దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, 2006 ఆగస్టు 28వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు మౌఖికంగా పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2006 జూలై 3 నుండి ఆగస్టు 28 మధ్య వారాల్లోని నియామకాల సమాచారంపై 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేకపోతే, మీరే స్వయంగా పరిశోధించి జవాబులను తెలుసుకోవాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]
ప్రసంగ లక్షణాలు
1. కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడడం మనం మరింత సమర్థవంతమైన బోధకులమయ్యేందుకు ఎలా సహాయం చేస్తుంది? (మత్త. 19:25, .26; అపొ. 14:9, 10) [be 124వ పేజీ, 3వ పేరా-125వ పేజీ, 3వ పేరా]
2. సహజత్వం ఎందుకు ప్రాముఖ్యం, క్షేత్ర పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు సహజంగా మాట్లాడేందుకు మనకు ఏది సహాయం చేస్తుంది? [be 128వ పేజీ, 1-5 పేరాలు, బాక్సు]
3. వ్యక్తిగత శుభ్రత విషయంలో మనమెందుకు శ్రద్ధవహించాలి? [be 131వ పేజీ, 1-3 పేరాలు]
4. ‘అణుకువ, స్వస్థబుద్ధి’ మన వస్త్రధారణను, కేశాలంకరణను ఎలా ప్రభావితం చేయాలి? (1 తిమో. 2:9, 10) [be 131వ పేజీ, 4వ పేరా-132వ పేజీ, 1వ పేరా]
5. మనం కనబడే తీరు లోకం మీద ప్రేమను ప్రతిబింబించకుండా ఉండడానికి మనం ఏ బైబిలు సూత్రాలను అన్వయించుకోవాలి? [be 133వ పేజీ, 2, 3 పేరాలు]
ఒకటవ నియామకం
6. చదవడం వల్ల మీకు చేకూరే అత్యంత గొప్ప ప్రయోజనం ఏమిటి? [be 21వ పేజీ, 3వ పేరా]
7. ఒక వ్యక్తి జ్ఞానవంతుడా లేక మూఢుడా అనే విషయాన్ని ఏది నిర్ణయిస్తుంది? (సామె. 14:2) [w04 11/15 26వ పేజీ, 5వ పేరా]
8. తెలివిగల వ్యక్తికి ఎందుకు “జ్ఞానము సులభము?” (సామె. 14:6) [w04 11/15 28వ పేజీ, 4-5 పేరాలు]
9. అధ్యయనం అంటే ఏమిటి? [be 27వ పేజీ, 3వ పేరా]
10. యెహోవా సృష్టికార్యాల గురించి ధ్యానించడం మనపై ఎలాంటి ప్రభావం చూపించాలి? [w04 11/15 8వ పేజీ, 4వ పేరా]
వారపు బైబిలు పఠనం
11. ప్రాచీన కాలాల్లో సువార్త “ప్రకటించు స్త్రీలు” గొప్ప సైన్యంగా పరిణమించేలా యెహోవా ఎలా ‘మాట సెలవిచ్చాడు,’ ఇది నేడు స్త్రీలకు ఎలా అన్వయిస్తుంది? (కీర్త. 68:11)
12. ఆసాపు సరైంది చేయడాన్ని దాదాపు మానేసేంతగా ఏ విషయం ప్రభావితం చేసింది, ఆయన ఆలోచనా సరళి ఎలా సరిచేయబడింది? (కీర్త. 73:2, 3, 17)
13. ఇశ్రాయేలీయులకు అందించబడిన మన్నా “ఆకాశధాన్యము,” “దేవదూతల ఆహారము” అని ఎందుకు పిలువబడింది? (కీర్త. 78:24, 25)
14. “మహోన్నతుని చాటు” అంటే ఏమిటి, అక్కడ మనమెలా ‘నివసించవచ్చు’? (కీర్త. 91:1, 2)
15. యెహోవాపట్ల యథార్థంగా ఉన్నవారి మరణము ఏ విధంగా ఆయన దృష్టికి విలువైనది? (కీర్త. 116:15)