పత్రికల గురించి ఏమని చెప్పాలి?
కావలికోటడిసెం. 15
“సంవత్సరంలోని ఈ సమయంలో, చాలామంది యేసు జన్మించినప్పుడు దేవదూతలు ప్రకటించిన దాని గురించి ఆలోచిస్తారు. [లూకా 2:14 చదవండి.] భూమ్మీద సమాధానం నిజంగా వస్తుందని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] యేసు త్వరలోనే భూమ్మీద నిజమైన సమాధానాన్ని ఎలా తీసుకువస్తాడో ఈ పత్రిక చర్చిస్తుంది.”
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“అనేకులు మనం సృష్టించబడ్డామనుకుంటారు. ఇతరులు మనం పరిణామంద్వారా వచ్చామనుకుంటారు. మీరేమనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] సరియైన ముగింపుకు రావడానికి మనకు సహాయంచేసే ఈ సలహాను గమనించండి. [యోబు 12:7, 8 చదవండి.] తేజరిల్లు! యొక్క ఈ ప్రత్యేక సంచిక ప్రకృతిలో కనబడే రూపకల్పన నుండి, జ్ఞానం నుండి మనమేమి నేర్చుకోవచ్చనే విషయాన్ని చర్చిస్తుంది.”
కావలికోటజన. 1
“ఒక వ్యక్తి దగ్గర ఉన్న ధనాన్నిబట్టి అతని విజయం అంచనా వేయబడుతుందని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి. తర్వాత 1 తిమోతి 6:9, 10 చదవండి.] బైబిలు ధనాన్ని ఖండించకపోయినా నిజమైన విజయం ధనం మీద ఆధారపడి ఉండదని అది సూచిస్తోంది. ఆ విషయాన్ని ఈ పత్రిక వివరిస్తుంది.”
తేజరిల్లు! జన.-మార్చి
“ప్రేమ, న్యాయం, శక్తిగల దేవుడున్నట్లయితే, లోకంలో ఎందుకింత బాధ ఉందని మీరెప్పుడైనా అనుకున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] బాధకు గల కారణాన్ని గురించి ఈ లేఖనం ఏమి చెబుతుందో గమనించండి. [1 యోహాను 5:19 చదవండి.] బాధను తొలగించడానికి దేవుడేమి చేస్తున్నాడనే విషయాన్ని ఈ పత్రిక బైబిలు నుండి వివరిస్తుంది.”