దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, 2006 అక్టోబరు 30వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2006 సెప్టెంబరు 4 నుండి అక్టోబరు 30 మధ్య వారాల్లోని నియామకాల సమాచారంపై 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేకపోతే, మీరే స్వయంగా పరిశోధించి జవాబులను తెలుసుకోవాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]
ప్రసంగ లక్షణాలు
1. ప్రసంగిస్తున్నప్పుడు మనోనిబ్బరంతో ఉండడం ఎందుకు ప్రాముఖ్యం, మన వ్యాకులతను ఎలా తగ్గించుకోవచ్చు? [be 135వ పేజీ, 5వ పేరా-137వ పేజీ, 2వ పేరా, బాక్సులు]
2. మన నమ్మకాల గురించి ప్రశ్నించబడినప్పుడు, బైబిలును ఉపయోగిస్తూ జవాబు చెప్పేందుకు మనమెందుకు కృషి చేయాలి? [be 143వ పేజీ, 1-3 పేరాలు]
3. బైబిలును ఉపయోగించడంలో మనం మరింత ప్రవీణులం ఎలా కావచ్చు? [be 144వ పేజీ, బాక్సు]
4. పరిచర్యలో మనం బోధిస్తున్నప్పుడు బైబిలును ఎక్కువగా ఉపయోగించడం ఎందుకు ప్రాముఖ్యం, క్రైస్తవ కూటాల్లో దాని ఉపయోగాన్ని మనం ఎలా ప్రోత్సహించవచ్చు? [be 145-6 పేజీలు, బాక్సులు]
5. ఒక లేఖనాన్ని పరిచయం చేస్తున్నప్పుడు మనకు ఉండే రెండు లక్ష్యాలేమిటి? [be 147వ పేజీ, 2వ పేరా]
ఒకటవ నియామకం
6. కీర్తనల్లో సజీవమైన ఏ సందేశం ఉంది? [bsi06 17వ పేజీ, 23వ పేరా]
7. సామెతలు ఎప్పుడు వ్రాయబడి సంపుటీకరించబడ్డాయి? [bsi06 20వ పేజీ, 5వ పేరా]
8. సామెతలు అంటే ఏమిటి, ఆ పుస్తకానికున్న హీబ్రూ పేరు ఎందుకు సరైంది? [bsi06 20వ పేజీ, 6వ పేరా]
9. సామెతలు 2:1-5 లో ‘వెండిని వెదకినట్లు దాచబడిన ధనమును వెదకినట్లు’ పరిజ్ఞానం కోసం, గ్రహింపు కోసం, వివేచన కోసం వెదకుతూనే ఉండాలని ఇవ్వబడిన ప్రోత్సాహం దేనిని సూచిస్తుంది? [be 38వ పేజీ, 4వ పేరా]
10. సామెతల ప్రయోజనకరమైన సంకల్పం ఆ పుస్తకంలో ఎలా వెల్లడిచేయబడింది? [bsi06 21వ పేజీ, 19వ పేరా]
వారపు బైబిలు పఠనం
11. దావీదు ఎలా ‘చనుపాలు విడిచిన పిల్ల తన తల్లియొద్దనున్నట్లు తన ప్రాణాన్ని నిమ్మళపరచుకొని సముదాయించుకున్నాడు,’ మనం ఆయనను ఎలా అనుకరించవచ్చు? (కీర్త. 131:1-3)
12. కీర్తన 139:7-12 లోని ప్రేరేపిత వాక్యాల నుండి ఎలాంటి ఓదార్పు పొందవచ్చు?
13. మన ప్రార్థనలో, మన బహిరంగ పరిచర్యలో యెహోవాను స్తుతించేలా మనల్ని ప్రోత్సహించే 145వ కీర్తనలో పేర్కొనబడిన ఆయన మహాత్మ్యానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఏమిటి? (కీర్త. 145:3)
14. యెహోవాపట్ల భయభక్తులు చూపించడం ఎలా “తెలివికి మూలము” “జ్ఞానమునకు మూలము”? (సామె. 1:7; 9:10)
15. సామెతలు 7:1, 2 లో పేర్కొనబడిన ‘నా మాటల్లో,’ ‘నా ఆజ్ఞల్లో’ ఏమి ఇమిడివున్నాయి?