సేవా కూటాల పట్టిక
నవంబరు 13తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (45)
10 నిమి:స్థానిక ప్రకటనలు. 8వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే ప్రతిపాదనలను ఉపయోగిస్తూ, నవంబరు 15 కావలికోటను, అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ఒక ప్రదర్శనలో “మీరు చేసే పని నాకు బాగా తెలుసు” అని చెప్పి సంభాషణను ఆటంకపర్చే వ్యక్తితో ఎలా వ్యవహరించాలో చూపించండి.—బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకంలో 12వ పేజీ చూడండి.
20 నిమి:సువార్త సేవకులు. యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం అనే పుస్తకంలోని 77వ పేజీ నుండి 83వ పేజీలోని ఉపశీర్షిక వరకు ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ.
15 నిమి:“ధైర్యంగా ఉంటూనే సమాధానంగా ప్రకటించడం.”a పరిచర్య పాఠశాల పుస్తకంలో 252-3 పేజీల్లో “ఎప్పుడు విడిచిపెట్టాలి?” అని ఏటవాలు అక్షరాలతో వ్రాయబడిన ఉపశీర్షిక క్రింది వ్యాఖ్యానాలను చేర్చండి.
పాట 4 (43), ముగింపు ప్రార్థన.
నవంబరు 20తో ప్రారంభమయ్యే వారం
పాట 21 (191)
10 నిమి:స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.
15 నిమి:స్థానిక అవసరాలు.
20 నిమి:డిసెంబరులో మహాగొప్ప మనిషి పుస్తకాన్ని ప్రతిపాదించడం. ప్రేక్షకులతో చర్చ. మహాగొప్ప మనిషి పుస్తకంలో వారికి నచ్చిన విషయాన్ని, గతంలో అది అందించడంవల్ల ఎదురైన చక్కని అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి. మన రాజ్య పరిచర్య, జనవరి 2005, మధ్య పేజీల్లో ఇవ్వబడిన మాదిరి అందింపులను సమీక్షించండి. అక్కడ ఇవ్వబడిన మాదిరి అందింపుల్లో ఒక దానిని లేదా స్థానికంగా మీ క్షేత్రంలో సమర్థవంతంగా ఉండగల అందింపును ఉపయోగించి ఆ పుస్తకాన్ని ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి.
పాట 5 (46), ముగింపు ప్రార్థన.
నవంబరు 27తో ప్రారంభమయ్యే వారం
పాట 8 (53)
5 నిమి:స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి.
10 నిమి:దేవుణ్ణి స్తుతించేందుకు సమైక్యంగా ఆరాధనా స్థలాలను నిర్మించడం. నవంబరు 1, 2006, కావలికోటలో 17-21 పేజీల ఆధారంగా ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం.
15 నిమి:“పత్రికలు అందించడానికి ఎలా సిద్ధపడాలి?”b ఇద్దరు ప్రచారకులు బహుశా భార్యాభర్తలు, 8వ పేజీలో సూచించబడిన (కావలికోట డిసెంబరు 1, లేదా అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!) అందింపును ఎన్నుకొని దానినెలా ఉపయోగించాలనుకుంటున్నారో, వారి సొంత మాటల్లో ఎలా చెప్పాలనుకుంటున్నారో చూపించే మూడునిమిషాల ప్రదర్శనను చేర్చండి. ఆ తర్వాత, వారిప్పుడు చర్చించిన ఆర్టికల్‌లోని సలహాలను ఉపయోగిస్తూ, తమ క్షేత్రానికి సమయోచితమైనదని తాము కనుగొన్న మరొక ఆర్టికల్‌ను ఎలా అందించవచ్చో సిద్ధపడి, ప్రదర్శిస్తారు.
15 నిమి:“రక్తంలోని సూక్ష్మభాగాలను, నా రక్తం ఇమిడివున్న వైద్యవిధానాలను నేనెలా దృష్టిస్తాను?” ప్రశ్నాజవాబుల చర్చ, ప్రదర్శన. ఈ భాగాన్ని నిర్వహించే పెద్ద బ్రాంచి అందించిన ప్రసంగ ప్రతిని జాగ్రత్తగా అనుసరించాలి.
పాట 25 (204), ముగింపు ప్రార్థన.
డిసెంబరు 4తో ప్రారంభమయ్యే వారం
పాట 23 (200)
10 నిమి:స్థానిక ప్రకటనలు. నవంబరు నెల క్షేత్రసేవా రిపోర్టులను ఇవ్వమని ప్రచారకులకు గుర్తు చేయండి.
15 నిమి:“ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది!”c పుస్తకంలోని ప్రత్యేక అంశాలైన బాక్సులను, చిత్రాలను సమర్థవంతంగా ఉపయోగించమని సంఘాన్ని ప్రోత్సహించండి. ప్రతీ అధ్యయనం చివర్లో, ఆ పాఠాన్ని బైబిలు ఆధారంగా సమీక్షించాలి.
20 నిమి:సమాధానం ఇచ్చేటప్పుడు బైబిలును ఉపయోగించండి. కావలికోట, ఆగస్టు 15, 2002 సంచికలోని 17-18 పేజీల్లోవున్న “మనం బోధించే సత్యాలంటే ప్రేమను చూపించడం” అనే ఉపశీర్షిక ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. ప్రతీ ప్రశ్నమీద వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి. “మీరు క్రిస్మస్‌ను ఎందుకు చేసుకోరు అని తోటి ఉద్యోగి అడిగిన ప్రశ్నకు లేఖనాధారిత సమాధానాన్నివ్వడానికి ఒక ప్రచారకుడు/రాలు తర్కించండి (ఆంగ్లం) పుస్తకాన్ని ఉపయోగించడాన్ని ప్రదర్శించండి.
పాట 8 (53), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.