కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/06 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2006
  • ఉపశీర్షికలు
  • అక్టోబరు 9తో ప్రారంభమయ్యే వారం
  • అక్టోబరు 16తో ప్రారంభమయ్యే వారం
  • అక్టోబరు 23తో ప్రారంభమయ్యే వారం
  • అక్టోబరు 30తో ప్రారంభమయ్యే వారం
  • నవంబరు 6తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2006
km 10/06 పేజీ 2

సేవా కూటాల పట్టిక

అక్టోబరు 9తో ప్రారంభమయ్యే వారం

పాట 2 (15)

10 నిమి:స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేసుకోబడిన ప్రకటనలు. 8వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ, అక్టోబరు 15 కావలికోటను, అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను రాజ్యవార్త నం. 37తోపాటు ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి.

15 నిమి:“దేవుని స్నేహితులు కావడానికి ఇతరులకు సహాయం చేయండి.”a ఇతరుల మాదిరి, హృదయపూర్వక ప్రార్థన బాప్తిస్మం తీసుకొనేంతగా అభివృద్ధి సాధించేందుకు తమకు ఎలా సహాయం చేశాయో వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

20 నిమి:రాజ్యవార్త నం. 37ను పంచిపెట్టేందుకు సిద్ధపడండి. ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. సెప్టెంబరు మన రాజ్య పరిచర్యలో చర్చించబడిన ప్రచార కార్యక్రమం గురించి చేయబడిన ఏర్పాట్లను సమీక్షించండి. ఉత్సాహంగా పాల్గొనమని అందరినీ ప్రోత్సహించండి. తమ విద్యార్థులకు బాప్తిస్మం తీసుకోని ప్రచారకులుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హతలు ఉన్నాయో లేవో ఆలోచించమని ప్రగతి సాధిస్తున్న బైబిలు అధ్యయనాలు ఉన్నవారిని ప్రోత్సహించండి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు అర్హులో కాదో ఆలోచించవచ్చు. యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 79-81 పేజీల్లో ఉన్న అర్హతలను క్లుప్తంగా తెలియజేయండి.

పాట 27 (221) ముగింపు ప్రార్థన.

అక్టోబరు 16తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (45)

10 నిమి:స్థానిక ప్రకటనలు.

20 నిమి:సంఘ పుస్తక అధ్యయనం నుండి ప్రయోజనం పొందడం. యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 69వ పేజీలో ఉన్న ఉపశీర్షిక నుండి 72వ పేజీలోని మొదటి ఉపశీర్షిక వరకు ఉన్న పేరాల ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ.

15 నిమి:“మీరు దేనికి ప్రథమస్థానం ఇస్తున్నారు?”b రాజ్య సంబంధమైన విషయాలకు ప్రథమస్థానం ఇవ్వడానికి తమ సమయపట్టికలో చేసుకున్న సర్దుబాట్ల గురించి, దానివల్ల తాము చవిచూసిన ఆశీర్వాదాల గురించి వ్యాఖ్యానించమని ముందుగానే ఏర్పాటు చేయబడిన ప్రచారకులను ఆహ్వానించండి.

పాట 4 (43), ముగింపు ప్రార్థన.

అక్టోబరు 23తో ప్రారంభమయ్యే వారం

పాట 26 (212)

10 నిమి:స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. 8వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ ఒక ప్రదర్శనలో నవంబరు 1 కావలికోట, అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు! పత్రికలను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ఒక ప్రదర్శనలో “మీరెందుకిలా తరచూ కలుస్తుంటారు” అని చెప్పి సంభాషణను ఆటంకపర్చే వ్యక్తితో ఎలా వ్యవహరించాలో చూపించండి.​—⁠బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకంలో 12వ పేజీ చూడండి.

15 నిమి:స్థానిక అవసరాలు.

20 నిమి:“క్షేత్రసేవా కూటాల నుండి పూర్తి ప్రయోజనం పొందండి.”c 3వ పేరాను చర్చిస్తున్నప్పుడు, క్షేత్రసేవా కూటాన్ని నిర్వహించడానికి అర్హులైన సహోదరులు లేని సందర్భాల్లో ఏమి చేయాలనే విషయం గురించి మన రాజ్య పరిచర్య సెప్టెంబరు 2001లో, ప్రశ్నాభాగంలోని 4వ పేరాలోని వ్యాఖ్యానాలను చేర్చండి.

పాట 16 (143), ముగింపు ప్రార్థన.

అక్టోబరు 30తో ప్రారంభమయ్యే వారం

పాట 1 (13)

10 నిమి:స్థానిక ప్రకటనలు. క్షేత్ర సేవా రిపోర్టులు ఇమ్మని, అలాగే రాజ్యవార్త నం. 37ను ఎన్నెన్ని ఇచ్చారో రిపోర్టుల వెనక వ్రాయమని గుర్తు చేయండి.

15 నిమి:నా తోటి విద్యార్థులకు నేనెలా ప్రకటించగలను? ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. తోటి విద్యార్థులకు ప్రకటిస్తున్నప్పుడు తమకు ఎదురైన చక్కటి అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

20 నిమి:రాజ్యవార్త నం. 37ను అందిస్తున్నప్పుడు ఎదురైన అనుభవాలు. రాజ్యవార్త నం. 37ను అందిస్తున్నప్పుడు తాము పొందిన ప్రోత్సాహకరమైన ఫలితాలను చెప్పమని ప్రచారకులను ప్రోత్సహించండి. ప్రస్తుతం క్షేత్రాన్ని ఎంతవరకు పూర్తి చేశారో, నవంబరు 12కల్లా క్షేత్రాన్ని పూర్తి చేయడానికి ఇంకా ఏమి చేయాల్సిన అవసరం ఉందో చెప్పండి. బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఉపయోగించి పునర్దర్శనాలు ఎలా చేయాలో ప్రదర్శించండి. ప్రచారకులు తాము అందించలేని కరపత్రాలను ఇతరులు ఉపయోగించేందుకు వీలుగా ప్రచార కార్యక్రమం ముగిసేలోపు వెనక్కివ్వమని వారికి గుర్తు చేయండి.

పాట 26 (212), ముగింపు ప్రార్థన.

నవంబరు 6తో ప్రారంభమయ్యే వారం

పాట 11 (85)

10 నిమి:స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య జనవరి 2005లోని 3-4 పేజీల్లోవున్న సూచనలను లేదా మీ క్షేత్రానికి అనుకూలమైన వేరే ప్రతిపాదనలను ఉపయోగిస్తూ గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి (ఆంగ్లం) పుస్తకాన్ని లేక మీరు అందించే ప్రచురణలను నవంబరు నెల మధ్య నుండి ఎలా అందించాలో ప్రదర్శించండి. సమయముంటే, ప్రచురణను క్షేత్రంలో అందించడంవల్ల లేదా తమ కుటుంబంలోని వారికి ఇవ్వడంవల్ల వచ్చిన సత్ఫలితాల గురించి వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

15 నిమి:మీ వివాహ దినపు ఆనందాన్ని, గౌరవాన్ని అధికం చేసుకోండి. కావలికోట అక్టోబరు 15, 2006, 28-31 పేజీల ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం.

20 నిమి:వాక్యమును ప్రకటించుట సేదదీరుస్తుంది. కావలికోట జనవరి 15, 2002, 8-9 పేజీల ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. పరిచర్య ఎలా తమను సేదదీరుస్తుందో వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి. ఒకటి లేదా రెండు వ్యాఖ్యానాలను ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు.

పాట 16 (143), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి