2007వ సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక
సూచనలు
2007వ సంవత్సరంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను నిర్వహిస్తున్నప్పుడు ఈ క్రింది ఏర్పాట్లు ఉంటాయి.
సమాచారానికి మూలాధారాలు: పరిశుద్ధ గ్రంథము [O.V.], కావలికోట [w], దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి [be], “ప్రతిలేఖనము” విశ్వసనీయమైనది, ప్రయోజనకరమైనది [bsi07], “చర్చనీయ బైబిలు అంశాలు” [td].
పాట, ప్రార్థన, ఆహ్వానపు మాటలతో పాఠశాలను సరిగ్గా సమయానికి ప్రారంభించి, ఈ క్రింద సూచించిన విధానాన్ని పాటించండి. ప్రతీ భాగం తర్వాత పాఠశాల పైవిచారణకర్త తర్వాతి భాగాన్ని పరిచయం చేస్తాడు.
ప్రసంగ లక్షణం: 5 నిమిషాలు. పాఠశాల పైవిచారణకర్త, సహాయక సలహాదారుడు లేదా అర్హతగల మరో పెద్ద పరిచర్య పాఠశాల పాఠ్యపుస్తకం ఆధారంగా ఒక ప్రసంగ లక్షణంపై చర్చిస్తాడు. (పెద్దలు తక్కువగా ఉన్న సంఘాల్లో అర్హతగల పరిచర్య సేవకులను ఉపయోగించుకోవచ్చు.)
ఉపదేశ ప్రసంగం: 10 నిమిషాలు. ఇది అర్హత ఉన్న ఒక పెద్ద లేదా పరిచర్య సేవకుడు నిర్వహించాలి. ఈ ప్రసంగం కావలికోట, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి అనే పుస్తకం లేదా “ప్రతిలేఖనము” విశ్వసనీయమైనది, ప్రయోజనకరమైనది అనే బ్రోషురు మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని పది నిమిషాల ఉపదేశ ప్రసంగంలా ఇవ్వాలి. ఈ ప్రసంగాన్ని ఇస్తున్నప్పుడు కేవలం సమాచార సారాంశం పూర్తి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోకూడదు, చర్చిస్తున్న సమాచారంలో సంఘానికి బాగా ఉపయోగపడే విషయాలను నొక్కిచెబుతూ సమాచారపు ఆచరణాత్మక విలువపై దృష్టి సారించడాన్నే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇవ్వబడిన ప్రసంగాంశాన్ని ఉపయోగించాలి. ఈ ప్రసంగానికి నియమించబడిన సహోదరులు నిర్ణీత సమయంలో ముగించేలా జాగ్రత్తపడతారని ఆశించబడుతోంది. సలహా ఇవ్వవలసిన అవసరముంటే వ్యక్తిగతంగా ఇవ్వవచ్చు.
బైబిలు పఠనంలోని ముఖ్యాంశాలు: 10 నిమిషాలు. మొదటి అయిదు నిమిషాలు, అర్హతగల ఒక పెద్ద లేదా పరిచర్య సేవకుడు సమాచారాన్ని స్థానిక అవసరాలకు అన్వయింపజేయాలి. ఆ వారం బైబిలు పఠనానికి నియమించబడిన భాగంలోని ఏ భాగంపైనైనా ఆయన వ్యాఖ్యానించవచ్చు. అయితే ఇది నియమిత పఠన భాగానికి సంబంధించిన సమాచార సారాంశంలా ఉండకూడదు. ఈ సమాచారం ఎందుకు, ఏ విధంగా విలువైనదో ప్రేక్షకులు గ్రహించడానికి సహాయం చేయాలన్నదే దీని ప్రధాన లక్ష్యం. ప్రారంభపు భాగానికి కేటాయించబడిన అయిదు నిమిషాలకు మించకుండా ప్రసంగీకుడు జాగ్రత్తపడాలి. ప్రేక్షకులు భాగం వహించేందుకు అయిదు నిమిషాలు ఉండేలా ఆయన చూసుకోవాలి. బైబిలు పఠనంలో ఆసక్తికరమైన ఏ అంశాలు తాము గ్రహించారో, దాని ప్రయోజనాలేమిటో క్లుప్తంగా (30 సెకన్లు లేదా అంతకంటే తక్కువ సమయంలో) చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించాలి. ఆ తర్వాత పాఠశాల పైవిచారణకర్త విద్యార్థులను వారు నియమించబడిన ఇతర తరగతి గదులకు పంపిస్తాడు.
2వ విద్యార్థి ప్రసంగం: 4 నిమిషాలు లేదా అంతకన్నా తక్కువ. ఇది ఒక సహోదరుడు చదవాల్సిన భాగం. విద్యార్థి పరిచయ మాటలు లేక ముగింపు మాటలు ఏమీ చెప్పకుండా నియమిత సమాచారాన్ని చదవాలి. పాఠశాల పైవిచారణకర్త విద్యార్థులు అవగాహనతో, అనర్గళంగా, భావాన్ని సరిగ్గా నొక్కిచెబుతూ, స్వరభేదంతో, సరైన చోట ఆగుతూ, సహజత్వంతో చదివేందుకు సహాయపడడంలో ముఖ్యంగా శ్రద్ధ చూపిస్తాడు.
3వ విద్యార్థి ప్రసంగం: 5 నిమిషాలు. ఇది ఒక సహోదరికి నియమించబడుతుంది. ఈ నియామకాన్ని పొందే విద్యార్థులకు పరిచర్య పాఠశాల పాఠ్యపుస్తకంలో 82వ పేజీలోవున్న పట్టిక నుండి ఒక సన్నివేశం నియమించబడుతుంది లేదా వారే అందులోనుండి ఒక సన్నివేశాన్ని ఎంపిక చేసుకోవాలి. విద్యార్థిని తనకివ్వబడిన ప్రసంగాంశాన్నే ఉపయోగిస్తూ దానిని స్థానిక క్షేత్ర పరిస్థితులకు తగినట్లుగాను, ఆచరణాత్మకంగాను ఉండేలా క్షేత్ర సేవకు సంబంధించిన ఒక రంగానికి అన్వయింపజేయాలి. సమాచారానికి మూలాధారం ఏమీ సూచించనప్పుడు, విద్యార్థిని ఈ భాగానికి సంబంధించిన సమాచారాన్ని మన ప్రచురణల్లో పరిశోధన చేసి సేకరించుకోవాలి. కొత్త విద్యార్థులకు రెఫరెన్సులున్న నియామకాలే ఇవ్వాలి. పాఠశాల పైవిచారణకర్త, విద్యార్థిని సమాచారాన్ని విపులీకరించే విధానంపైనా, గృహస్థురాలికి లేఖనాలపై తర్కించడంలోనూ, అందించబడుతున్న సమాచారంలోని కీలకాంశాలను అర్థం చేసుకోవడంలోనూ ఆమె సహాయపడే విధానంపైనా ముఖ్యంగా శ్రద్ధ చూపిస్తాడు. పైవిచారణకర్త ఒక సహాయకురాలిని నియమిస్తాడు.
4వ విద్యార్థి ప్రసంగం: 5 నిమిషాలు. నియమించబడిన అంశంపై విద్యార్థి ప్రసంగించాలి. సమాచారానికి మూలాధారం ఏమీ సూచించనప్పుడు, విద్యార్థి ఈ భాగానికి సంబంధించిన సమాచారాన్ని మన ప్రచురణల్లో పరిశోధన చేసి సేకరించుకోవాలి. ఈ భాగానికి ఒక సహోదరుడు నియమించబడినప్పుడు, ఆయన రాజ్యమందిరంలోని ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రసంగంలా ఇవ్వాలి. సహోదరి నియమించబడినప్పుడు, ఆమె దీన్ని 3వ విద్యార్థి ప్రసంగానికి ఇవ్వబడిన సూచనల ప్రకారం ఇవ్వాలి. 4వ విద్యార్థి ప్రసంగం సహోదరునికి ఇవ్వడం సముచితమని పాఠశాల పైవిచారణకర్త భావించినప్పుడు ఆయన అలా ఇవ్వవచ్చు. పువ్వుగుర్తు ఇవ్వబడిన ప్రసంగాలకు సహోదరులను మాత్రమే నియమించాలని దయచేసి గమనించండి.
సలహా: 1 నిమిషం. విద్యార్థులు పనిచేసే ప్రసంగ లక్షణాన్ని పాఠశాల పైవిచారణకర్త ప్రసంగానికి ముందే చెప్పకూడదు. 2, 3, 4వ విద్యార్థి ప్రసంగాలు ముగిసిన తర్వాత తాను ఆ ప్రసంగాల్లో గమనించిన ప్రశంసనీయమైన ఒక అంశంపై నిర్మాణాత్మకంగా వ్యాఖ్యానించాలి. కేవలం “బాగా చేశారు” అని ప్రశంసించడం మాత్రమే లక్ష్యంగా ఉండకూడదు గానీ, ఆ ప్రసంగంలోని ఫలానా అంశం ఎందుకు బాగుందో తెలియజేసే నిర్దిష్ట కారణాల గురించి కూడా చెప్పాలి. ప్రతీ విద్యార్థికి వారి అవసరాన్నిబట్టి, నిర్మాణాత్మకమైన అదనపు సలహాను కూటం తర్వాత లేదా వేరే సమయంలో వ్యక్తిగతంగా ఇవ్వవచ్చు.
సమయపాలన: ఏ ప్రసంగమైనా, సలహాదారుని సలహాలైనా నియమిత సమయాన్ని మించకూడదు. 2వ విద్యార్థి ప్రసంగం నుండి 4వ విద్యార్థి ప్రసంగాల సమయం ముగిసిన వెంటనే వాటిని నేర్పుగా ఆపుజేయాలి. ప్రసంగ లక్షణంపై ఇవ్వబడే ప్రసంగాన్ని, ఉపదేశ ప్రసంగాన్ని లేదా బైబిలు పఠనంలోని ముఖ్యాంశాలను నిర్వహిస్తున్న సహోదరులు ఎక్కువ సమయం తీసుకుంటే వారికి వ్యక్తిగతంగా సలహా ఇవ్వాలి. అందరూ తమ తమ సమయాన్ని జాగ్రత్తగా పాటించాలి. మొత్తం కార్యక్రమం: పాట, ప్రార్థన మినహాయించి 45 నిమిషాలు.
సలహా పత్రం: పాఠ్య పుస్తకంలో ఉంది.
సహాయక సలహాదారుడు: పాఠశాల పైవిచారణకర్తతోపాటు సమర్థుడైన మరొక పెద్ద ఉంటే ఆయనను సహాయక సలహాదారునిగా పెద్దల సభ ఎంపిక చేయవచ్చు. ఒకవేళ సంఘంలో చాలామంది పెద్దలుంటే, ఈ నియామకాన్ని ప్రతీ సంవత్సరం అర్హుడైన ఒక్కో పెద్ద నిర్వహించవచ్చు. ఉపదేశ ప్రసంగం, బైబిలు ముఖ్యాంశాలను అందించే సహోదరులకు అవసరమైనప్పుడు విడిగా సలహా ఇవ్వడం సహాయక సలహాదారుని బాధ్యత. అయితే తోటి పెద్దలు లేదా పరిచర్య సేవకులు ఇచ్చిన ప్రతీ ప్రసంగం తర్వాత ఆయన సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు.
మౌఖిక పునఃసమీక్ష: 30 నిమిషాలు. పాఠశాల పైవిచారణకర్త రెండు నెలలకు ఒకసారి మౌఖిక పునఃసమీక్షను నిర్వహిస్తాడు. పైన పేర్కొన్న సూచనల ప్రకారం ప్రసంగ లక్షణం, బైబిలు పఠనంలోని ముఖ్యాంశాలు నిర్వహించిన తర్వాత ఈ మౌఖిక పునఃసమీక్ష ఉంటుంది. మౌఖిక పునఃసమీక్ష ఆ వారంతో పాటు అంతకుముందు రెండు నెలలపాటు పరిశీలించబడిన సమాచారంపై ఆధారపడి ఉంటుంది. మౌఖిక పునఃసమీక్ష జరిగే వారంలో మీ సంఘానికి ప్రాంతీయ సమావేశం ఉంటే, మౌఖిక పునఃసమీక్షను (ఆ వారపు మిగతా నియామకాలను) సమావేశం తర్వాతి వారానికి వాయిదా వేయాలి, ఆ మరుసటి వారపు నియామకాలను ముందరి వారంలో నిర్వహించాలి. ఒకవేళ మౌఖిక పునఃసమీక్ష జరిగే వారంలో ప్రాంతీయ పైవిచారణకర్త మీ సంఘాన్ని సందర్శిస్తుంటే, పాట, ప్రసంగ లక్షణానికి సంబంధించిన ప్రసంగం, బైబిలు ముఖ్యాంశాలు పట్టికలో ఉన్న ప్రకారమే నిర్వహించాలి. ఉపదేశ ప్రసంగాన్ని (ప్రసంగ లక్షణం అనే ప్రసంగం తర్వాత ఇచ్చేది) మరుసటి వారంలో నుండి తీసుకోవాలి. ఆ మరుసటి వారపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఆ వారపు ప్రసంగ లక్షణానికి సంబంధించిన ప్రసంగం, బైబిలు ముఖ్యాంశాల తర్వాత మౌఖిక పునఃసమీక్ష ఉంటుంది.
పట్టిక
జన. 1 బైబిలు పఠనం: యెషయా 24-28 పాట 4 (43)
ప్రసంగ లక్షణం: సమాచారాన్ని ఆచరణాత్మకంగా అన్వయించడం (be 158వ పేజీ, 2-4 పేరాలు)
నం. 1: పాఠశాలలో విద్యార్థి నియామకాలకు సిద్ధపడడం (be 43వ పేజీ, 1వ పేరా-44వ పేజీ, 3వ పేరా)
నం. 2: యెషయా 26:1-18
నం. 3: td 21సి దేవుణ్ణి తప్ప వేరొకరిని ఆరాధించడం అంగీకృతం కాదు
నం. 4: “ప్రభువైన యేసుక్రీస్తును” ఎలా ‘ధరించుకోవచ్చు’ (రోమా. 13:14)
జన. 8 బైబిలు పఠనం: యెషయా 29-33 పాట 21 (191)
ప్రసంగ లక్షణం: ఇతరులు ఆచరణాత్మక విలువను గ్రహించేందుకు సహాయపడడం (be 159వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: విషయం, సన్నివేశం ఉన్న ప్రసంగాన్ని సిద్ధపడడం (be 44వ పేజీ, 4వ పేరా-46వ పేజీ, 2వ పేరా)
నం. 2: యెషయా 30:1-14
నం. 3: td 22ఎ దేవుడు ఆలకించే ప్రార్థనలు
నం. 4: యెహోవా దేవుడు పిల్లలను ప్రేమిస్తాడని మనకెలా తెలుసు
జన. 15 బైబిలు పఠనం: యెషయా 34-37 పాట 29 (222)
ప్రసంగ లక్షణం: పదాలను ఎంపిక చేసుకోవడం (be 160వ పేజీ, 1-3 పేరాలు)
నం. 1: తప్పొప్పుల విషయంలో యేసు దృక్కోణాన్ని పెంపొందించుకోండి (w05 1/1 9-10 పేజీలు, 11-15 పేరాలు)
నం. 2: యెషయా 34:1-15
నం. 3: యథార్థమైన ప్రేమను ఎలా పెంపొందించుకోవాలి
నం. 4: td 22బి పదే పదే వల్లించడం వ్యర్థం, మరియకు లేదా “పరిశుద్ధులకు” ప్రార్థించడం ఆమోదయోగ్యం కాదు
జన. 22 బైబిలు పఠనం: యెషయా 38-42 పాట 16 (143)
ప్రసంగ లక్షణం: సులభంగా అర్థమయ్యే భాష (be 161వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: వ్యతిరేకతనుబట్టి నిరుత్సాహపడకండి (w05 1/1 15వ పేజీ, 16-18 పేరాలు)
నం. 2: యెషయా 38:9-22
నం. 3: td 23ఎ ఒక క్రైస్తవ విధి
నం. 4: ఇతరులకు చెడు ఉద్దేశాలను ఎందుకు ఆపాదించకూడదు?
జన. 29 బైబిలు పఠనం: యెషయా 43-46 పాట 12 (113)
ప్రసంగ లక్షణం: వైవిధ్యభరితమైన ఖచ్చితమైన మాటలు (be 161వ పేజీ, 5వ పేరా-162వ పేజీ, 4వ పేరా)
నం. 1: మనం యెహోవా తీర్పులను ఎందుకు అంగీకరించాలి? (w05 2/1 23-4 పేజీలు, 4-9 పేరాలు)
నం. 2: యెషయా 45:1-14
నం. 3: td 23బి పాపాలను కడిగివేయదు
నం. 4: aక్రైస్తవులు పోటీతత్వంతో ఎందుకు పోల్చుకోకూడదు?
ఫిబ్ర. 5 బైబిలు పఠనం: యెషయా 47-51 పాట 6 (45)
ప్రసంగ లక్షణం: బలాన్నీ భావాలను తెలియజేసే పదాలు, వర్ణనాత్మక పదాలు (be 163వ పేజీ, 1వ పేరా-164వ పేజీ, 2వ పేరా)
నం. 1: యెహోవా వాక్యం మనల్ని పరిశుద్ధులుగా ఉంచుతుంది, నమ్మకంగా ఉండడానికి సహాయం చేస్తుంది (w05 4/15 11-12 పేజీలు, 5-11 పేరాలు)
నం. 2: యెషయా 50:1-11
నం. 3: td 24ఎ దేవుని వాక్యం ప్రేరేపితమైనది
నం. 4: బహుమతులు ఇవ్వడాన్ని బైబిలు నిరుత్సాహపరుస్తోందా?
ఫిబ్ర. 12 బైబిలు పఠనం: యెషయా 52-57 పాట 16 (143)
ప్రసంగ లక్షణం: వ్యాకరణ నియమాలకు అనుగుణంగావున్న మాటలు (be 164వ పేజీ, 3-7 పేరాలు)
నం. 1: యెహోవా వాక్యం ధైర్యాన్ని నింపుతుంది (w05 4/15 12-13 పేజీలు, 12-14 పేరాలు)
నం. 2: యెషయా 55:1-13
నం. 3: స్వయంత్యాగపూరిత జీవితం జీవించడం ప్రయోజనకరమైనది
నం. 4: td 24బి మనకాలానికి ఆచరణాత్మకమైన మార్గదర్శిని
ఫిబ్ర. 19 బైబిలు పఠనం: యెషయా 58-62 పాట 4 (43)
ప్రసంగ లక్షణం: సంక్షిప్తప్రతిని ఉపయోగించడం (be 166వ పేజీ, 1వ పేరా-167వ పేజీ, 1వ పేరా)
నం. 1: యెషయా—ఎందుకు ప్రయోజనకరం (bsi06 31, 32 పేజీలు, 34-39 పేరాలు)
నం. 2: యెషయా 60:1-14
నం. 3: దేవునికి దాసులుగా ఉండడం ఎందుకు సంతోషదాయకంగా ఉంటుంది?
నం. 4: td 24సి అన్ని దేశాల, జాతుల ప్రజలకోసం వ్రాయబడింది
ఫిబ్ర. 26 బైబిలు పఠనం: యెషయా 63-66 పాట 17 (187)
ప్రసంగ లక్షణం: మీరు చెప్పే విషయాలను క్రమబద్ధంగా పొందుపరుచుకోండి (be 167వ పేజీ, 2వ పేరా-168వ పేజీ, 2వ పేరా)
మౌఖిక పునఃసమీక్ష
మార్చి 5 బైబిలు పఠనం: యిర్మీయా 1-4 పాట 22 (130)
ప్రసంగ లక్షణం: మీ ప్రసంగ సంక్షిప్తప్రతిని సరళంగా ఉంచుకోండి (be 168వ పేజీ, 3వ పేరా-169వ పేజీ, 6వ పేరా)
నం. 1: యిర్మీయా పుస్తకానికి ఉపోద్ఘాతం (bsi07 3వ పేజీ, 1-5 పేరాలు)
నం. 2: యిర్మీయా 3:1-13
నం. 3: నిజమైన సంతోషం దేనిమీద ఆధారపడివుంటుంది?
నం. 4: td 25ఎ భూమిపట్ల దేవుని సంకల్పం
మార్చి 12 బైబిలు పఠనం: యిర్మీయా 5-7 పాట 13 (124)
ప్రసంగ లక్షణం: సమాచారాన్ని తర్కబద్ధంగా విపులీకరించడం (be 170వ పేజీ, 1వ పేరా-171వ పేజీ, 3వ పేరా)
నం. 1: సంఘంలో ప్రసంగాలివ్వడానికి సిద్ధపడడం (be 47వ పేజీ, 1వ పేరా-49వ పేజీ, 1వ పేరా)
నం. 2: యిర్మీయా 5:1-14
నం. 3: td 25బి ఎన్నటికీ నాశనం చేయబడదు లేక నిర్మానుష్యంకాదు
నం. 4: మన దినాల్లో నిర్గమకాండము 14:11లోని పాఠాన్ని అన్వయించుకోవడం
మార్చి 19 బైబిలు పఠనం: యిర్మీయా 8-11 పాట 24 (185)
ప్రసంగ లక్షణం: సమాచారాన్ని తర్కబద్ధంగా అందించడం (be 171వ పేజీ, 4వ పేరా-172వ పేజీ, 6వ పేరా)
నం. 1: సేవాకూటంలోని భాగాలకు, ఇతర ప్రసంగాలకు సిద్ధపడడం (be 49వ పేజీ, 2వ పేరా-51వ పేజీ, 1వ పేరా)
నం. 2: యిర్మీయా 10:1-16
నం. 3: అబ్రాహాము, యోబు, దానియేలులు పునరుత్థానంపై నమ్మకముంచారని మనకెలా తెలుసు?
నం. 4: td 26ఎ సత్యమతం ఒక్కటే
మార్చి 26 బైబిలు పఠనం: యిర్మీయా 12-16 పాట 28 (224)
ప్రసంగ లక్షణం: సంబంధిత సమాచారాన్ని మాత్రమే ఉపయోగించడం (be 173వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: విమోచనా క్రయధనం దేవుని నీతిని ఘనపరుస్తుంది (w05 11/1 13-14 పేజీలు)
నం. 2: యిర్మీయా 12:1-13
నం. 3: td 26బి అబద్ధ సిద్ధాంతం పూర్తిగా ఖండించబడింది
నం. 4: క్రైస్తవులు ఏ విధంగా అతిశయించాలి?
ఏప్రి. 2 బైబిలు పఠనం: యిర్మీయా 17-21 పాట 22 (130)
ప్రసంగ లక్షణం: పదేపదే నోట్సు చూడకుండా ప్రసంగించడం (be 174వ పేజీ, 1వ పేరా-175వ పేజీ, 5వ పేరా)
నం. 1: బహిరంగ ప్రసంగాలివ్వడానికి సిద్ధపడడం (be 52వ పేజీ, 1వ పేరా-54వ పేజీ, 1వ పేరా)
నం. 2: యిర్మీయా 20:1-13
నం. 3: td 26సి అది తప్పని నిరూపించబడితే, ఒకరు మతం మార్చుకోవడం చాలా ప్రాముఖ్యం
నం. 4: bఉపదేశాన్ని మనమెలా దృష్టించాలి?
ఏప్రి. 9 బైబిలు పఠనం: యిర్మీయా 22-24 పాట 28 (224)
ప్రసంగ లక్షణం: పదేపదే నోట్సు చూడకుండా ప్రసంగించడంలోని ప్రమాదాలను నివారించుకోండి (be 175వ పేజీ, 6వ పేరా-177వ పేజీ, 2వ పేరా)
నం. 1: ప్రసంగీకుని నిర్ణయాలు (be 54వ పేజీ, 2-4 పేరాలు, 55వ పేజీలోని బాక్సు)
నం. 2: యిర్మీయా 23:1-14
నం. 3: పరిచర్యలో పాల్గొనడం మనకు ఎందుకు ఆనందాన్నిస్తుంది?
నం. 4: td 26డి “అన్ని మతాల్లో మంచి” ఉన్నా అందువల్ల దేవుని అనుగ్రహం లభిస్తుందనే హామీలేదు
ఏప్రి. 16 బైబిలు పఠనం: యిర్మీయా 25-28 పాట 4 (43)
ప్రసంగ లక్షణం: వివరణ ఇవ్వమని ఇతరులు అడిగినప్పుడు (be 177వ పేజీ, 3వ పేరా-178వ పేజీ, 2వ పేరా)
నం. 1: బోధకుడిగా మీ సామర్థ్యాన్ని పెంపొందించుకోండి (be 56వ పేజీ, 1వ పేరా-57వ పేజీ, 2వ పేరా)
నం. 2: యిర్మీయా 26:1-15
నం. 3: td 27ఎ మరణానికి కారణం
నం. 4: నేల ఏ విధంగా శపింపబడింది? (ఆది. 3:17)
ఏప్రి. 23 బైబిలు పఠనం: యిర్మీయా 29-31 పాట 6 (45)
ప్రసంగ లక్షణం: సంభాషణా శైలి (be 179-80 పేజీలు)
నం. 1: “వేరుచేయుటకు” (be 57వ పేజీ, 3వ పేరా-58వ పేజీ, 2వ పేరా)
నం. 2: యిర్మీయా 31:1-14
నం. 3: యెహోవా మహాత్మ్యానికి ఎల్లలులేవు
నం. 4: td 27బి మరణించినవారి స్థితి
ఏప్రి. 30 బైబిలు పఠనం: యిర్మీయా 32-34 పాట 6 (45)
ప్రసంగ లక్షణం: స్వర నాణ్యత (be 181వ పేజీ 1-4 పేరాలు)
మౌఖిక పునఃసమీక్ష
మే 7 బైబిలు పఠనం: యిర్మీయా 35-38 పాట 20 (93)
ప్రసంగ లక్షణం: మీ ఊపిరిని సరైన విధంగా నియంత్రించుకోవడం (be 181వ పేజీ, 5వ పేరా-184వ పేజీ, 1వ పేరా, 182వ పేజీ బాక్సు)
నం. 1: ఆలోచించమని శ్రోతలను ప్రోత్సహించండి (be 58వ పేజీ, 3వ పేరా-59వ పేజీ, 3వ పేరా)
నం. 2: యిర్మీయా 36:1-13
నం. 3: td 27సి మృతులతో మాట్లాడడం అసాధ్యం
నం. 4: క్రైస్తవులు అనిశ్చిత పరిస్థితిని ఎలా ఎదుర్కోవచ్చు?
మే 14 బైబిలు పఠనం: యిర్మీయా 39-43 పాట 4 (43)
ప్రసంగ లక్షణం: బిగుసుకుపోయిన కండరాలను సడలించుకోవడం (be 184వ పేజీ, 2వ పేరా-185వ పేజీ, 3వ పేరా, 184వ పేజీ బాక్సు)
నం. 1: అన్వయింపును తెలపండి, మంచి మాదిరిని ఉంచండి (be 60వ పేజీ, 1వ పేరా-61వ పేజీ, 3వ పేరా)
నం. 2: యిర్మీయా 39:1-14
నం. 3: td 28ఎ మరియ యేసు తల్లి, “దేవుని తల్లి” కాదు
నం. 4: cనిజ క్రైస్తవులు కోర్ట్‌షిప్ సమయంలో పవిత్రంగా ఉండేందుకు ఎందుకు కృషిచేస్తారు
మే 21 బైబిలు పఠనం: యిర్మీయా 44-48 పాట 23 (200)
ప్రసంగ లక్షణం: ఎదుటి వ్యక్తి మీద ఆసక్తి చూపించడం (be 186వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: సంభాషణా సామర్థ్యాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చు (be 62వ పేజీ, 1వ పేరా-64వ పేజీ, 1వ పేరా)
నం. 2: యిర్మీయా 46:1-17
నం. 3: ఆత్మవంచన అంటే ఏమిటి, దాని విషయంలో ఎలా జాగ్రత్త వహించవచ్చు
నం. 4: ప్రకటన గ్రంథములోని బబులోనును గుర్తించడం
మే 28 బైబిలు పఠనం: యిర్మీయా 49-50 పాట 28 (224)
ప్రసంగ లక్షణం: శ్రద్ధగా వినడం (be 187వ పేజీ, 1-5 పేరాలు)
నం. 1: ఒక సంభాషణను కొనసాగించడమెలా? (be 64వ పేజీ, 2వ పేరా-65వ పేజీ, 4వ పేరా)
నం. 2: యిర్మీయా 49:14-27
నం. 3: td 28బి మరియ “నిత్య కన్యక” కాదు
నం. 4: తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎందుకు చదివి వినిపించాలి
జూన్ 4 బైబిలు పఠనం: యిర్మీయా 51-52 పాట 15 (127)
ప్రసంగ లక్షణం: ఇతరులు ప్రగతి సాధించేందుకు సహాయపడడం (be 187వ పేజీ, 6వ పేరా-188వ పేజీ, 3వ పేరా)
నం. 1: యిర్మీయా—ఎందుకు ప్రయోజనకరం (bsi07 3, 4 పేజీలు, 36-39 పేరాలు)
నం. 2: యిర్మీయా 52:1-16
నం. 3: దేవుని నుండి స్వతంత్రంగా ఉండేందుకు ప్రయత్నించడం మూర్ఖత్వం
నం. 4: td 29ఎ ఇతర మతాలతో మిళితం కావడం దేవుని మార్గం కాదు
జూన్ 11 బైబిలు పఠనం: విలాపవాక్యములు 1-2 పాట 18 (162)
ప్రసంగ లక్షణం: అవసరమైన చేయూతనివ్వడం (be 188వ పేజీ, 4వ పేరా-189వ పేజీ, 4వ పేరా)
నం. 1: విలాపవాక్యములు పుస్తకానికి ఉపోద్ఘాతం (bsi07 4, 5 పేజీలు, 1-7 పేరాలు)
నం. 2: విలాపవాక్యములు 2:1-10
నం. 3: td 29బి “అన్ని మతాలలో మంచి ఉందనడం” సత్యం కాదు
నం. 4: నిజమైన దయ ఎందుకు బలహీనత కాదు
జూన్ 18 బైబిలు పఠనం: విలాపవాక్యములు 3-5 పాట 26 (212)
ప్రసంగ లక్షణం: ఇతరులను గౌరవించడం (be 190వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: విలాపవాక్యములు—ఎందుకు ప్రయోజనకరం (bsi07 5, 6 పేజీలు, 13-15 పేరాలు)
నం. 2: విలాపవాక్యములు 4:1-13
నం. 3: td 30ఎ దేవుని పేరు
నం. 4: dనిజ క్రైస్తవులు రాజకీయాల్లో ఎందుకు భాగం వహించరు?
జూన్ 25 బైబిలు పఠనం: యెహెజ్కేలు 1-5 పాట 6 (45)
ప్రసంగ లక్షణం: గౌరవపూర్వక అభివాదం (be 191వ పేజీ, 1వ పేరా-192వ పేజీ, 1వ పేరా)
మౌఖిక పునఃసమీక్ష
జూలై 2 బైబిలు పఠనం: యెహెజ్కేలు 6-10 పాట 3 (32)
ప్రసంగ లక్షణం: గౌరవపూర్వకంగా మాట్లాడడం (be 192వ పేజీ, 2వ పేరా-193వ పేజీ, 2వ పేరా)
నం. 1: యెహెజ్కేలు పుస్తకానికి ఉపోద్ఘాతం (bsi07 6, 7 పేజీలు, 1-6 పేరాలు)
నం. 2: యెహెజ్కేలు 7:1-13
నం. 3: యెహోవాకు సన్నిహితమవ్వాలంటే ఏమి చేయాలి? (యాకో. 4:8)
నం. 4: td 30బి దేవుని ఉనికి
జూలై 9 బైబిలు పఠనం: యెహెజ్కేలు 11-14 పాట 16 (143)
ప్రసంగ లక్షణం: నిశ్చయతతో చెప్పడం (be 194వ పేజీ, 1వ పేరా-195వ పేజీ, 2వ పేరా)
నం. 1: మేలు చేయడంలో పట్టుదలతో ఉండండి (w05 6/1 29-30 పేజీలు)
నం. 2: యెహెజ్కేలు 11:1-13
నం. 3: td 30సి దేవుని లక్షణాలు
నం. 4: ప్రకటన 17:9-11ను మనమెలా అర్థం చేసుకోవాలి?
జూలై 16 బైబిలు పఠనం: యెహెజ్కేలు 15-17 పాట 18 (162)
ప్రసంగ లక్షణం: నిశ్చయత ఎలా వెల్లడవుతుంది? (be 195వ పేజీ, 3వ పేరా-196వ పేజీ, 4వ పేరా)
నం. 1: తప్పుడు ఆలోచనా విధానాన్ని నిరోధించండి! (w05 9/15 26-8 పేజీలు)
నం. 2: యెహెజ్కేలు 16:1-13
నం. 3: వివేకవంతంగా ప్రవర్తించడం అంటే ఏమిటి? (సామె. 13:16)
నం. 4: td 30డి అందరూ ఒకే దేవుణ్ణి ఆరాధించడంలేదు
జూలై 23 బైబిలు పఠనం: యెహెజ్కేలు 18-20 పాట 18 (162)
ప్రసంగ లక్షణం: ఔచిత్యంతోనే అయినా దృఢంగా మాట్లాడడం (be 197వ పేజీ, 1-3 పేరాలు)
నం. 1: ప్రశ్నించిన వ్యక్తి దృక్కోణాన్ని గ్రహించడం (be 66వ పేజీ, 1వ పేరా-68వ పేజీ, 1వ పేరా)
నం. 2: యెహెజ్కేలు 18:19-29
నం. 3: td 31ఎ యెహోవాసాక్షుల ఆరంభం
నం. 4: దేవుని రాజ్యం వాస్తవమైనదనేందుకు రుజువు
జూలై 30 బైబిలు పఠనం: యెహెజ్కేలు 21-23 పాట 23 (200)
ప్రసంగ లక్షణం: సాక్ష్యమిచ్చేటప్పుడు ఔచిత్యంతో ఉండడం (be 197వ పేజీ, 4వ పేరా-198వ పేజీ, 4వ పేరా)
నం. 1: ఎలా జవాబివ్వాలో తెలుసుకోండి (be 68వ పేజీ, 2వ పేరా-70వ పేజీ, 4వ పేరా)
నం. 2: యెహెజ్కేలు 23:1-17
నం. 3: td 32ఎ యేసు దేవుని కుమారుడు, నియమించబడిన రాజు
నం. 4: గొప్పతనం విషయంలో సరైన దృక్కోణం ఏమిటి?
ఆగ. 6 బైబిలు పఠనం: యెహెజ్కేలు 24-27 పాట 9 (37)
ప్రసంగ లక్షణం: సరైన సమయంలో మాట్లాడే సరైన మాటలు (be 199వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: ఉత్తరాల ద్వారా సందేశాన్ని అందజేయడం (be 71-3 పేజీలు)
నం. 2: యెహెజ్కేలు 24:1-14
నం. 3: మోషే క్రైస్తవులకు ఏయే విధాలుగా అత్యుత్తమ మాదిరిగా ఉన్నాడు?
నం. 4: td 32బి రక్షణకు యేసుక్రీస్తుపై నమ్మకం చాలా ప్రాముఖ్యం
ఆగ. 13 బైబిలు పఠనం: యెహెజ్కేలు 28-31 పాట 4 (43)
ప్రసంగ లక్షణం: కుటుంబంతోను, ఇతరులతోను ఔచిత్యంతో ప్రవర్తించడం (be 200వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: ప్రగతిశీలురై ఉండండి—అభివృద్ధిని సాధించండి (be 74వ పేజీ, 1వ పేరా-75వ పేజీ 3వ పేరా)
నం. 2: యెహెజ్కేలు 28:1-16
నం. 3: td 32సి క్రీస్తుపై విశ్వాసం మాత్రమే సరిపోదు
నం. 4: లేఖనాల్లో “ద్వేషము” అనే పదానికి ఎలాంటి అర్థాలున్నాయి?
ఆగ. 20 బైబిలు పఠనం: యెహెజ్కేలు 32-34 పాట 22 (130)
ప్రసంగ లక్షణం: క్షేమాభివృద్ధికరంగా, అనుకూలంగా మాట్లాడడం (be 202వ పేజీ, 1వ పేరా-203వ పేజీ, 2వ పేరా)
నం. 1: మీకివ్వబడిన వరాన్ని ఉపయోగించండి (be 75వ పేజీ, 4వ పేరా-77వ పేజీ, 2వ పేరా)
నం. 2: యెహెజ్కేలు 34:1-14
నం. 3: దేవుని ఆత్మ మనకెలా సహాయం చేస్తుంది?
నం. 4: td 33ఎ రక్తమార్పిడులు రక్త పవిత్రతను పాడుచేస్తాయి
ఆగ. 27 బైబిలు పఠనం: యెహెజ్కేలు 35-38 పాట 5 (46)
ప్రసంగ లక్షణం: స్వరం అనుకూలంగా ధ్వనించడం (be 203వ పేజీ, 3వ పేరా-204వ 1వ పేరా)
మౌఖిక పునఃసమీక్ష
సెప్టెం. 3 బైబిలు పఠనం: యెహెజ్కేలు 39-41 పాట 20 (93)
ప్రసంగ లక్షణం: తోటి విశ్వాసులతో సంభాషించేటప్పుడు (be 204వ పేజీ, 2వ పేరా-205వ పేజీ 4వ పేరా)
నం. 1: దేవుని వాక్యాన్ని ఎందుకు ప్రేమించాలి? (w05 4/15 15-16 పేజీలు, 3-6 పేరాలు)
నం. 2: యెహెజ్కేలు 40:1-15
నం. 3: మానవులు దేవుణ్ణి నిజంగా సంతోషపర్చగలరా?
నం. 4: td 33బి ప్రాణరక్షణకు దేవుని నియమాన్ని ఉల్లంఘించడం సమర్థనీయం కాదు
సెప్టెం. 10 బైబిలు పఠనం: యెహెజ్కేలు 42-45 పాట 11 (85)
ప్రసంగ లక్షణం: విషయాన్ని నొక్కి చెప్పడానికి మళ్ళీ చెప్పడం (be 206వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: వార్ధక్యం “సొగసైన కిరీటము” అయినప్పుడు. . . (w05 1/15 8-9 పేజీలు)
నం. 2: యెహెజ్కేలు 43:1-12
నం. 3: td 34ఎ రక్షణ యేసు విమోచన క్రయధన బలిద్వారా దేవునినుండి వస్తుంది
నం. 4: eమనం ‘అన్యుల స్వరమును’ ఎలా గుర్తించవచ్చు? (యోహా. 10:5)
సెప్టెం. 17 బైబిలు పఠనం: యెహెజ్కేలు 46-48 పాట 19 (164)
ప్రసంగ లక్షణం: క్షేత్రపరిచర్యలోను, ప్రసంగాలిచ్చేటప్పుడు విషయాన్ని నొక్కిచెప్పడం (be 207వ పేజీ, 1వ పేరా-208వ పేజీ, 3వ పేరా)
నం. 1: యెహెజ్కేలు—ఎందుకు ప్రయోజనకరం (bsi07 7, 8 పేజీలు, 29-33 పేరాలు)
నం. 2: యెహెజ్కేలు 47:1-14
నం. 3: td 34బి “ఒక్కసారి రక్షింపబడితే ఇక రక్షింపబడినట్లే” అనే మాట లేఖనాధారం కాదు
నం. 4: fసుసంపన్నమైన ఆధ్యాత్మిక స్వాస్థ్యం తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వగల అతి శ్రేష్ఠమైన బహుమానం అని ఎందుకు చెప్పవచ్చు?
సెప్టెం. 24 బైబిలు పఠనం: దానియేలు 1-3 పాట 2 (15)
ప్రసంగ లక్షణం: చర్చాంశాన్ని విపులీకరించడం (be 209వ పేజీ, 1-3 పేరాలు)
నం. 1: దానియేలు పుస్తకానికి ఉపోద్ఘాతం (bsi07 8, 9 పేజీలు, 1-6 పేరాలు)
నం. 2: దానియేలు 2:1-16
నం. 3: 1,44,000 సంఖ్య ఎందుకు అక్షరార్థంగా తీసుకోబడింది? (ప్రక. 7:4)
నం. 4: td 34సి “సర్వజన రక్షణ” లేఖనాధారం కాదు
అక్టో. 1 బైబిలు పఠనం: దానియేలు 4-6 పాట 8 (53)
ప్రసంగ లక్షణం: సముచితమైన చర్చాంశాన్ని ఉపయోగించడం (be 210వ పేజీ, 1వ పేరా-211వ పేజీ, 1వ పేరా, 211వ పేజీ బాక్సు)
నం. 1: కోపగించుకోవడం ఎప్పుడు సరైనది? (w05 8/1 13-15 పేజీలు)
నం. 2: దానియేలు 4:1-17
నం. 3: మెఫీబోషేతుకున్న చక్కని లక్షణాలను మనమెలా అనుసరించవచ్చు?
నం. 4: td 35ఎ దేవుని రాజ్యం మానవులకు ఏమి చేస్తుంది
అక్టో. 8 బైబిలు పఠనం: దానియేలు 7-9 పాట 9 (37)
ప్రసంగ లక్షణం: ముఖ్యాంశాలను ప్రత్యేకంగా గుర్తించబడేలా చెప్పడం (be 212వ పేజీ, 1వ పేరా-213వ పేజీ, 2వ పేరా)
నం. 1: యెహోవా “వాక్కు” మిమ్మల్ని కాపాడనివ్వండి (w05 9/1 28-31 పేజీలు)
నం. 2: దానియేలు 7:1-12
నం. 3: td 35బి క్రీస్తు విరోధులు ఇంకా ఉండగానే పరిపాలన ఆరంభమవుతుంది
నం. 4: క్షేత్ర పరిచర్యలో క్రమంగా పాల్గొనడంవల్ల ఎలాంటి ప్రత్యేక ఆనందాలను చవిచూస్తాం?
అక్టో. 15 బైబిలు పఠనం: దానియేలు 10-12 పాట 23 (200)
ప్రసంగ లక్షణం: మరీ ఎక్కువ ముఖ్యాంశాలను కాదు (be 213వ పేజీ, 3వ పేరా-214వ పేజీ, 5వ పేరా)
నం. 1: దానియేలు—ఎందుకు ప్రయోజనకరం? (bsi07 9, 10 పేజీలు, 19-23 పేరాలు)
నం. 2: దానియేలు 11:1-14
నం. 3: అపార్థాలను అధిగమించడానికి వినయం మనకెలా సహాయం చేస్తుంది?
నం. 4: td 35సి ‘హృదయాలలో’ లేదు, మానవ ప్రయత్నాలతో రాదు
అక్టో. 22 బైబిలు పఠనం: హోషేయ 1-7 పాట 9 (37)
ప్రసంగ లక్షణం: ఆసక్తిని రేకెత్తించే ఉపోద్ఘాతం (be 215వ పేజీ, 1వ పేరా-216వ పేజీ, 5వ పేరా)
నం. 1: హోషేయ పుస్తకానికి ఉపోద్ఘాతం మరియు ఎందుకు ప్రయోజనకరం? (bsi07 11,12 పేజీలు, 1-8 పేరాలు, 14-17 పేరాలు)
నం. 2: హోషేయ 5:1-15
నం. 3: td 36ఎ మానవుని విధి లిఖించబడలేదు
నం. 4: నిజ క్రైస్తవులు ఓర్పును ప్రదర్శించే మార్గాలు
అక్టో. 29 బైబిలు పఠనం: హోషేయ 8-14 పాట 5 (46)
ప్రసంగ లక్షణం: క్షేత్రసేవలో ఉన్నప్పుడు ప్రజల శ్రద్ధను ఆకట్టుకోవడం (be 217వ పేజీ, 1-4 పేరాలు)
మౌఖిక పునఃసమీక్ష
నవం. 5 బైబిలు పఠనం: యోవేలు 1-3 పాట 15 (127)
ప్రసంగ లక్షణం: ఉపోద్ఘాతంలో విషయమేమిటో తెలియజేయడం (be 217వ పేజీ, 5వ పేరా-219వ పేజీ, 2వ పేరా)
నం. 1: యోవేలు పుస్తకానికి ఉపోద్ఘాతం మరియు ఎందుకు ప్రయోజనకరం? (bsi07 13, 14 పేజీలు, 1-5 పేరాలు, 12-14 పేరాలు)
నం. 2: యోవేలు 2:1-14
నం. 3: “పరిపూర్ణ ప్రేమను” కలిగివుండడం అంటే ఏమిటి? (1 యోహా. 4:18)
నం. 4: td 37ఎ యేసు మానవ ప్రాణం “అందరికోసం విమోచన క్రయధనంగా” చెల్లించబడింది
నవం. 12 బైబిలు పఠనం: ఆమోసు 1-9 పాట 22 (130)
ప్రసంగ లక్షణం: సమర్థమైన ముగింపు (be 220వ పేజీ, 1-3 పేరాలు)
నం. 1: ఆమోసు పుస్తకానికి ఉపోద్ఘాతం మరియు ఎందుకు ప్రయోజనకరం (bsi07 14, 15 పేజీలు, 1-6 పేరాలు, 13-17 పేరాలు)
నం. 2: ఆమోసు 2:1-16
నం. 3: అనుభవం ఒక మంచి ఉపాధ్యాయుడు ఎందుకు కాదు?
నం. 4: td 37బి అది సరిసమానమైన మూల్యం
నవం. 19 బైబిలు పఠనం: ఓబద్యా 1-యోనా 4 పాట 29 (222)
ప్రసంగ లక్షణం: మనస్సులో పెట్టుకోవలసిన విషయాలు (be 220వ పేజీ, 4వ పేరా-221వ పేజీ, 4వ పేరా)
నం. 1: ఓబద్యా, యోనా పుస్తకాలకు ఉపోద్ఘాతం మరియు ఎందుకు ప్రయోజనకరం (bsi07 16, 17 పేజీలు, 1-5 పేరాలు, 10-14 పేరాలు; 17, 18 పేజీలు, 1-4 పేరాలు, 9-12 పేరాలు)
నం. 2: యోనా 1:1-17
నం. 3: భూపరదైసుకు ముందు ఆధ్యాత్మిక పరదైసు ఎందుకు ఉండాలి?
నం. 4: gtd 38ఎ వివాహ బంధాన్ని ఘనమైనదిగా ఎంచాలి
నవం. 26 బైబిలు పఠనం: మీకా 1-7 పాట 15 (127)
ప్రసంగ లక్షణం: క్షేత్ర పరిచర్యలో (be 221వ పేజీ, 5వ పేరా-222వ పేజీ, 6వ పేరా)
నం. 1: మీకా పుస్తకానికి ఉపోద్ఘాతం మరియు ఎందుకు ప్రయోజనకరం? (bsi07 19-21 పేజీలు, 1-8, 16-19 పేరాలు)
నం. 2: మీకా 2:1-13
నం. 3: సాత్వికంగా ఉండడం అంటే అర్థమేమిటి?
నం. 4: htd 38బి శిరస్సత్వ సూత్రాన్ని క్రైస్తవులు గౌరవించాలి
డిసెం. 3 బైబిలు పఠనం: నహూము 1-హబక్కూకు 3 పాట 11 (85)
ప్రసంగ లక్షణం: చెబుతున్న వివరాలు ఖచ్చితమైనవిగా ఉండడం (be 223వ పేజీ, 1-5 పేరాలు)
నం. 1: నహూము, హబక్కూకు పుస్తకాలకు ఉపోద్ఘాతం మరియు ఎందుకు ప్రయోజనకరం (bsi07 21, 22 పేజీలు, 1-7 పేరాలు, 11-12 పేరాలు; 23, 24 పేజీలు, 1-5 పేరాలు, 12-14 పేరాలు)
నం. 2: హబక్కూకు 1:1-17
నం. 3: నిరంతర జీవితం ఎందుకు విసుగు పుట్టించదు?
నం. 4: itd 38సి పిల్లల విషయంలో క్రైస్తవ తల్లిదండ్రుల బాధ్యత
డిసెం. 10 బైబిలు పఠనం: జెఫన్యా 1-హగ్గయి 2 పాట 21 (191)
ప్రసంగ లక్షణం: “నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టం[డి]” (be 224వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: జెఫన్యా, హగ్గయి పుస్తకాలకు ఉపోద్ఘాతం మరియు ఎందుకు ప్రయోజనకరం (bsi07 25, 26 పేజీలు, 1-6 పేరాలు, 10-12 పేరాలు; 27, 28 పేజీలు, 1-7 పేరాలు, 13-16 పేరాలు)
నం. 2: జెఫన్యా 3:1-17
నం. 3: td 38డి క్రైస్తవులు కేవలం క్రైస్తవులనే వివాహం చేసుకోవాలి
నం. 4: jఆధ్యాత్మికత వివాహాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
డిసెం. 17 బైబిలు పఠనం: జెకర్యా 1-8 పాట 4 (43)
ప్రసంగ లక్షణం: సమాచారం ఖచ్చితమైనదేనా అన్నది పరిశీలించడం (be 225వ పేజీ, 1-3 పేరాలు)
నం. 1: జెకర్యా పుస్తకానికి ఉపోద్ఘాతం (bsi07 28, 29 పేజీలు, 1-7 పేరాలు)
నం. 2: జెకర్యా 7:1-14
నం. 3: రూపాంతర దర్శనం ఎలా నెరవేరింది?
నం. 4: ktd 38ఇ బహు భార్యత్వము లేఖనాధారం కాదు
డిసెం. 24 బైబిలు పఠనం: జెకర్యా 9-14 పాట 1 (13)
ప్రసంగ లక్షణం: ఇతరులకు అర్థమయ్యేలా ఉండడం (be 226వ పేజీ, 1వ పేరా-227వ పేజీ, 1వ పేరా)
నం. 1: జెకర్యా ఎందుకు ప్రయోజనకరం, మలాకీ పుస్తకానికి ఉపోద్ఘాతం మరియు ఎందుకు ప్రయోజనకరం (bsi07 29, 30 పేజీలు, 23-27 పేరాలు; 31, 32 పేజీలు, 1-6 పేరాలు, 13-17 పేరాలు)
నం. 2: జెకర్యా 10:1-12
నం. 3: td 39ఎ క్రైస్తవులు సబ్బాతును ఆచరించనవసరం లేదు
నం. 4: హింసను ఎదుర్కొనేందుకు మనమెలా సిద్ధపడవచ్చు?
డిసెం. 31 బైబిలు పఠనం: మలాకీ 1-4 పాట 20 (93)
ప్రసంగ లక్షణం: పరిచయంలేని పదాలను వివరించడం (be 227వ పేజీ, 2-4 పేరాలు)
మౌఖిక పునఃసమీక్ష
[అధస్సూచీలు]
a సహోదరులను మాత్రమే నియమించండి.
b సహోదరులను మాత్రమే నియమించండి.
c సహోదరులను మాత్రమే నియమించండి.
d సహోదరులను మాత్రమే నియమించండి.
e సహోదరులను మాత్రమే నియమించండి.
f సహోదరులను మాత్రమే నియమించండి.
g సహోదరులను మాత్రమే నియమించండి.
h సహోదరులను మాత్రమే నియమించండి.
i సహోదరులను మాత్రమే నియమించండి.
j సహోదరులను మాత్రమే నియమించండి.
k సహోదరులను మాత్రమే నియమించండి.