పత్రికల గురించి ఏమని చెప్పాలి?
కావలికోటనవం. 15
“లోకంలో అవినీతి ప్రబలంగా ఉంది కాబట్టి, ‘సరైనది చేయడానికి నేనెందుకు పోరాడాలి?’ అని కొందరు ఆలోచిస్తారు, మీరెప్పుడైనా అలా అనుకున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] ప్రోత్సాహాన్నిచ్చే ఈ మాటలను గమనించండి. [సామెతలు 2:21, 22 చదవండి.] యథార్థవంతులుగా ఉండడానికిగల ముఖ్య కారణాన్ని ఈ పత్రిక వివరిస్తుంది.”
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“చాలామంది ప్రజలు దేవునిమీద విశ్వాసముంచడం విజ్ఞానశాస్త్రం ప్రకారం యుక్తమేనా అని ఆలోచిస్తారు?” మీరేమనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి. తర్వాత హెబ్రీయులు 3:4 చదవండి.] సృష్టికర్తను విశ్వసించేందుకు కొంతమంది శాస్త్రజ్ఞులకు సహాయం చేసిన రుజువులేమిటో తేజరిల్లు! యొక్క ఈ ప్రత్యేక సంచిక చర్చిస్తుంది.
కావలికోటడిసెం. 1
“నేడు ఈ బైబిలు ప్రవచనం నెరవేరుతున్నట్లు మీరు భావిస్తున్నారా? [మత్తయి 24:11 చదవండి. ప్రతిస్పందించనివ్వండి.] ప్రఖ్యాతిగాంచిన కొన్ని బోధల గురించి ఈ పత్రిక వివరిస్తుంది. అంతేగాక, అబద్ధబోధకుల చేతిలో మోసపోకుండా ఎలా ఉండవచ్చో కూడా ఈ పత్రిక వివరిస్తుంది.”
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“ఈ ప్రాచీన లేఖనంపై నేను మీ అభిప్రాయాన్ని కోరుతున్నాను. [హెబ్రీయులు 3:4 చదవండి, ప్రతిస్పందించనివ్వండి. 21వ పేజీలోని ఆర్టికల్‌వైపు త్రిప్పండి.] ప్రముఖ శాస్త్రజ్ఞులు కొందరు ఎందుకు సృష్టిని నమ్ముతున్నారో ఈ ఆర్టికల్ వివరిస్తుంది.”