దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, 2007 ఫిబ్రవరి 26వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2007 జనవరి 1 నుండి ఫిబ్రవరి 26 మధ్య వారాల్లోని నియామకాల సమాచారంపై 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేకపోతే, మీరే స్వయంగా పరిశోధించి జవాబులను తెలుసుకోవాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]
ప్రసంగ లక్షణాలు
1. ప్రసంగిస్తున్నప్పుడు ఆచరణాత్మక అన్వయింపు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి? [be 158వ పేజీ, 2-4 పేరాలు]
2. మనం అందజేస్తున్న సమాచారపు ఆచరణాత్మక విలువను గ్రహించేందుకు ఇతరులకు సహాయం చేయడం ఎందుకు ప్రాముఖ్యం, దీన్ని మనమెలా చేయవచ్చు? [be 159వ పేజీ, 3-4 పేరాలు]
3. మన పదాల ఎంపిక ఎందుకు ప్రాముఖ్యమైనది? [be 160వ పేజీ]
4. వైవిధ్యభరితమైన పదాలను ఖచ్చితంగా ఉపయోగించడానికి మనకేమి సహాయం చేస్తుంది? [be 161వ పేజీ, 5-6 పేరాలు; 162వ పేజీ, 1, 4 పేరాలు]
5. సంక్షిప్త ప్రతిని మనస్సులోనో లిఖితపూర్వకంగానో రూపొందించుకొని దాని ఆధారంగా ప్రసంగించడంవల్ల కలిగే కొన్ని ప్రయోజనాలేమిటి? [be 166వ పేజీ, 1-3 పేరాలు]
ఒకటవ నియామకం
6. చదివే నియామకానికి సిద్ధపడడంలో ఏమి ఇమిడివుంది? [be 43వ పేజీ, 2, 4 పేరాలు]
7. యెహోవాకు సరైనదానిపట్ల ఉన్న ప్రేమను, సరికానిదానిపట్ల ఉన్న ద్వేషాన్ని మనం అలవర్చుకోవడానికి మనకు ఏది చాలా అవసరం? (హెబ్రీ. 5:14) [w05 1/1 9వ పేజీ 11వ పేరా]
8. దేవుడు న్యాయంగా, సరిగా చర్య తీసుకున్నాడా లేదా అని మనకు సందేహం కలిగించేదేదైనా మనం బైబిల్లో చదివినప్పుడు మనం ఏమి గుర్తుంచుకోవాలి? [w05 2/1 24వ పేజీ 7వ పేరా]
9. మానవ అధికారానికి దేవుని నియమాలకు మధ్య విభేదం ఏర్పడినప్పుడు మనమెలా ప్రతిస్పందించాలి? [w05 4/15 12వ పేజీ 9వ పేరా]
10. మెస్సీయ రాజ్యంపై, ఆయనకు ముందుగా వచ్చిన బాప్తిస్మమిచ్చే యోహానుపై యెషయా గ్రంథము ఎలా దృష్టి కేంద్రీకరిస్తుంది? [bsi06 31వ పేజీ, 35వ పేరా]
వారపు బైబిలు పఠనం
11. యెషయా 25:7 లో ప్రస్తావించబడిన “ముసుకు” మరియు “తెర” అంటే ఏమిటి?
12. ప్రజలు ఏ విధంగా యెహోవాను ‘చూడవచ్చు,’ ఆయన చెప్పేది ‘వినవచ్చు’? (యెష. 30:20, 21)
13. సత్యమా అసత్యమా: యెషయా 38:3లో వ్రాయబడివున్న హిజ్కియా ప్రార్థన కేవలం దీర్ఘకాలం జీవించాలన్న కోరికతోనే పురికొల్పబడింది.
14. ఇశ్రాయేలీయులు యెహోవాకు సాక్షులుగా ఎలా సేవచేశారు, మనం వారిని ఎలా అనుకరించవచ్చు? (యెష. 43:10)
15. యెషయా 52:11, 12 లో చూపించబడిన ప్రవచనార్థక మాదిరికి అనుగుణంగా, ‘యెహోవా సేవోపకరణములను మోయడానికి’ ఏమి అవసరం?