కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/07 పేజీ 8
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2007
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2008
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2003
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2004
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2007
km 2/07 పేజీ 8

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

కావలికోట ఫిబ్ర. 15

“మానవులు భూమిని నాశనం చేస్తున్నారని కొంతమంది భావిస్తున్నారు. మీరెప్పుడైనా దానిగురించి బాధపడ్డారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఓదార్పుకరమైన ఈ వాగ్దానాన్ని గమనించండి. [ప్రకటన 11:18 చదవండి.] ఈ గ్రహాన్ని సాటిలేనిదిగా చేసేదేమిటో తెలియజేసే సమాచారం ఈ పత్రికలో ఉంది. ఈ భూమి భవిష్యత్తు గురించి బైబిలు ఏమి చెబుతుందో కూడా ఈ పత్రిక తెలియజేస్తోంది.”

తేజరిల్లు! జన.-మార్చి

“ప్రేమగల, న్యాయవంతుడైన, శక్తివంతుడైన దేవుడు ఉంటే, మన చుట్టూ ఇన్ని బాధలు ఎందుకు ఉన్నాయని మీరెప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి.] బాధలకు కారణమేమిటనే దానిగురించి ఈ లేఖనం ఏమి చెబుతోందో గమనించండి. [1 యోహాను 5:19 చదవండి.] బాధలను తొలగించడానికి దేవుడు ఏమి చేస్తున్నాడో ఈ పత్రిక బైబిలు నుండి వివరిస్తుంది.”

కావలికోట మార్చి 1

“మతాలన్నీ దేవుని దగ్గరికి నడిపిస్తాయని అనేకులు అభిప్రాయపడతారు. ఒక వ్యక్తి ఏ మతాన్ని ఎన్నుకుంటాడనేది అంత ప్రాముఖ్యమని మీరు భావిస్తున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఇందులోని ఉపదేశాన్ని గమనించండి. [1 యోహాను 4:1 చదవండి.] బోధలు దేవుని నుండి వచ్చినవో కావో మనం ఎలా పరీక్షించవచ్చో ఈ పత్రిక చర్చిస్తుంది. అంతేకాక, వివిధ మతాలు ఏ కారణాలవల్ల ఆవిర్భవించాయో కూడా ఇది వివరిస్తుంది.”

తేజరిల్లు! జన.-మార్చి

“నేడు చాలామంది యౌవనస్థులకు ఇంట్లో తమ తల్లిదండ్రులు తమపై ఆంక్షలు విధించడం ఇష్టం ఉండదు. దీని విషయంలో జ్ఞానియైన ఒక వ్యక్తి ఒకప్పుడు ఏమి చెప్పాడో నేను మీ కోసం చదువుతాను, నేను చదివిన దానిగురించి మీ అభిప్రాయమేమిటో తెలియజేస్తే నేను సంతోషిస్తాను. [సామెతలు 6:⁠20 చదివి, వారిని ప్రతిస్పందించనివ్వండి. 10వ పేజీలోని ఆర్టికల్‌ చూపించండి.] ఇంట్లో తల్లిదండ్రులు విధించే ఆంక్షల విషయంలో యౌవనస్థులు ఏమి చేయాలో గ్రహించేందుకు ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి