 7వ పేజీ నుండి 10వ పేజీలోని ఉపశీర్షిక వరకు ఉన్న సమాచారంపై వ్యాఖ్యానాలను చేర్చండి.

పాట 4 (43), ముగింపు ప్రార్థన.

ఏప్రిల్‌ 16తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (45)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్యలో నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.

15 నిమి: “‘నిర్భయంగా దేవుని వాక్యాన్ని బోధించండి.’”c సమయం అనుమతిస్తే, ఉదాహరించబడిన లేఖనాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

20 నిమి: “సంపూర్ణంగా సాక్ష్యమివ్వడానికి శిక్షణ పొందడం” 1వ భాగం. కావలికోట, జనవరి 1, 2005 సంచికలోని 12-14 పేజీలలో ఉన్న 1-10 పేరాల ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. తర్వాతి వారపు చర్చకు సిద్ధపడడానికి ఆర్టికల్‌లోని మిగతా భాగాన్ని చదవమని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించండి.

పాట 1 (13), ముగింపు ప్రార్థన.

ఏప్రిల్‌ 23తో ప్రారంభమయ్యే వారం

పాట 22 (130)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. 8వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన ఇతర సూచనలను ఉపయోగిస్తూ మే 1 కావలికోటను, ఏప్రిల్‌-జూన్‌ తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి.

10 నిమి: “ఇదిగో! అద్భుతమైన వెలుగు!” కావలికోట, మార్చి 15, 2007 12-14 పేజీల ఆధారంగా ప్రసంగం.

25 నిమి: “సంపూర్ణంగా సాక్ష్యమివ్వడానికి శిక్షణ పొందడం” 2వ భాగం. కావలికోట జనవరి 1, 2005 సంచికలోని 14-17 పేజీల్లో ఉన్న 11-24 పేరాల ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ.

పాట 3 (32), ముగింపు ప్రార్థన.

ఏప్రిల్‌ 30తో ప్రారంభమయ్యే వారం

పాట 17 (187)

5 నిమి: స్థానిక ప్రకటనలు. ఏప్రిల్‌ క్షేత్ర సేవా రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తుచేయండి.

10 నిమి: స్థానిక అవసరాలు.

30 నిమి: “గౌరవాన్ని ప్రదర్శించడం ద్వారా క్రీస్తును అనుసరించండి.”d సంఘ కార్యదర్శి నిర్వహించాలి. సంఘం నియమించబడిన సమావేశాన్ని పేర్కొనండి. “జిల్లా సమావేశపు జ్ఞాపికలు” అనే బాక్సును చర్చించండి.

పాట 6 (45), ముగింపు ప్రార్థన.

మే 7తో ప్రారంభమయ్యే వారం

పాట 19 (164)

10 నిమి: స్థానిక ప్రకటనలు.

15 నిమి: ఆరాధనా స్థలాల కోసం ఏర్పాట్లు. యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం అనే పుస్తకంలోని 11వ అధ్యాయం ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ.

20 నిమి: “ప్రజలు ఇళ్ళలో లేనప్పుడు.”e సేవా పైవిచారణకర్త నిర్వహించాలి.

పాట 20 (93), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

e ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి