ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకంలోని సవరణలు
1994వ సంవత్సరంలో ప్రచురించబడిన ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకంలోని కీలకమైన సవరణలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు, ఇటీవలి వార్షిక పుస్తకములో లేదా ఇతర ప్రచురణల్లో కనుగొనబడే కొన్ని గణాంకవివరాల సవరణలు ఈ లిస్టులో ఇవ్వబడలేదు.
అధ్యాయం 4
19వ పేజీ, 4వ పేరాలోని ఈ చివరి లేఖనం తొలగించబడింది: మత్తయి 25:31-33
అధ్యాయం 5
24వ పేజీ, 3వ పేరా అధస్సూచి ఉన్నచోట ఇలా ఉండాలి: * స్పష్టమైన వివరణ కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో 88-92, 215-18 పేజీలు చూడండి.
అధ్యాయం 6
30వ పేజీ, 12వ పేరా 6వ వాక్యం ఉన్నచోట ఇలా ఉండాలి: చివరికి రోమాసామ్రాజ్య చక్రవర్తి కాన్స్టంటైన్ “క్రైస్తవ” మతానికి ప్రభుత్వ ఆమోదాన్నిచ్చాడు, ఇది క్రైస్తవ మత సామ్రాజ్యం ఉద్భవించడానికి కారణమైంది, దానిలో చర్చీ, రాజకీయాలు కలిసి వెయ్యేండ్లు అధికారం చెలాయించాయి.
32వ పేజీ, బాక్సులోని మొదటి పేరా ఉన్నచోట ఇలా ఉండాలి: యేసు సా.శ. 29 అక్టోబరులో యొర్దాను నదిలో బాప్తిస్మంపొంది, నియమిత రాజుగా అభిషేకించబడ్డాడు. మూడున్నర సంవత్సరాల తర్వాత, సా.శ. 33లో ఆయన యెరూషలేము దేవాలయానికి వచ్చి దాన్ని దొంగల గుహగా చేస్తున్నవారిని తరిమేశాడు. దీనికి, యేసు 1914 అక్టోబరులో పరలోకంలో సింహాసనాసీనుడైనప్పటి నుండి, దేవుని ఇంటివారికి తీర్పు తీర్చడం ఆరంభించి నామకార్థ క్రైస్తవులను తనిఖీచేయడానికి వచ్చేంతవరకున్న కాలం అంటే మూడున్నర సంవత్సరాల కాలం సారూప్యంగా ఉన్నట్లు కనబడుతోంది. (మత్తయి 21:12, 13; 1 పేతురు 4:17) యెహోవా ప్రజల రాజ్యసంబంధిత కార్యకలాపాలు 1918 తొలిభాగంలో గొప్ప వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. అది భూవ్యాప్త పరీక్షాకాలం, భయస్థులు తొలగించబడ్డారు. 1918 మే నెలలో, క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు వాచ్‌టవర్ సొసైటీ అధికారులను బంధించాలని ఉసిగొల్పారు, గానీ తొమ్మిది నెలల తర్వాత వారు విడుదల చేయబడ్డారు. ఆ తర్వాత వారిమీద వేయబడిన అబద్ధ ఆరోపణలు కొట్టివేయబడ్డాయి. 1919 నుండి, దేవుని ప్రజల సంస్థ పరీక్షించబడి, శుద్ధీకరించబడి యేసుక్రీస్తు రాజుగావున్న యెహోవా రాజ్యమే మానవజాతి నిరీక్షణ అని ప్రకటించడానికి ఆసక్తితో ముందుకు సాగింది.—మలాకీ 3:1-3.
అధ్యాయం 8
40వ పేజీ, 8వ పేరా 5వ లైనులోని “125 తప్పులున్నట్లు” అని ఉన్నచోట ఇలా ఉండాలి: 130 తప్పులున్నట్లు
40వ పేజీ, 10వ పేరా చివరి వాక్యం ఉన్నచోట ఇలా ఉండాలి: అమెరికాలోని సుప్రీంకోర్టులోనే యెహోవాసాక్షులు 50 కేసులను గెలిచారు.
అధ్యాయం 10
50వ పేజీ, 11వ పేరా అధస్సూచి ఉన్నచోట ఇలా ఉండాలి: * ఉదాహరణకు, కావలికోట నవంబరు 1, 2003 సంచికలోని “నమ్మకమైన క్రైస్తవ స్త్రీలు—దేవుని ప్రశస్త ఆరాధకులు” అనే శీర్షికను చూడండి.
అధ్యాయం 11
56వ పేజీ, 9వ పేరా, ఆ పేరాలోని రెండవ సగం ఉన్నచోట ఇలా ఉండాలి: ఈ సందర్భంగా, కావలికోట పత్రిక, “మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటూ ఉండండి,” “మనం మన కోసమే జీవించకుండా ఉండడం” వంటి అంశాలను చర్చిస్తూ ప్రోత్సాహాన్నిచ్చింది.* అటువంటి లేఖనాధారిత తోడ్పాటుతో, యెహోవా ఎదుట యథార్థతతో వినయంగా, ప్రార్థనాపూర్వకంగా నడచుకోవడానికి ప్రయత్నిస్తూ మన ఆంతర్యాన్ని పరిశీలించుకుందాము.—కీర్తన 26:1-3; 139:23, 24.
56వ పేజీ, 9వ పేరా అధస్సూచి ఉన్నచోట ఇలా ఉండాలి: * కావలికోట జూలై 15, 2005, మార్చి 15, 2005 పత్రికలు చూడండి.
అధ్యాయం 12
61వ పేజీ, 14వ పేరా అధస్సూచి ఉన్నచోట ఇలా ఉండాలి: #యోహాను తరగతి ప్రచురిస్తున్న కావలికోట పత్రిక, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, వీలైనంత ఎక్కువగా ప్రకటించే పనిలో భాగం వహించే అత్యవసరతను పునరుద్ఘాటిస్తూనే వస్తోంది. ఉదాహరణకు కావలికోట జనవరి 1, 2004 సంచికలోని “యెహోవా మహిమను అందరూ ప్రకటించుదురు గాక,” ‘వారి స్వరం భూలోకమంతటికి బయలువెళ్లింది’ వంటి శీర్షికలను చూడండి. అలాగే, జూన్ 1, 2004 సంచికలోని “దేవుణ్ణి మహిమపరిచేవారు ధన్యులు” అనే ఆర్టికల్ ‘తీసివున్న తలుపు’ అనే పూర్తికాల సేవలోకి ప్రవేశించడాన్ని నొక్కిచెప్పింది. అలాంటి సేవలో 2005వ సంవత్సరంలోని ఒక నెలలో, శిఖరాగ్ర సంఖ్యలో 10,93,552 మంది రిపోర్టుచేశారు.
అధ్యాయం 13
69వ పేజీ, 11వ పేరా చివరి వాక్యం ఉన్నచోట ఇలా ఉండాలి: బైబిల్లో ప్రవచింపబడిన అన్యజనముల కాలములు అంతమయ్యేది 1914లోనే అని, అప్పుడు భూమ్మీద ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయని, దాదాపు 40 సంవత్సరాలు ముందుగానే వారు సూచించారు.—ప్రకటన 1:10.
69వ పేజీ, 12వ పేరా, 2వ కాలమ్, 8-9 లైన్లలో ఉన్న “టెక్సాస్‌లోని ఎల్పాపో” ఉన్నచోట ఇలా ఉండాలి: టెక్సాస్‌లోని పాంపా
70వ పేజీ, 20వ లైను-71వ పేజీ, 1-2 లైన్లలో ఉన్న “1993లో యీ రెండు పత్రికలు కలిపి మొత్తం 2 కోట్ల 90 లక్షలకంటె ఎక్కువ కాపీలు” అనేది ఉన్నచోట ఇలా ఉండాలి: 2006లో ఈ రెండు పత్రికలు కలిపి 5 కోట్ల 90 లక్షలకంటే ఎక్కువ కాపీలు
73వ పేజీ, 23వ పేరా, 10వ లైన్లోవున్న లేఖనాన్ని తొలగించాలి: మత్తయి 25:31
అధ్యాయం 16
90వ పేజీ, 4వ పేరా, రెండవ అధస్సూచి ఉన్నచోట ఇలా ఉండాలి: #యేసు 1914లో రాజ్యాధికారానికి వచ్చాడనడానికి సవివరమైన నిదర్శనం కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలోని 215-18 పేజీలు చూడండి.
90వ పేజీ, 6వ పేరా ఉన్నచోట ఇలా ఉండాలి: క్రొత్తగా కిరీటధారియైన రాజు యుద్ధానికి ఎందుకు బయలుదేరాలి? ఎందుకంటే, ఆయన రాజ్యం యెహోవాకు ప్రధాన శత్రువైన అపవాదియగు సాతాను వ్యతిరేకతతోపాటు తెలిసో, తెలియకో అతని ఉద్దేశాలను నెరవేర్చే భూప్రజల తీవ్రవ్యతిరేకతవున్న కాలంలో స్థాపించబడింది. రాజ్యస్థాపన, పరలోకంలో ఒక పెద్ద యుద్ధానికి దారితీస్తుంది. మిఖాయేలు (అంటే “దేవుని పోలిన వారెవరు?”) అనే నామమున యుద్ధం చేస్తూ యేసు, సాతానుపై అతని దయ్యాలపై విజయం సాధించి, వారిని భూమిపైకి పడద్రోస్తాడు. (ప్రకటన 12:7-12) గొర్రెల్లాంటి మానవులు సమకూర్చబడుతుండగా, యేసు విజయోత్సాహపు స్వారీ ప్రభువు దినపు ప్రారంభ దశాబ్దాల్లో కొనసాగుతుంది. ఇప్పటికీ లోకమంతా “దుష్టుని యందు” ఉన్నప్పటికీ, యేసు తన అభిషిక్త సహోదరులను, వారి సహచరులను ప్రేమతో కాస్తూ, ప్రతీ ఒక్కరు విశ్వాస విజయాన్ని పొందడానికి సహాయం చేస్తూనేవున్నాడు.—1 యోహాను 5:19.
91వ పేజీ, 9వ పేరా చివరి వాక్యం ఉన్నచోట ఇలా ఉండాలి: క్యాథలిక్ దేశాల్లోను, విపరీతమైన హింసలు కలిగిన జర్మనీ, ఇటలీ, జపాన్‌వంటి దేశాల్లోను అభివృద్ధి గణనీయంగావుంది, ఆ దేశాల్లో మొత్తం 6,00,000 కంటే ఎక్కువమంది సాక్షులు ఇప్పుడు చురుకుగా క్షేత్రపరిచర్యలో పాల్గొంటూ రిపోర్టు చేస్తున్నారు.—యెషయా 54:17; యిర్మీయా 1:17-19.
94వ పేజీ, 18వ పేరా ఉన్నచోట ఇలా ఉండాలి: దీన్ని సైనిక సాంకేతిక జ్ఞానానికి విజయకేతనమని అనవచ్చా? కాదుగానీ కనికరంలేని ఆ ఎఱ్ఱనిగుఱ్ఱం దూసుకుపోతోందనడానికే ఇదొక నిదర్శనం. ఆ దూసుకుపోవడం ఎక్కడ ఆగుతుంది? పథకంవేసి చేసే అణుయుద్ధమే కాదుగానీ ప్రమాదవశాత్తు అణుయుద్ధం జరిగే సాధ్యత కూడా ఉందని కొందరు విజ్ఞానశాస్త్రజ్ఞులు అంటున్నారు. అయితే, తెల్లని గుఱ్ఱమెక్కిన జయశాలికి ఈ విషయంలో వేరే తలంపులున్నాయి.
97వ పేజీ, 28వ పేరా ఉన్నచోట ఇలా ఉండాలి: ఇక్కడ ప్రస్తుతం ప్రాముఖ్యమైనది, ‘మరణకరమైన’ తెగులు. మొదటి ప్రపంచ యుద్ధానంతర విధ్వంసం తర్వాత, 1918-19లో స్పానిష్ ఫ్లూ అనే విషజ్వరం కొన్ని నెలల్లోనే 2 కోట్లమంది ప్రాణాలను బలితీసుకుంది. సెయింట్ హెలీనా అనే చిన్న ద్వీపమొక్కటే ఈ తెగులు వాతపడకుండా తప్పించుకోగలిగింది. అధికంగా హతులైనచోట కుప్పలుతెప్పలుగా పడిన శవాలను సామూహికంగా దహించవలసి వచ్చింది. నేడు, ముఖ్యంగా పొగాకు వాడకం మూలంగా వచ్చే హృద్రోగం, క్యాన్సర్వ్యాధి వణకు పుట్టిస్తున్నాయి. “నీచమైన దశాబ్దం” అని అభివర్ణించబడిన 1980వ దశాబ్దంలో, బైబిలు ప్రమాణాల ప్రకారం అవినీతికరమైనదిగా పరిగణించబడే జీవిత విధానంవల్ల ఎయిడ్స్ మహమ్మారి ఈ ‘మరణకరమైన’ తెగులుకు తోడైంది. 2000వ సంవత్సరంలో, అమెరికా సర్జన్ జనరల్ ఎయిడ్స్‌ను, “ప్రపంచానికి ఇంతవరకు తెలిసిన వాటిలోకెల్లా ఘోరమైన వ్యాధి” అని పిలిచినట్లు నివేదించబడింది. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల 2 లక్షలమందికి హెచ్ఐవి/ఎయిడ్స్ సోకిందని, వారిలో 2 కోట్లమంది మరణించారని ఆయన అన్నాడు. యెహోవా వాక్యంలోని జ్ఞానవంతమైన ఉపదేశం ఆయన ప్రజలను వ్యభిచారం నుండి, నేడు అనేక రోగాలు సోకడానికి కారణమవుతున్న రక్తమార్పిడులకు దూరంగా ఉంచుతున్నందుకు వారెంత కృతజ్ఞులో కదా!—అపొస్తలుల కార్యములు 15:28, 29; 1 కొరింథీయులు 6:9-11 పోల్చండి.
అధ్యాయం 17
100వ పేజీ, 2వ పేరా 13వ లైన్‌లోని “1 దినవృత్తాంతములు 23:4” ఉన్నచోట ఇలా ఉండాలి: 1 దినవృత్తాంతములు 24:4
అధ్యాయం 18
106వ పేజీ, 7వ పేరా ఉన్నచోట ఇలా ఉండాలి: రెండవ ప్రపంచ యుద్ధం మరెన్నో విపత్కర మార్పులు తెచ్చింది. చిన్నచిన్న పోరాటాలతోపాటు అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రపంచాన్ని కుదిపేస్తూ ఉన్నాయి. ఉగ్రవాదుల లేదా నరమేథం సృష్టించగల ఆయుధాలు ఉపయోగించే ఆయాదేశాల భయంకరమైన బెదిరింపు అనేకమందిని ఆలోచనలో పడేసింది.
106వ పేజీ, 7-9 (బి) ప్రశ్న ఉన్నచోట ఇలా ఉండాలి: యేసు ప్రత్యక్షతా కాలంలో మానవ సమాజంలో జరిగే విపత్కర మార్పులు చివరకు మానవుల్లో ఎలాంటి పరిస్థితిని కలిగిస్తాయి?
107వ పేజీ, 9వ పేరాలోని మూడవ వాక్యం ఉన్నచోట ఇలా ఉండాలి: ఆ తర్వాత వచ్చిన చీకటి కాలం, దారితెలియక ‘కలవరపడిన జనములకు శ్రమ కలుగును. లోకముమీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యము చెడి కూలుదురు” అని యేసు తన ప్రత్యక్షత గురించి చెప్పిన ప్రవచన నెరవేర్పులోని భాగమే. (లూకా 21:7-9, 25-31)*
107వ పేజీ, 9వ పేరా అధస్సూచి ఉన్నచోట ఇలా ఉండాలి: * 1895 నుండి 1931 వరకు 35 కన్నా ఎక్కువ సంవత్సరాలపాటు, ముఖచిత్రపు నేపథ్యంలో ఉప్పొంగుతున్న సముద్రంపై కారు మేఘాలపై వెలుగు ప్రసరిస్తున్న దీపస్థంభమున్న కావలికోట (ఆంగ్లం) అట్టమీద లూకా 21:25, 28, 31లోని వచనాలు ఉల్లేఖించబడ్డాయి.
107వ పేజీ, 11వ పేరా నాలుగవ వాక్యం ఉన్నచోట ఇలా ఉండాలి: ఈ భూవ్యాప్త ప్రకటన సాతాను లోక విధానాన్ని హెచ్చరిస్తోంది.*
109వ పేజీ, 17వ పేరా ప్రకటన 6:12బి, 13వ వచనం తర్వాతవున్న ఈ రెండవ వాక్యాన్ని తొలగించాలి: అది అంతకుముందు యేసు మత్తయి 24:29లో ప్రవచించిన విపత్కర పరిస్థితి అంతాన్ని సూచిస్తుంది.
అధ్యాయం 20
123వ పేజీ, 11వ పేరా 4వ వాక్యం ఉన్నచోట ఇలా ఉండాలి: ఇది ముద్రించబడే సమయానికి భూవ్యాప్తంగా 125 కన్నా ఎక్కువ దేశాల్లో వివిధ మెప్స్ ప్రోగ్రాములు ఉపయోగించబడుతున్నాయి, ఆ ప్రోగ్రాంవల్ల ఏకకాలంలో 130 కన్నా ఎక్కువ భాషల్లో పక్షపత్రిక అయిన కావలికోట ప్రచురించడానికి వీలౌతోంది.
128వ పేజీ, 30వ పేరా చివరి వాక్యం ఉన్నచోట ఇలా ఉండాలి: మానవజాతిలో కొద్దిమంది మాత్రమే, అంటే, ముద్రించబడిన 1,44,000 మందిలో భూమ్మీద ఇంకా బ్రతికివుండే అవకాశంవున్న వారితోపాటు, వేరేగొఱ్ఱెలకు సంబంధించిన గొప్పసమూహములో ‘తాళుకునేవారు’ లేదా తప్పించుకునేవారు ఉంటారు.—యిర్మీయా 35:19; 1 కొరింథీయులు 16:13.
అధ్యాయం 22
143వ పేజీ, ఉపశీర్షిక ఉన్నచోట ఇలా ఉండాలి: నేటి మిడతల తెగులు
146వ పేజీ, 16వ పేరాలో ప్రకటన 9:10వ వచనం తర్వాత వాక్యాలు ఇలా ఉండాలి: దీని భావమేమైయుండవచ్చు? యెహోవాసాక్షులు నోటి మాటను, ముద్రిత సాహిత్యాలను ఉపయోగిస్తూ రాజ్యప్రచారానికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యంమీద ఆధారపడిన అధికారపూర్వక వ్యాఖ్యానాలు చేస్తారు. వారు రాబోవు యెహోవా ఉగ్రత దినాన్నిగూర్చి హెచ్చరిస్తారు కాబట్టి, వారి సందేశానికి తేలువంటి కొండి ఉంటుంది. (యెషయా 61:2) ప్రస్తుత ఆధ్యాత్మిక మిడతల తరం యొక్క జీవితకాలం గడిచిపోకముందే, యెహోవా తీర్పులు ప్రకటించే దైవనియమిత పని, అహంకారపూరిత దూషకులను బాధిస్తూ పూర్తవుతుంది.
146వ పేజీ, 17వ పేరా అధస్సూచి ఉన్నచోట ఇలా ఉండాలి: * ఈ పత్రిక పేరు 1937లో కన్సోలేషన్ అని పిలువబడేది 1946లో అవేక్! (తేజరిల్లు!) అని మార్చబడింది.
147వ పేజీ, 19వ పేరా 5-9 లైన్లు ఇలా ఉండాలి: (మత్తయి 24:3-14; ప్రకటన 12:1-10) అటుతర్వాత, 1917లో లండన్‌లో ప్రచురించబడి, “ప్రపంచంలోకెల్లా మహాగొప్ప ప్రసంగీకులని” వర్ణించబడిన ఎనిమిది మంది మతగురువులు సంతకాలు చేసిన ఒక మానిఫెస్టోను ఎత్తి చూపింది.
అధ్యాయం 24
160వ పేజీ, 21వ పేరా 10వ లైన్లోవున్న “మేకలాంటి మనుష్యులకు” అని ఉన్నచోట ఇలా ఉండాలి: వ్యతిరేకులకు
160వ పేజీ, 21వ పేరా 13వ లైన్లోవున్న “మత్తయి 25:31-34, 41, 46” బదులు ఇలా ఉండాలి: ఫిలిప్పీయులు 1:27, 28
160వ పేజీ, 21 (బి) ప్రశ్న ఇలా ఉండాలి: వ్యతిరేకులకు ఆ సువార్త ఎందుకు దుర్వార్తవుతుంది?
అధ్యాయం 25
161వ పేజీ, 4వ పేరా అధస్సూచి ఉన్నచోట ఇలా ఉండాలి: * ఈ గొప్ప ఆధ్యాత్మిక దేవాలయాన్ని గూర్చిన పూర్తివివరణ కోసం కావలికోట జూలై 1 1996 సంచికలోని, “యెహోవా యొక్క గొప్ప ఆత్మీయ ఆలయం,” డిసెంబరు 1, 1972 సంచిక (ఆంగ్లం)లోని “ఆరాధించడానికున్న ఒకేఒక నిజమైన ఆలయం” అనే ఆర్టికల్స్‌ను చూడండి.
162వ పేజీ, 5వ పేరా మూడవ వాక్యం ఉన్నచోట ఇలా ఉండాలి: హెబ్రీలేఖన ప్రవచనాలలో, అలా కొలవడమనేది యెహోవా పరిపూర్ణ ప్రమాణాల ఆధారంగా న్యాయం చేయబడుతుందనే అభయాన్నిచ్చింది.
162వ పేజీ, 7వ పేరాలో ప్రకటన 11:2 తర్వాత రెండవ వాక్యం ఉన్నచోట ఇలా ఉండాలి: మనం గమనించబోవు రీతిగా, ఇక్కడ చెప్పబడినవి, 1914 డిసెంబరు నుండి 1918 జూన్ వరకున్న అక్షరార్థమైన 42 నెలలు, ఆ సమయంలోనే క్రైస్తవులమని చెప్పుకొంటున్న వారందరికీ కఠిన పరీక్ష ఎదురైంది.
164వ పేజీ, 12వ పేరా మూడవ వాక్యం ఉన్నచోట ఇలా ఉండాలి: అంతేగాక, ప్రభువుదినము ప్రారంభంలో, 1914 డిసెంబరు నుండి 1918 జూన్ వరకు దేవుని ప్రజలనుభవించిన కష్టాలకు, ఇక్కడ ప్రవచింపబడిన సంఘటనలకు సరిగ్గా మూడున్నర సంవత్సరాలు సరిపోయాయి.
165వ పేజీలోని చిత్రానికి సంబంధించిన వ్యాఖ్యానం ఉన్నచోట ఇలా ఉండాలి: జెరుబ్బాబెలు మరియు యెహోషువ చేపట్టిన పునర్నిర్మాణ కార్యక్రమం, ప్రభువు దినములో యెహోవాసాక్షులు చిన్నగుంపుగా ప్రారంభమై గొప్పగా అభివృద్ధి చెందుతారని సూచిస్తుంది. వారి అవసరాలను తీర్చడానికి, పైన చూపించబడినలాంటి, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న భవన సముదాయాలను ఎంతగానో విస్తరింపజేయవలసి వచ్చింది
164వ పేజీ, 15వ పేరా 7వ లైన్లోవున్న “మత్తయి 17:1-3; 25:31” అనే లేఖనం ఉన్నచోట ఇలా ఉండాలి: (మత్తయి 17:1-3)
అధ్యాయం 26
175వ పేజీ, 12వ పేరా అధస్సూచి ఉన్నచోట ఇలా ఉండాలి: * సా.శ.పూ. 63లో యెరూషలేము ముట్టడించబడినప్పుడు, నియస్ పొంపియస్ ఆలయంలోకి ప్రవేశించి అది ఖాళీగా ఉండడం చూశాడని రోమా చరిత్రకారుడైన టాసిటస్ తెలియజేస్తున్నాడు. అందులో నిబంధన మందసంలేదు.—టాసిటస్ హిస్టరీ, 5.9.
అధ్యాయం 27
185వ పేజీ, బాక్సులోని 6వ పేరా ఇలా ఉండాలి: స్పెయిన్‌లో, దేవుని గురించి మాట్లాడడం, క్రైస్తవకూటాలు జరుపుకోవడంలాంటివి చేసిన “నేరానికి,” గృహాలపై దాడిజరిగింది, క్రైస్తవులు జరిమానా విధించబడి జైల్లోవేయబడ్డారు. క్యాథలికేతర మతాల విషయంలో ప్రభుత్వ పథకం మారడంతో, చివరికి 1970లో హింస నిలిచిపోయింది, యెహోవాసాక్షులు చట్టబద్ధంగా నమోదు చేసుకోవడానికి అనుమతించబడ్డారు.
185వ పేజీ, 28వ పేరా మొదటి రెండు వాక్యాలు ఇలా ఉండాలి: ఈ క్రూరమైన హింస 2వ ప్రపంచ యుద్ధకాలంలో తీవ్రస్థాయికి చేరింది. ఐరోపాలో సుమారు 12,000మంది యెహోవాసాక్షులు నాజీ సామూహిక నిర్బంధ శిబిరాల్లో, చెరసాలల్లో చిత్రహింసలకు గురయ్యారు, దాదాపు 2,000 మంది చనిపోయారు.
అధ్యాయం 28
187వ పేజీ, 4వ పేరా అధస్సూచి ఉన్నచోట ఇలా ఉండాలి: * మరిన్ని వివరాలకోసం దయచేసి యెహోవాసాక్షులు ప్రచురించిన దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి! (ఆంగ్లం) అనే పుస్తకంలోని 165-79 పేజీలను చూడండి.
190వ పేజీ, 15వ పేరా మొదటి మూడు వాక్యాలు ఇలా ఉండాలి: క్రూరమృగముయొక్క ముఖ్యమైన ఏడవతలకు ఆ యుద్ధం గొప్ప వినాశకారియైంది. ఇతర ఐరోపా దేశాలతోపాటు బ్రిటన్ అనేకమంది యౌవనులను కోల్పోయింది. ఒక్క పోరాటంలోనే, అంటే 1916లో జరిగిన రివర్ సోమీ పోరాటంలో 4,20,000 మంది బ్రిటీష్ వాళ్ళతోపాటు 1,94,000 మంది ఫ్రెంచ్వాళ్ళు, 4,40,000 మంది జర్మన్ వాళ్ళు క్షతగాత్రులయ్యారు, అంటే 10,00,000 కంటే ఎక్కువమందే క్షతగాత్రులయ్యారు!
192వ పేజీ, 22వ పేరా, 2వ కాలమ్‌లో 8వ లైను ఉన్నచోట ఇలా ఉండాలి: 1918 జూన్ నెలలో వారికి కలిగిన శ్రమలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
అధ్యాయం 29
202వ పేజీ, 14వ పేరా 1-3 లైన్లు ఇలా ఉండాలి: ఈ 1,44,000 మంది “భూలోకములోనుండి,” “మనుష్యులలోనుండి కొనబడిన”వారు. వీరు దేవుని కుమారులుగా స్వీకరించబడ్డారు, వీరు పునరుత్థానం చేయబడిన తర్వాత
అధ్యాయం 30
206వ పేజీ, 3వ పేరా రెండవ వాక్యం ఉన్నచోట ఇలా ఉండాలి: సా.శ.పూ. 539లో ప్రాచీన బబులోను కూలిపోయినప్పుడు ఏమి జరిగింది?
209వ పేజీ, 10వ పేరా 1వ లైను ఉన్నచోట ఇలా ఉండాలి: అభిషిక్త క్రైస్తవులు 1870వ దశాబ్దానికల్లా మహా బబులోను వ్యభిచార మార్గాలనుండి తమను తాము దూరం చేసుకోవాలని ఖచ్చితమైన ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు.
209వ పేజీ, 10వ ప్రశ్న ఉన్నచోట ఇలా ఉండాలి: మరి 1870వ దశాబ్దానికల్లా ఏమి జరిగింది, దానికి మహా బబులోను ఎలా స్పందించింది?
211వ పేజీ, 23వ పేరా మూడవ, నాలుగవ, ఐదవ వాక్యాలు ఇలా ఉండాలి: వెంటనే యేసు విధేయుడౌతాడు. మొదట, 1919 నుండి తన దూతలు 1,44,000 మందిని సమకూర్చే పనిని పూర్తిచేయనిస్తాడు. (మత్తయి 13:39, 43; యోహాను 15:1, 5, 16) తర్వాత, వేరేగొఱ్ఱెలకు సంబంధించిన గొప్పసమూహపు సమకూర్పుపని జరుగుతుంది. (యోహాను 10:16; ప్రకటన 7:9)
అధ్యాయం 32
231వ పేజీ, 27వ పేరా చివరి భాగంలోవున్న “మత్తయి 24:42, 44” అనే వచనం తర్వాత ఇలా ఉండాలి: (మత్తయి 24:42, 44; లూకా 12:37, 40) ఈ హెచ్చరికను ప్రతిధ్వనింపజేస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగా తెలియును. లోకులు—నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా . . . వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును.” “నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదు” అనే తప్పుడు ప్రచారం వెనకున్నది సాతానే.—1 థెస్సలొనీకయులు 5::2, 3.
అధ్యాయం 33
243వ పేజీ, 21వ పేరా చివరినుండి రెండవ వాక్యం ఇలా ఉండాలి: ప్రాముఖ్యమైన విషయమేమిటంటే, పోప్ తన ప్రసంగంలో యేసుక్రీస్తుకు, దేవుని రాజ్యానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.
245వ పేజీ, 25వ పేరా, 3వ లైనులో “(ప్రకటన 14:8; 17:2)” అని ఉన్నచోట ఇలా ఉండాలి: (ప్రకటన 14:8; 17:4)
అధ్యాయం 34
246వ పేజీ, 1వ పేరా చివరి నుండి రెండవ వాక్యం ఇలా ఉండాలి: అయితే ఆ దర్శనం మన దినాల్లో విస్మయమొందించే వాస్తవమౌతుంది.
249వ పేజీ, 10వ పేరా నాలుగవ వాక్యం ఇలా ఉండాలి: అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ నివేదిక ప్రకారం, 1986లోనే కనీసం 50 లక్షలమంది సైనికులు యుద్ధంలో చంపబడ్డారు.
250వ పేజీ, 12వ పేరా అధస్సూచిలో “1981” బదులు ఇలా ఉండాలి: 1993
251వ పేజీ, 14వ పేరా ఉన్నచోట ఇలా ఉండాలి: ఇటీవలి సంవత్సరాల్లో రాజకీయ నాయకులు వివిధ మానవ పథకాలను వర్ణించడానికి ‘శాంతి భద్రతలు’ అనే పదబంధాన్ని ఉపయోగించారు. ప్రపంచ నాయకుల అలాంటి ప్రయత్నాలు 1 థెస్సలొనీకయులు 5:3 నెరవేర్పు యొక్క ఆరంభాన్ని సూచిస్తాయా? లేక పౌలు ప్రపంచ అవధానాన్ని ఆకట్టుకునేంత పెద్ద సంఘటనల్లో కేవలం ఒక్క నిర్దిష్టమైన దాన్నే సూచిస్తున్నాడా? తరచూ బైబిలు ప్రవచనాలను అవి నెరవేరిన తర్వాత లేక నెరవేరుతుండగా మాత్రమే పూర్తిగా అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది కాబట్టి, మనం వేచి చూడాల్సిందే. ఈలోగా, దేశాలు ఏ కాస్త శాంతిభద్రతలను సాధించినట్లు కనిపించినా, ప్రాథమికంగా ఏమీ మారదని క్రైస్తవులకు తెలుసు. స్వార్థం, ద్వేషం, నేరం, కుటుంబ విచ్ఛిన్నత, అవినీతి, రోగం, దుఃఖం, మరణం అందులో ఇంకా ఉంటాయి. అందుకే మీరు ప్రపంచ సంఘటనల భావమేమిటో తెలుసుకోవడంలో మెలకువ కలిగి, దేవుని వాక్యంలోని ప్రవచనార్థక హెచ్చరికలను లక్ష్యపెడితే, “శాంతిభద్రతలను” గురించిన ఏ కేకా మిమ్మల్ని మోసగించదు.—మార్కు 13:32-37; లూకా 21:34-36.
అధ్యాయం 36
259వ పేజీ, 4వ పేరా చివరి రెండు వాక్యాలు ఇలా ఉండాలి: 1914లో యేసు పరలోకంలో రాజయ్యాడు, అప్పటినుండి ఆయన యెహోవాకు సహరాజుగాను న్యాయాధిపతిగాను భూమిపై అధికారం నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఆయన మహా బబులోను కూలిపోవడాన్ని గురించి ప్రకటించడం యుక్తమే.
260వ పేజీ, 9వ పేరాలోని మొదటి నాలుగు వాక్యాలు ఉన్నచోట ఇలా ఉండాలి: ప్రాచీన బబులోను పట్టణం సా.శ.పూ. 539లో కూలిపోవడమనేది దాని నాశనానికి ముందు అది దీర్ఘకాలంగా క్షీణించడానికి నాంది పలికింది. అలాగే, మొదటి ప్రపంచ యుద్ధంనుండి ప్రపంచవ్యాప్తంగా బబులోనుకు సంబంధించిన మత ప్రభావం గణనీయంగా క్షీణించింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం జపాన్‌లో షింటో చక్రవర్తి ఆరాధన నిషేధించబడింది.
265వ పేజీ, 22వ పేరాలోని చివరి లేఖనాన్ని తొలగించాలి:—మత్తయి 24:15, 16 పోల్చండి.
266వ పేజీ, 28వ పేరా మూడవ నాలుగవ వాక్యాలు ఇలా ఉండాలి: అది చేసినదానికి రెట్టింపు పొందాలి. మహా బబులోను దాని వశంలోవున్న వారిమీద ఎలాంటి కనికరం చూపలేదు కాబట్టి దానికి ఎలాంటి కనికరం చూపించబడదు.
అధ్యాయం 38
277వ పేజీ, 17వ పేరా చివరి రెండు వాక్యాలు ఇలా ఉండాలి: అభిషిక్తులు ఎవరైనా భూమ్మీద ఇంకా సజీవంగా ఉంటే, వారు క్రీస్తు తన విజయాన్ని ముగించిన వెంటనే నిశ్చయంగా తమ పరలోక బహుమానం పొంది, పెండ్లికుమార్తె తరగతిలోని తమ తోటి సభ్యులతో కలుస్తారు. అప్పుడు, దేవుని నిర్ణీత సమయంలో, గొఱ్ఱెపిల్ల వివాహం జరగవచ్చు!
277వ పేజీ, 18వ పేరా మొదటి వాక్యం ఇలా ఉండాలి: ఆ క్రమపద్ధతిని, 45వ కీర్తనలోవున్న ప్రవచనార్థక వృత్తాంతం వివరిస్తుంది.
అధ్యాయం 39
281వ పేజీ, 10వ పేరాలోని చివరి రెండు వాక్యాలు ఉన్నచోట ఇలా ఉండాలి: అంతేగాక, యేసు తన మహిమగల సింహాసనంపై కూర్చొని జనములకు భూమ్మీదున్న ప్రజలకు తీర్పుతీర్చేటప్పుడు “సమస్త దూతలు” ఆయనతోపాటు ఉంటారు. (మత్తయి 25:31, 32) నిశ్చయంగా, తీర్మానపూర్వక యుద్ధంలో దేవుని తీర్పులు పూర్తిగా అమలు జరిగినప్పుడు కూడా దూతలు యేసుతోపాటు ఉంటారు.
అధ్యాయం 41
296వ పేజీ, 5వ పేరా మొదటి మూడు వాక్యాలు ఉన్నచోట ఇలా ఉండాలి: పాత ఆకాశము, పాత భూమి గతించిన తర్వాత తీర్పుకోసం ఎవరు మిగిలివుంటారు? అభిషిక్తులైన 1,44,000 మందిలోని శేషించబడినవారు కాదు, ఎందుకంటే వారప్పటికే తీర్పుతీర్చబడి ముద్రించబడ్డారు. అర్మగిద్దోను తర్వాత అభిషిక్తుల్లో ఇంకా ఎవరైనా భూమ్మీద బ్రదికివుంటే, వారు త్వరలోనే మరణించి పునరుత్థానం ద్వారా పరలోక బహుమానం పొందాలి. (1 పేతురు 4:17; ప్రకటన 7:2-4)
అధ్యాయం 43
311వ పేజీ, 19వ పేరాలోని “ప్రకటన 11:15; 12:10” ఉల్లేఖించబడిన తర్వాత వాక్యాలు ఇలా ఉండాలి: ఈ అంత్యకాలంలో ఆత్మయు, పెండ్లికుమార్తెయు జీవజలములను ఉచితంగా పుచ్చుకొమ్మని సరైన మనోవైఖరిగలవారిని ఆహ్వానిస్తున్నారు. ఈ నదీ జలాలు అలాంటివారికి ఈ విధానాంతం వరకేకాక, ఆ తర్వాత నూతన యెరూషలేము ‘దేవునియొద్దనుండి దిగివచ్చి’నప్పుడు నూతనలోకంలో కూడా నిరంతరం అందుబాటులో ఉంటాయి.—ప్రకటన 21:2.
312వ పేజీ, 26వ పేరా మొదటి రెండు వాక్యాలు ఉన్నచోట ఇలా ఉండాలి: నదీ జలాలు సమృద్ధిగా అందే ఆ వృక్షాల్లో గొఱ్ఱెపిల్ల భార్యగావున్న 1,44,000 మంది సభ్యులు కూడా ఉన్నారు. వీరు కూడా భూమ్మీద ఉన్నప్పుడు జీవంకోసం యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏర్పాటుచేసిన జీవజలాన్ని సేవిస్తారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ ఆత్మజనిత యేసు సహోదరులు ప్రవచనార్థకంగా “నీతి అను మస్తకి వృక్షములు” అని పిలువబడ్డారు. (యెషయా 61:1-3; ప్రకటన 21:6)