కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/07 పేజీలు 3-5
  • యెహోవా గుణాతిశయములను ప్రచురం చేయండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా గుణాతిశయములను ప్రచురం చేయండి
  • మన రాజ్య పరిచర్య—2007
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రొత్త సేవా సంవత్సరంలో ఓ చక్కని లక్ష్యాన్ని పెట్టుకోండి
    మన రాజ్య పరిచర్య—2007
  • కావలెను—4,000 మంది సహాయ పయినీర్లు
    మన రాజ్య పరిచర్య—1997
  • నీవు సహాయ పయినీరుగా చేయగలవా?
    మన రాజ్య పరిచర్య—1992
  • మనమా లక్ష్యాన్ని మళ్లీ సాధిస్తామా?—సహాయ పయినీర్ల కొరకు మరొక పిలుపు
    మన రాజ్య పరిచర్య—1998
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2007
km 2/07 పేజీలు 3-5

యెహోవా గుణాతిశయములను ప్రచురం చేయండి

1. యెహోవా గుణాతిశయములను ప్రచురం చేయడానికి మనల్ని ఏది పురికొల్పుతుంది?

1 “యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి.” (1 దిన. 29:11) యెహోవాపట్ల మనకున్న ప్రేమ, కృతజ్ఞత మనల్నెలా ప్రభావితం చేస్తాయి? ‘చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం’ చేసేలా మనల్ని పురికొల్పుతాయి. (1 పేతు. 2:9) మన గొప్ప దేవుని గురించి ఇతరులకు చెప్పకుండా ఉండలేము. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో యెహోవా గుణాతిశయములను ప్రచురం చేయడానికి విశేషమైన అవకాశాలు మనకు లభిస్తాయి.

2. జ్ఞాపకార్థ ఆచరణను ప్రకటించడానికి ఏ ప్రత్యేక ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేయబడింది, దానిలో ఎవరు భాగంవహించవచ్చు?

2 జ్ఞాపకార్థ ఆచరణ గూర్చి ప్రకటించడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమం: ఏప్రిల్‌ 2 సోమవారం, మనం ప్రభువు రాత్రి భోజనాన్ని ఆచరించడం ద్వారా యెహోవా గుణాతిశయములను ఉన్నతపరుస్తాము. ఈ ప్రాముఖ్యమైన సంఘటన గురించిన ప్రత్యేక ఆహ్వానాలు మార్చి 17 నుండి ఏప్రిల్‌ 2 వరకు ప్రపంచవ్యాప్తంగా పంచిపెట్టబడతాయి. అందరూ దీనిలో పూర్తిగా భాగంవహించాలని ప్రోత్సహించబడుతున్నారు. క్రొత్తవారు సువార్త ప్రకటించడానికి అర్హులైతే అలా చేయడం ప్రారంభించడానికి ఇదే మంచి తరుణం. మీ పిల్లలు గానీ, మీ బైబిలు విద్యార్థులు గానీ అర్హులయ్యే అవకాశముంటే, చొరవ తీసుకొని పెద్దలతో మాట్లాడండి.

3. జ్ఞాపకార్థ ఆచరణకు ప్రజలను ఆహ్వానించడానికి మనమేమి చెప్పవచ్చు?

3 ఈ ప్రచార కార్యక్రమం, “విడుదల సమీపించింది!” అనే జిల్లా సమావేశం సమయంలో చేసిన ప్రచార కార్యక్రమంలాంటిదే. ప్రతీ ప్రచారకునికి 50 ఆహ్వానపత్రికలు, పయినీర్లకు 150 పత్రికలు లభించేలా సంఘాలన్నింటికీ సరిపోయే సంఖ్యలో ఆహ్వానపత్రికలు పంపించబడతాయి. మీరు క్లుప్తంగా ఇలా చెప్పవచ్చు: “రాబోయే ప్రాముఖ్యమైన వార్షిక ఆచరణకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము, ఇది మీకివ్వబడుతున్న ఆహ్వానపత్రిక. ఇందులో వివరాలు ఉన్నాయి.” ఒకవేళ గృహస్థునికి ఏమైనా ప్రశ్నలుంటే వాటికి జవాబివ్వడానికి సమయం తీసుకోండి. ఈ విషయంలో బైబిలు బోధిస్తోంది పుస్తకంలోని అనుబంధంలో 206వ పేజీలోవున్న ప్రభువు రాత్రి భోజనం అనే ఆర్టికల్‌ బహుశా సహాయకరంగా ఉండవచ్చు. వారాంతాల్లో ఆహ్వానపత్రికతో పాటు తాజా పత్రికలను అందిస్తాము. ఆసక్తిగలవారిని గుర్తుంచుకొని, వారిని పునర్దర్శించడానికి ఏర్పాట్లు చేసుకోండి.

4. ప్రత్యేక జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రికలు ఎలా పంచిపెట్టబడతాయి?

4 సాధ్యమైనప్పుడెల్లా ఈ ప్రత్యేక ఆహ్వానపత్రికను గృహస్థుని చేతికే ఇవ్వండి. కాబట్టి, తాళం వేసివున్న ఇళ్ళను గుర్తుపెట్టుకొని, మరొక సమయంలో ఆ ఇంటివారిని కలిసేలా ఏర్పాటు చేసుకోండి. సంఘాల్లో ఆహ్వానపత్రికలు ఎక్కువగా మిగిలిపోతే, జ్ఞాపకార్థ ఆచరణకు ముందు వారంలో తాళం వేసివున్న ఇళ్ళదగ్గర వదిలిపెట్టవచ్చు, కానీ అంతకంటే ముందు అలా వదిలిపెట్టకూడదు. మీరు పునర్దర్శనం చేస్తున్నవారికి, బైబిలు విద్యార్థులకు, బంధువులకు, తోటి ఉద్యోగస్థులకు, పొరుగువారికి, పరిచయస్థులైన ఇతరులకు కూడా ఈ ఆహ్వానపత్రికను తప్పక ఇవ్వండి.

5. సహాయ పయినీరు సేవ చేయడానికి మనం ప్రణాళికలు వేసుకోవడం ఇప్పటినుండే ఎందుకు ప్రారంభించాలి?

5 సహాయ పయినీరు సేవ: మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో సహాయ పయినీరు సేవ చేయడం ద్వారా మీరు యెహోవా గుణాతిశయములను మరింత సంపూర్ణంగా ప్రచురం చేయగలరా? అలా చేయడానికి మీ రోజూవారీ కార్యక్రమాల్లో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. (ఎఫె. 5:15-17) యెహోవా సేవలో మరింత ఎక్కువ చేయడానికి ప్రయత్నించడం ఆనందాన్ని, యెహోవా ఆశీర్వాదాలను తీసుకొస్తుందని మీరు నమ్మకంతో ఉండవచ్చు. (సామె. 10:22) జ్ఞాపకార్థ ఆచరణ కాలం సమీపిస్తోంది కాబట్టి, ప్రణాళికలు వేసుకోవడం ప్రారంభించడానికి ఇదే సమయం.​—సామె. 21:5.

6. గత సంవత్సరం సహాయ పయినీరు సేవ చేసిన 90 ఏళ్ళ సహోదరి అనుభవం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

6 గత సంవత్సరం, 90 ఏళ్ళ ఒక సహోదరికి సహాయ పయినీరు సేవ చేసే ఆధిక్యత లభించింది. ఆమె ఇలా చెప్పింది: “నాకు తోట పని అంటే చాలా ఇష్టం, మొక్కలు నాటడం ప్రారంభించాలనుకున్నాను, కానీ దేనికి ప్రాధాన్యతనివ్వాలో నిర్ణయించుకోవలసిన అవసరం ఉందని గుర్తించాను. రాజ్య సంబంధ విషయాలకు ప్రథమస్థానమివ్వాలనే కోరికతో మార్చిలో సహాయ పయినీరు సేవ చేయాలని నిర్ణయించుకున్నాను.” ఆమె చేసిన కృషికి ఆశీర్వదించబడిందా? “నేను సంఘానికి మరింత సన్నిహితమైనట్లు భావించాను, అది నన్ను యెహోవాకు ఇంకా సన్నిహితం చేసింది” అని ఆమె చెబుతోంది. మనం మన ప్రాధాన్యతలను విశ్లేషించుకొని, అలాంటి అవసరమైన సర్దుబాట్లు చేసుకోగలమా?

7. సహాయ పయినీరు సేవ చేయడం కష్టమా?

7 సహాయ పయినీరు సేవకు వెచ్చించాల్సిన 50 గంటల లక్ష్యాన్ని చేరుకోవడం మీరు అనుకున్నంత కష్టంగా ఉండకపోవచ్చు. మీ దైనందిన పనులను ప్రార్థనాపూర్వకంగా పరిశీలించుకుని ఏ పని ఎప్పుడు చేయాలనేది ప్రణాళిక వేసుకొని, దాన్ని రాజ్య సంబంధిత కార్యకలాపాల పట్టికలో వ్రాసిపెట్టుకోండి. మీ పరిస్థితుల గురించి మీకే బాగా తెలుసు. ఒకవేళ మీ ఆరోగ్యం సరిగా లేకపోవడంవల్ల ఒంట్లో శక్తిలేకపోతే, బహుశా మీరు రోజుకి కేవలం రెండు గంటలే పరిచర్యలో భాగంవహించవచ్చు. మీరు ఉద్యోగం చేస్తుంటే లేదా స్కూలుకి వెళ్తుంటే మీరు సాయంత్రాల్లో లేదా వారాంతాల్లో పరిచర్యలో పాల్గొనడం ద్వారా సహాయ పయినీరు సేవ చేయవచ్చు.

8. ఒక వివాహ జంటకు సహాయ పయినీరు సేవ చేయడానికి ఏమి సహాయం చేసింది?

8 చాలామంది కుటుంబ సమేతంగా సహాయ పయినీరు సేవ చేయగలిగారు. ఒక వివాహ జంట సహాయ పయినీరు సేవ చేయడానికి తమ పరిస్థితులు అనుకూలించవని అనుకొని గత సంవత్సరాల్లో దానికి దరఖాస్తు నింపడానికి సంకోచించారు. అయితే దాని విషయంలో వారేమి చేశారు? “చాలా కాలంగా మేము కలిసి చేయాలనుకుంటున్న దానిని చేసేందుకు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించాము.” చక్కని ప్రణాళికతో వారు తమ లక్ష్యాన్ని చేరుకోగలిగారు. వారింకా ఇలా చెబుతున్నారు: “అది చాలా అద్భుతంగా ఉంది. మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. మీరు ప్రయత్నించి చూడండి అనేదే మా సలహా. మేము చేశామంటే మీరు కూడా చేయగలుగుతుండవచ్చు.”

9. రాబోయే నెలల్లో జరిగే ప్రత్యేక కార్యకలాపాలకు సిద్ధపడేందుకు ఈసారి కుటుంబ అధ్యయనంలో మీరేమి చేయవచ్చు?

9 రాబోయే నెలల్లో కుటుంబ సభ్యులందరూ పరిచర్యలో ఎలా ఎక్కువ సమయం గడపవచ్చో పరిశీలించడానికి, ఈసారి చేయబోయే కుటుంబ అధ్యయనంలో కొంత సమయాన్ని ఎందుకు కేటాయించుకోకూడదు? మీ కుటుంబమంతా సహాయ పయినీరు సేవ చేయలేకపోయినా, కుటుంబంలోని ఇతర సభ్యుల సహాయసహకారాలతో బహుశా ఒక్కరైనా చేయవచ్చు. అది సాధ్యం కాకపోతే, బహుశా మీ కుటుంబం ప్రత్యేక కార్యకలాపాలున్న ఈ నెలల్లో అదనపు గంటలు పరిచర్యలో గడిపేలా లక్ష్యాలను పెట్టుకోవచ్చు.

10. ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో సహాయ పయినీరు సేవ చేయాలనే మన కోరిక గురించి ఇతరులతో ఎందుకు మాట్లాడాలి?

10 ఒకరికొకరు సహాయపడండి: ఉత్సాహం ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. సహాయ పయినీరు సేవ చేయాలనే మీ కోరిక గురించి ఇతరులతో మాట్లాడండి. అది ఇతరులు దరఖాస్తు నింపేలా ప్రోత్సహించవచ్చు. అంతేకాక, మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ పనులను, సమయాన్ని ఎలా ప్రణాళిక వేసుకోవాలో గతంలో పయినీరు సేవ చేసినవారు మీకు సలహాలను ఇవ్వవచ్చు. (సామె. 15:​22) మీరు సహాయ పయినీరు సేవ చేయగలిగితే, ఆ ఆనందదాయకమైన పనిలో మీతోపాటు కలిసి పనిచేయడానికి బహుశా మీలాంటి పరిస్థితులే ఉన్న మరో ప్రచారకుణ్ణి/రాలిని ఎందుకు ఆహ్వానించకూడదు?

11. రాబోయే నెలల్లో సహాయ పయినీరు సేవచేసేలా పెద్దలు ఇతరుల్లో ఎలా ఉత్సాహం నింపవచ్చు?

11 చాలామంది పెద్దలు ఈ ప్రత్యేక తరహా సేవలో భాగం వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. (హెబ్రీ. 13:⁠7) ఇది సంఘానికి నిజంగా ఎంతో ప్రోత్సాహకరమైనది. ఇతరులతో సంభాషిస్తున్నప్పుడు కూడా పెద్దలు వారిలో ఉత్సాహాన్ని నింపుతారు. కొంతమంది సహాయ పయినీరు సేవ చేసేలా పురికొల్పబడడానికి ప్రోత్సాహకరమైన కొన్ని దయగల మాటలు లేదా కొన్ని ఆచరణాత్మక సలహాలు మాత్రమే సరిపోతుండవచ్చు. ఉద్యోగం లేక స్కూలు ముగిసిన తర్వాత సంఘమంతా కలసి సాక్ష్యమివ్వడంలో భాగం వహించేలా, సేవా పైవిచారణకర్త క్షేత్రసేవ కోసం అదనపు కూటాలను ఏర్పాటుచేస్తుండవచ్చు. ఈ ఏర్పాట్ల గురించి ఎప్పటికప్పుడు సంఘ ప్రకటనల్లో తెలియజేయాలి. అందరికీ సరిపడా క్షేత్రం, సాహిత్యం ఉండేలా కూడా ఆయన చూస్తాడు.

12. మీరు సహాయ పయినీరు సేవ చేయలేకపోతే ఏమి చేయవచ్చు?

12 సహాయ పయినీరు సేవ చేయడానికి మీ పరిస్థితులు అనుకూలించకపోయినా, దానిని చేసేవారిని మీరు ప్రోత్సహించవచ్చు, వారికోసం ప్రార్థించవచ్చు. (సామె. 25:11; కొలొ. 4:12) పరిచర్యలో వారితోపాటు భాగం వహించడానికి వారంలో ఏదో ఒకరోజు గడపడానికి లేదా సాధారణంగా పరిచర్యలో మీరు గడిపే సమయంకన్నా ఎక్కువ సమయం గడపడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు.

13. ఇండియాలోని ప్రచారకుల ముందు ఎలాంటి లక్ష్యం ఉంది, దాన్ని చేరుకోవడానికి మీ సంఘం ఎలా తోడ్పడవచ్చు?

13 ఏప్రిల్‌లో 4,500 మంది సహాయ పయినీరు సేవ చేయాలనే లక్ష్యం: ఇండియా బ్రాంచి కార్యాలయ క్షేత్రంలో 2006వ సంవత్సరం ఏప్రిల్‌లో సహాయ పయినీర్ల శిఖరాగ్ర సంఖ్య 3,216కు చేరుకుంది. కాబట్టి రాబోయే ఏప్రిల్‌లో 4,500 మంది సహాయ పయినీరు సేవ చేయాలనే లక్ష్యం ఉంది. ప్రతీ సంఘంలోనూ 5 మంది ప్రచారకుల్లో ఒకరు సహాయ పయినీరు సేవ చేస్తే మనమా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. కొన్ని సంఘాల్లో, సహాయ పయినీరు సేవ చేసేందుకు పరిస్థితులు అనుకూలించే ప్రచారకులు మరింతమంది ఉంటారనేది నిజమే. చాలా సంఘాలకు అలాంటి లక్ష్యాన్ని చేరుకోవడం సులభమే. ఇది మీ సంఘంలో రేకెత్తించే నూతనోత్తేజాన్ని, మీ క్షేత్రంలోని ప్రకటనాపనిపై అది చూపే సానుకూల ప్రభావాన్ని ఊహించండి!

14. సహాయ పయినీరు సేవ చేయడానికి ఏప్రిల్‌ ఎందుకు అనువైన నెల?

14 ఏప్రిల్‌ నెల సహాయ పయినీరు సేవ చేయడానికి ఎందుకు అనువైన నెల? జ్ఞాపకార్థ ఆచరణ నెల ప్రారంభంలోనే ఉంటుంది కాబట్టి దానికి హాజరైనవారందర్నీ పునర్దర్శించేలా మనకు చక్కని అవకాశం ఉంటుంది. మనం పునర్దర్శనం చేసేవారికి బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని అందించి, బైబిలు అధ్యయనం ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుగా పత్రికలు ఇస్తాం. కాబట్టి ఏప్రిల్‌ నెలలో సహాయ పయినీరు సేవ చేయడం వల్ల బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ఎన్నో అవకాశాలు లభిస్తాయి. ఈ దేశంలో రోజులో వెలుతురు ఉండే గంటలు ఎక్కువగా ఉంటాయి, సాయంత్రాల్లో చల్లని వాతావరణం ఉంటుంది. అంతేకాదు, స్కూలుకి వెళ్ళేవారు, ఉద్యోగం చేసేవారు సహాయ పయినీరు సేవ చేసేందుకు సులభంగా ఉండేలా ఏప్రిల్‌లో ఐదు ఆదివారాలున్నాయి, ఆ నెలలో పాఠశాలలకు సెలవులు ఉంటాయి.

15. ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలం సమీపిస్తుండగా మనమెందుకు అత్యవసర భావాన్ని కలిగివుండాలి?

15 గడిచే ప్రతీ జ్ఞాపకార్థ ఆచరణ కాలం, మనం ఈ విధాన అంతానికి ఒక సంవత్సరం దగ్గరయ్యేలా చేస్తుంది. మన గొప్ప దేవుని గురించి ఇతరులతో చెప్పడానికి మిగిలివున్న సమయం అంతకంతకూ తక్కువౌతుంది. (1 కొరిం. 7:29) ఒకసారి జ్ఞాపకార్థ ఆచరణ కాలం గడిచిపోయిందంటే మన పరలోక తండ్రికి స్తుతి చెల్లించడానికి లభించే అమూల్యమైన అవకాశాలు చేజారిపోయినట్టే. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో యెహోవా గుణాతిశయములను ప్రచురం చేయడానికి మనం చేయగలిగినదంతా చేయడానికి ఇప్పుడే ఏర్పాట్లు చేసుకుందాము!

[4వ పేజీలోని బాక్సు]

ఏప్రిల్‌లో 4,500 మందిమి సహాయ పయినీరు సేవ చేయగలమా?

◼ మీ ప్రాధాన్యతలను విశ్లేషించుకోండి

◼ కుటుంబంగా మీ లక్ష్యాలను చర్చించండి

◼ మీ ప్రణాళికల గురించి ఇతరులతో మాట్లాడండి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి