సేవా కూటాల పట్టిక
జూలై 10తో ప్రారంభమయ్యే వారం
పాట 2 (15)
10 నిమి:స్థానిక ప్రకటనలు. 4వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ, జూలై 15 కావలికోటను, జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ఒక ప్రదర్శనలో, “మేము కూడా క్రైస్తవులమే” అని చెప్పి సంభాషణను ఆటంకపర్చే వ్యక్తితో ఎలా మాట్లాడాలో చూపించండి.—బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకంలో 11వ పేజీ చూడండి.
15 నిమి:సంఘం సంస్థీకరించబడి నిర్దేశించబడుతున్న విధానం. యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని నాల్గవ అధ్యాయం ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ.
20 నిమి:“యెహోవా సాటిలేని లక్షణాలపట్ల కృతజ్ఞతను పెంపొందించండి.”a బిలు బోధిస్తోంది పుస్తకంలోని మొదటి అధ్యాయం చివర్లోవున్న పునఃసమీక్షా బాక్సులోని అంశాలపై ధ్యానించడానికి బైబిలు విద్యార్థికి సహాయం చేసేందుకు ప్రశ్నలను ఎలా ఉపయోగించాలో చూపించే ఒక ప్రదర్శనను చేర్చండి.
పాట 6 (45) ముగింపు ప్రార్థన.
జూలై 17తో ప్రారంభమయ్యే వారం
పాట 8 (53)
10 నిమి:స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. కావలికోట, ఆగస్టు 15, 2000, 32వ పేజీని క్లుప్తంగా చర్చించండి. సెలవుల్లో లేదా మన రోజువారీ పనులు లేనప్పుడు కూడా ప్రతీరోజు బైబిలు చదివే కార్యక్రమాన్ని క్రమంగా పాటించడంవల్ల వచ్చే ప్రయోజనాలను నొక్కిచెప్పండి.
15 నిమి:ప్రేమ, నమ్రత పరిచర్యకు కావాల్సిన చాలా ప్రాముఖ్యమైన లక్షణాలు. కావలికోట, ఆగస్టు 15, 2002, 18-20 పేజీలు, 13-20 పేరాల ఆధారంగా ప్రసంగం.
20 నిమి:“‘సంతోషంగా ఉండే మన దేవుడైన’ యెహోవాను అనుకరించండి.”b స్థానిక క్షేత్రంలో ప్రకటిస్తున్నప్పుడు సంతోషభరిత, అనుకూల దృక్పథాన్ని కాపాడుకోవడానికి తమకు ఏమి సహాయం చేస్తుందో వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.
పాట 4 (43), ముగింపు ప్రార్థన.
జూలై 24తో ప్రారంభమయ్యే వారం
పాట 29 (222)
15 నిమి:స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. 4వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ ఆగస్టు 1 కావలికోట, జూలై-సెప్టెంబరు తేజరిల్లు! పత్రికలను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ప్రతీ ప్రదర్శన ముగిసిన తర్వాత గృహస్థుని ఆసక్తిని రేకెత్తించడానికి ఉపయోగించిన ప్రారంభ వ్యాఖ్యానాలను మళ్ళీ చెప్పండి.
10 నిమి:“విశ్వసనీయంగా ఉండడంలో వారు మంచి మాదిరిని ఉంచారు.” మన ప్రచురణల్లో ప్రచురించబడిన ప్రత్యేక పయినీర్ల కొన్ని అనుభవాలు లేదా సంఘంలో సేవచేస్తున్న స్థానిక పయినీర్ల ఇంటర్వ్యూలున్న ప్రసంగం.—వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్‌లో “స్పెషల్ పయినీర్స్” అనే శీర్షిక క్రింద చూడండి.
20 నిమి:స్థిరులుగా కదలనివారుగా ఉండండి. (1 కొరిం. 15:58) చాలా సంవత్సరాలు నమ్మకంగా సేవచేసిన ఇద్దరు ముగ్గురు ప్రచారకులను లేదా పయినీర్లను ఇంటర్వ్యూ చేయండి. వారు సత్యం ఎలా నేర్చుకున్నారు? వారు ప్రకటించడం ప్రారంభించినప్పుడు ప్రకటనా పని ఎలా కొనసాగింది? వారు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు? సత్యారాధనకు స్థిరంగా అంటిపెట్టుకొని ఉండడంవల్ల వారెలాంటి ఆశీర్వాదాలను అనుభవించారు?
పాట 9 (37), ముగింపు ప్రార్థన.
జూలై 31తో ప్రారంభమయ్యే వారం
పాట 20 (93)
10 నిమి:స్థానిక ప్రకటనలు. జూలై నెల క్షేత్ర సేవా రిపోర్టులను ఇవ్వమని ప్రచారకులకు గుర్తు చేయండి. ఆగస్టులో అందించే ప్రచురణలను పేర్కొనండి.
15 నిమి:స్థానిక అవసరాలు.
20 నిమి:“ఆధ్యాత్మిక అలవాట్లను పెంపొందించుకోండి, విస్తారమైన ఆశీర్వాదాలను పొందండి”c మంచి ఆధ్యాత్మిక దినచర్యను ఏర్పరచుకొని దాన్ని పాటించడానికి తాము ఎలాంటి ప్రయత్నాలు చేశారో, వాటి ఫలితంగా తాము పొందిన ఆశీర్వాదాలు ఏమిటో వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.
పాట 22 (130), ముగింపు ప్రార్థన.
ఆగస్టు 7తో ప్రారంభమయ్యే వారం
పాట 4 (43)
10 నిమి:స్థానిక అవసరాలు. మన రాజ్య పరిచర్యలో వచ్చే మాదిరి ప్రతిపాదనలను స్థానిక క్షేత్ర అవసరాలకు తగ్గట్టు ఎలా మలచుకోవచ్చో క్లుప్తంగా సమీక్షించండి.—మన రాజ్య పరిచర్య, జనవరి 2005, 8వ పేజీ చూడండి.
15 నిమి:ప్రేమచూపడానికి, సత్కార్యములు చేయడానికి పురికొల్పునిచ్చే కూటాలు. కావలికోట, మార్చి 15, 2002, 24-5 పేజీల ఆధారంగా ప్రసంగం. కూటాలకు క్రమంగా హాజరవ్వడానికి ప్రచారకుడు(రాలు) ఎలాంటి ప్రయత్నాలు చేశారో, అలా చేయడంవల్ల అతడు (ఆమె) ఎలా ప్రయోజనం పొందారో నొక్కిచెప్పే క్లుప్తమైన ఇంటర్వ్యూను చేర్చండి.
20 నిమి:మన పరిచర్యలో పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించే ప్రగతిశీల పరిచారకులుగా ఉండండి. కావలికోట, డిసెంబరు 1, 2005, 28-30 పేజీల ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. 6-11 పేరాల ఆధారంగా ఉన్న ప్రసంగంలో, పౌలు ప్రకటించడంలో, బోధించడంలో ఏ విధంగా శ్రద్ధగలవాడిగా, పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించేవాడిగా, ప్రజ్ఞావంతుడిగా ఉన్నాడో నొక్కి చెప్పండి. స్థానికంగా అన్వర్తింపజేస్తూ, 12-14 పేరాల ప్రశ్నలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి. స్థానిక క్షేత్రంలోని ప్రజల అవసరాలను, పరిస్థితులను, సాంస్కృతిక నేపథ్యాలను పరిగణలోకి తీసుకుంటూ ప్రచారకులు తమ పరిచర్యలో పరిస్థితికి తగ్గట్టుగా ఎలా తమ ప్రతిపాదనను మార్చుకోవచ్చో చూపించే ప్రదర్శనను చేర్చండి.
పాట 17 (187), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.