కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/06 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2006
మన రాజ్య పరిచర్య—2006
km 8/06 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు ఆగస్టులో: ఈ క్రింద ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? జీవిత సంకల్పమేమిటి​—మీరు దానినెలా తెలిసికోగలరు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే, అప్రమత్తంగా ఉండండి! కొన్ని ప్రాంతాల్లో ఈ క్రింద సూచించబడిన బ్రోషుర్లు అందించడం సముచితంగా ఉండవచ్చు: సర్వమానవాళి కొరకైన గ్రంథం, యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం), మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), సంతృప్తికరమైన జీవితం​—దాన్నెలా సాధించవచ్చు? సెప్టెంబరులో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? మొదటి సందర్శనంలోనే బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రత్యేకంగా కృషి చేయండి. గృహ బైబిలు అధ్యయనం ప్రారంభించాలనే ఉద్దేశంతో పుస్తకం అందించిన ప్రతీచోట పునర్దర్శనాలు చేయండి. ఈ పుస్తకంతోపాటు మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్ని అందించండి. అక్టోబరులో: కావలికోట, తేజరిల్లు! విడి పత్రికలు ప్రతిపాదించండి. ఆసక్తి చూపించిన చోట, బిలు గురించి మరింత ఆసక్తిని పెంపొందించడానికి అప్రమత్తంగా ఉండండి! బ్రోషుర్‌ను అందించండి. నవంబరులో: గొప్ప బోధకుని నుండి నేర్చుకోండి (ఆంగ్లం) పుస్తకాన్ని అందజేయండి, గృహస్థుని భాషలో అది అందుబాటులో లేకపోతే మహాగొప్ప మనిషి పుస్తకాన్ని, లేదా నా బైబిలు కథల పుస్తకమును, మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రంతోపాటు ఇవ్వండి.

◼ సంఘ పైవిచారణకర్త లేక ఆయన నియమించిన వ్యక్తి సెప్టెంబరు 1వ తారీఖున లేదా ఆ తర్వాత వీలైనంత త్వరగా సంఘ అకౌంట్స్‌ను ఆడిట్‌ చేయాలి. నిర్వహణ లేదా నిర్మాణ ఏర్పాట్లకు సంబంధించి మరో బ్యాంక్‌ ఖాతా ఉంటే, ఆ అక్కౌంటును కూడా ఆడిట్‌ చేయాలి. ఆడిట్‌(లు) పూర్తవగానే తరువాతి అకౌంట్సు రిపోర్టుతో పాటు దానిని లేదా వాటిని సంఘంలో చదవాలి.

◼ జనవరి 8, 2007తో ప్రారంభమయ్యే వారం నుండి మనం సంఘ పుస్తక అధ్యయనంలో ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకాన్ని అధ్యయనం చేస్తాం. పుస్తక అధ్యయనం ప్రారంభమయ్యేలోపే సంఘాల్లో సరిపడా పుస్తకాలు ఉండాలి.

◼ స్టాకులో ఉన్న పత్రికలతో సహా సాహిత్యాలన్నింటి వార్షిక ఇన్వెంటరీ ఆగస్టు 31, 2006న లేదా ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా తీసుకోవాలి. ప్రతీనెల లిటరేచర్‌ కో-ఆర్డినేటర్‌ లెక్కించే విధంగానే ఈ ఇన్వెంటరీ చేయాలి, అలా లెక్కించిన స్టాకు వివరాలను లిటరేచర్‌ ఇన్వెంటరీ (S-18) ఫారంలో ఎక్కించాలి. స్టాకులో ఉన్న పత్రికల మొత్తం సంఖ్యను పత్రికా సేవకుని(ల) నుండి పొందవచ్చు. ఈ ఇన్వెంటరీని కో-ఆర్డినేటింగ్‌ సంఘ కార్యదర్శి పర్యవేక్షించాలి. ఆయనతోపాటు కో-ఆర్డినేటింగ్‌ సంఘ పైవిచారణకర్త కూడా ఆ ఫారం మీద సంతకాలు చేస్తారు. ప్రతి కో-ఆర్డినేటింగ్‌ సంఘం మూడు లిటరేచర్‌ ఇన్వెంటరీ (S-18) ఫారాలు అందుకుంటాయి. దయచేసి ఒరిజినల్‌ కాపీని బ్రాంచి కార్యాలయానికి సెప్టెంబరు 6వ తేదీకి ముందే పంపించండి. మీ ఫైళ్ళ కోసం ఒక కాపీ ఉంచుకోండి. మూడవ కాపీని చిత్తు ప్రతిగా ఉపయోగించుకోవచ్చు.

◼ మళ్ళీ లభ్యమవుతున్న ప్రచురణలు:

పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము ​—⁠ఆంగ్లం

ఇది స్టాండార్డ్‌ సైజులో ఉన్న సాఫ్ట్‌ కవర్‌ ఎడిషన్‌. దీన్ని ప్రాథమికంగా పరిచర్యలో అందించడానికే ముద్రించబడుతున్నా, ప్రచారకులు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేకించి పేర్కొనకపోతే ఇప్పటినుండి రెగ్యులర్‌ బైబిల్‌ ఎడిషన్‌ కోసం చేసే రిక్వెస్ట్‌లన్నిటికీ ఈ సాఫ్ట్‌ కవర్‌ ఎడిషన్లే పంపించబడతాయి. మరిన్ని వివరాల కోసం ఆగస్టు 1, 2005 తేదీ ఉత్తరం చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి