ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు సెప్టెంబరులో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? మొదటి సందర్శనంలోనే బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రత్యేకంగా కృషి చేయండి. గృహ బైబిలు అధ్యయనం ప్రారంభించాలనే ఉద్దేశంతో పుస్తకం అందించిన ప్రతీచోట పునర్దర్శనాలు చేయండి. ఈ పుస్తకంతోపాటు మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్ని అందించండి. అక్టోబరులో: కావలికోట, తేజరిల్లు! విడి పత్రికలు ప్రతిపాదించండి. ఆసక్తి చూపించిన చోట, బిలు గురించి మరింత ఆసక్తిని పెంపొందించడానికి అప్రమత్తంగా ఉండండి! బ్రోషుర్ను అందించండి. నవంబరులో: గొప్ప బోధకుని నుండి నేర్చుకోండి (ఆంగ్లం) పుస్తకాన్ని అందజేయండి. గృహస్థుని భాషలో అది అందుబాటులో లేకపోతే మహాగొప్ప మనిషి పుస్తకాన్ని, లేదా నా బైబిలు కథల పుస్తకమును, మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రంతోపాటు ఇవ్వండి. డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని ప్రతిపాదించండి. సంఘంలో స్టాకు ఉన్నట్లయితే ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము, మీరు పరదైసు భూమిపై నిరంతరం జీవించగలరు వంటి పుస్తకాలను ప్రతిపాదించండి.
◼ CD-ROMలో వాచ్టవర్ లైబ్రరీ—2006 ఎడిషన్ (ఆంగ్లం) కొరకు సంఘాలిప్పుడు తమ రిక్వెస్టులను పంపవచ్చు. ఈ వాచ్టవర్ లైబ్రరీ—2006 కేవలం బాప్తిస్మం తీసుకున్న సహోదరులకే లభ్యమవుతుందని, అదీ కేవలం సంఘం ద్వారానే లభ్యమౌతుందని దయచేసి గమనించండి.
◼ క్రొత్త సేవా సంవత్సరానికి సరిపడా వార్షిక సర్వీస్ ఫారాలు అన్ని సంఘాలకు పంపించబడుతున్నాయి. కార్యదర్శులు, పంపించబడిన ఆ ఫారాలు రాబోయే సేవా సంవత్సరానికి సరిపడా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఈ ఫారాల్లో ఏవైనా తక్కువగా ఉన్నట్లయితే, అదనపు ఫారాల కోసం వెంటనే రిక్వెస్టు పంపించవచ్చు.
◼ బహిష్కరించబడిన లేక సహవాసం మానుకున్న వారెవరైనా తిరిగి చేర్చుకోబడేందుకు మొగ్గుచూపుతున్న వారి విషయంలో పెద్దలు కావలికోట ఫిబ్రవరి 1, 1992, 17-19 పేజీల్లోని సూచనల ప్రకారం వ్యవహరించాలని వారికి గుర్తు చేయబడుతోంది.
◼ ట్రస్టు ఏర్పాటున్న సంఘాలు తమ ఆన్యూవల్ జనరల్ మీటింగ్స్ను (ఎజిఎమ్) నిర్ణీత సమయంలోగా నిర్వహించాలని గుర్తుచేయబడుతున్నాయి. ఎజిఎమ్లో, ఇంకా ఇతర ట్రస్టు మీటింగ్లలో చర్చించిన అన్ని విషయాలను తగిన రీతిలో మినిట్స్ పుస్తకంలో వ్రాసిపెట్టాలి. ట్రస్టుకు సంబంధించిన జమాఖర్చులను చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా ఆడిట్ చేయించాలి. ఆడిట్ చేయబడిన ట్రస్టు జమాఖర్చులకు సంబంధించిన కాపీని బ్రాంచి కార్యాలయానికి పంపించాలి.
◼ అమెరికన్ సంజ్ఞా భాషలో క్రొత్తగా లభ్యమవుతున్న డీవీడీలు:
నోవహు, దావీదు
మత్తయి సువార్త
◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:
బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?—గుజరాతీ, పంజాబీ