కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/06 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2006
  • ఉపశీర్షికలు
  • మే 8తో ప్రారంభమయ్యే వారం
  • మే 15తో ప్రారంభమయ్యే వారం
  • మే 22తో ప్రారంభమయ్యే వారం
  • మే 29తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 5తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2006
km 5/06 పేజీ 2

సేవా కూటాల పట్టిక

మే 8తో ప్రారంభమయ్యే వారం

పాట 7 (51)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 4వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగించి, మే 15 కావలికోటను, ఏప్రిల్‌-జూన్‌ తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ఏదో ఒక కారణాన్నిబట్టి మే 1 కావలికోట లభించని పత్రికా మార్గంలో ఉన్న ఒక వ్యక్తికి ప్రచారకుడు మే 1, మే 15 కావలికోటలు, ఏప్రిల్‌-జూన్‌ తేజరిల్లు! అందించడాన్ని ఒక ప్రదర్శనలో చూపించండి. మూడు పత్రికలు అందిస్తున్నప్పుడు, కేవలం ఒక పత్రికపైనే దృష్టి కేంద్రీకరించండి. ప్రచారకులు, పత్రికా మార్గంలో ఉన్న వ్యక్తుల్ని నెలకు ఒకసారి లేదా రెండుసార్లు సందర్శించవచ్చు.

20 నిమి: “‘నన్ను వెంబడించడంలో కొనసాగాలి’”a రాజ్యానికి సంబంధించిన విషయాల పురోభివృద్ధిలో, ఇతరులను సేవించడంలో మరింత ఎక్కువ చేయడానికి తన జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకునేందుకు, వ్యక్తిగత లక్ష్యాలను పరిమితంగా ఉంచుకునేందుకు కృషి చేస్తున్న, మాదిరికరంగా ఉన్న ఒక ప్రచారకుణ్ణి సంక్షిప్తంగా ఇంటర్వ్యూ చేయండి. అలా కృషి చేయడంవల్ల ఆయనకు లభించిన ఆశీర్వాదాలను నొక్కిచెప్పండి.

15 నిమి: స్థానిక అనుభవాలు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పరిచర్యలో ఎక్కువగా పాల్గొనడానికి కృషి చేసినప్పుడు వారికి లభించిన ఆశీర్వాదాలు లేదా మంచి ఫలితాల గురించి వ్యాఖ్యానించమని ప్రేక్షకుల్ని అడగండి. బైబిలు అధ్యయనాలు ప్రారంభించడంలో, క్రొత్తవారు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవడానికి సహాయం చేయడంలో సాధించబడిన ఫలితాలను నొక్కిచెప్పండి. ఒకటి లేదా రెండు అసాధారణ అనుభవాల్ని పునర్నటింపజేయవచ్చు.

పాట 21 (191) ముగింపు ప్రార్థన.

మే 15తో ప్రారంభమయ్యే వారం

పాట 22 (130)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మే 29తో ప్రారంభమయ్యే వారంలోని సేవా కూటానికి సిద్ధపడేందుకు, ప్రతీ ఒక్కరిని నోవహు—ఆయన దేవునితోకూడ నడిచాడు (ఆంగ్లం) అనే వీడియోను చూడమని ప్రోత్సహించండి.

10 నిమి: క్రీస్తు నాయకత్వం క్రింద ఐకమత్యంతో పని చేయడం. యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం అనే పుస్తకంలోని 13-15 పేజీల్లో ఉన్న “ఆయన పాత్రను గుర్తించడమంటే ఏమిటి?” అనే ఉపశీర్షిక క్రింద ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వబడే ప్రసంగం.

25 నిమి: “రాజ్యమందిర నిర్మాణం​—పరిశుద్ధసేవలో ఒక ప్రాముఖ్యమైన అంశం.”b 2వ పేరా చర్చిస్తున్నప్పుడు, అప్లికేషన్‌ ఫర్‌ కింగ్‌డమ్‌హాల్‌ కన్‌స్ట్రక్షన్‌ వాలంటీర్‌ ప్రోగ్రామ్‌ (A-25) ఫారమ్‌ చూపించి, దాని ప్రతులు ఎలా పొందవచ్చో వివరించండి. రాజ్యమందిరాల నిర్మాణంలో, పునర్నవీకరణలో పాల్గొన్న కొందరిని ఇంటర్వ్యూ చేయండి.

పాట 3 (32), ముగింపు ప్రార్థన.

మే 22తో ప్రారంభమయ్యే వారం

పాట 23 (200)

12 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. 4వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ జూన్‌ 1 కావలికోటను, ఏప్రిల్‌-జూన్‌ తేజరిల్లు! పత్రికలను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ఒక కుటుంబం పరిచర్యకోసం అభ్యాసం చేస్తున్న సన్నివేశంలో వాటిని ప్రదర్శింపజేయండి.

15 నిమి: “దయతో వ్యవహరించడంద్వారా​—వ్యక్తిగత ఆసక్తి చూపించండి.”c

18 నిమి: హుందాగా కనబడే తీరు. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 131-3 పేజీల ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. మన దుస్తులకు, కనబడే తీరుకు సంబంధించి అక్కడ పట్టికవేయబడిన ఐదు సూత్రాలను పరిశీలించండి. సంఘకూటాలకు తగిన రీతిలో ఎలా తయారై రావాలో మన బైబిలు విద్యార్థులు అర్థం చేసుకోవడానికి సహాయం చేసేందుకు అందులోని సమాచారాన్ని నేర్పుతో ఉపయోగించవచ్చని పేర్కొనండి.

పాట 11 (85), ముగింపు ప్రార్థన.

మే 29తో ప్రారంభమయ్యే వారం

పాట 25 (204)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మే నెల క్షేత్ర సేవా రిపోర్టులను ఇవ్వమని ప్రచారకులకు గుర్తు చేయండి.

10 నిమి: జూన్‌లో మహాగొప్ప మనిషి పుస్తకాన్ని ప్రతిపాదించండి. డిసెంబరు 1994, మన రాజ్య పరిచర్యలోని 8వ పేజీలో ఉన్న సూచనలను ఉపయోగించి లేదా మీ క్షేత్రానికి అనువైన వేరే ప్రతిపాదనలు ఉపయోగించి జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని ఎలా అందించాలో ప్రదర్శించండి. సమయం అనుమతిస్తే, ఈ సాహిత్యాన్ని పరిచర్యలో లేదా తమ కుటుంబంలో ఉపయోగించడం ద్వారా లభించిన మంచి ఫలితాల గురించి వ్యాఖ్యానించమని ప్రేక్షకుల్ని ఆహ్వానించండి.

25 నిమి: “అన్ని వయసులవారూ అనుకరించదగ్గ మాదిరి.” ఒక నిమిషంకన్నా తక్కువ సమయంలో ఇచ్చే ఉపోద్ఘాతం తర్వాత, రెండవ పేరాలో ఇవ్వబడిన ప్రశ్నలన్నింటినీ ఉపయోగిస్తూ నోవహు వీడియో సంబంధించిన ప్రశ్నల చర్చను ప్రారంభించండి. డీవీడీలో సూచించబడిన “లెర్నింగ్‌ యాక్టివిటీస్‌”లో పాల్గొనడం ద్వారా కుటుంబాలు ఎలా ప్రయోజనం పొందాయో అడగండి. ఆ తర్వాత మూడవ పేరాలోని ప్రశ్నను, లేఖనాలను చర్చించండి.

పాట 22 (130), ముగింపు ప్రార్థన.

జూన్‌ 5తో ప్రారంభమయ్యే వారం

పాట 8 (53)

10 నిమి: స్థానిక ప్రకటనలు

15 నిమి: స్థానిక అవసరాలు.

20 నిమి: పునర్దర్శనాలు చేయడంలో ఎలా విజయం సాధించవచ్చు. కావలికోట, నవంబరు 15 2003, 16వ పేజీలో ఉన్న బాక్సు ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. అక్కడున్న ఏడు సూచనల్లో ప్రతీదాన్ని పరిశీలించండి, వాటిని స్థానికంగా ఎలా అన్వయించవచ్చో వ్యాఖ్యానించమని ప్రేక్షకులను అడగండి. సాహిత్యాలు తీసుకున్న, లేదా ఆసక్తి చూపించిన వారందరితో బైబిలు అధ్యయనాలు ప్రారంభించే ధ్యేయంతో పునర్దర్శనాలు చేయమని ప్రచారకుల్ని ప్రోత్సహించండి. మన రాజ్య పరిచర్య జనవరి 2006, 6వ పేజీలోని సూచనల్లో ఒకదాన్ని ఉపయోగించి, పునర్దర్శనం చేస్తున్నప్పుడు బైబిలు అధ్యయనాన్ని ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి.

పాట 9 (37), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి