ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు అక్టోబరులో: కావలికోట, తేజరిల్లు! విడి పత్రికలు ప్రతిపాదించండి. ఆసక్తి చూపించిన చోట, బైబిలు గురించి మరింత ఆసక్తిని పెంపొందించడానికి అప్రమత్తంగా ఉండండి! బ్రోషుర్‌ను అందించండి. నవంబరులో: గొప్ప బోధకుని నుండి నేర్చుకోండి (ఆంగ్లం) పుస్తకాన్ని అందజేయండి. గృహస్థుని భాషలో అది అందుబాటులో లేకపోతే మహాగొప్ప మనిషి పుస్తకాన్ని, లేదా నా బైబిలు కథల పుస్తకమును, మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రంతోపాటు ఇవ్వండి. డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని ప్రతిపాదించండి. సంఘంలో స్టాకు ఉన్నట్లయితే ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము, మీరు పరదైసు భూమిపై నిరంతరం జీవించగలరు వంటి పుస్తకాలను ప్రతిపాదించండి. జనవరిలో: సంఘంలో స్టాకులోవున్న ఏదైనా 192 పేజీల పాత పుస్తకం అందించవచ్చు. అలాంటి పాత పుస్తకాలు సంఘాల్లో స్టాకులో లేకపోతే, జ్ఞానము పుస్తకం లేదా అప్రమత్తంగా ఉండండి! బ్రోషుర్‌ను ప్రతిపాదించవచ్చు.
◼ డిసెంబరు నెలలో ఐదు పూర్తి వారాంతాలు ఉన్నాయి కాబట్టి సహాయ పయినీరు చేయడానికి అది అనువైన నెల.
◼ ఈ సంచిక మన రాజ్య పరిచర్య మధ్య పేజీల్లో “2007వ సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక” ఉంది, సమాచార నిర్దేశం కోసం దీనిని 2007వ సంవత్సరమంతా జాగ్రత్తగా ఉంచుకోవాలి.
◼ జనవరిలోని ఒక సేవా కూటంలో రక్త రహిత చికిత్స—వైద్య శాస్త్రం ఆ సవాలును ఎదుర్కొంటుంది (ఆంగ్లం) అనే వీడియో మీద చర్చ జరుగుతుంది. ఈ సీడీ అవసరమైతే, సాధ్యమైనంత త్వరలో సంఘం ద్వారానే వాటిని రిక్వెస్టు చేయాలి.
◼ 2007వ సంవత్సరపు జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఇచ్చే ప్రత్యేక బహిరంగ ప్రసంగం ఆదివారం ఏప్రిల్ 15న ఉంటుంది. ప్రసంగాంశం తర్వాత ప్రకటించబడుతుంది. ఆ వారాంతంలో ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనం లేక సమావేశం ఉండే సంఘాలకు ఆ తర్వాతి వారంలో ప్రత్యేక ప్రసంగం ఇవ్వబడుతుంది. ఏ సంఘంలో కూడా ఏప్రిల్ 15వ తేదీకన్నా ముందు ఆ ప్రత్యేక ప్రసంగం ఇవ్వకూడదు.