కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/06 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2006
  • ఉపశీర్షికలు
  • ఏప్రిల్‌ 10తో ప్రారంభమయ్యే వారం
  • ఏప్రిల్‌ 17తో ప్రారంభమయ్యే వారం
  • ఏప్రిల్‌ 24తో ప్రారంభమయ్యే వారం
  • మే 1తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2006
km 4/06 పేజీ 2

సేవా కూటాల పట్టిక

గమనిక: రాబోయే నెలల్లో ప్రతీవారం కోసం, మన రాజ్య పరిచర్యలో ఒక సేవా కూటం పట్టిక వేయబడుతుంది. “విడుదల సమీపించింది!” అనే జిల్లా సమావేశానికి హాజరయ్యేందుకు వీలుగా సంఘాలు తగిన మార్పులు చేసుకోవచ్చు. సముచితమైన చోట, జిల్లా సమావేశానికి హాజరవడానికి ముందు జరిగే చివరి సేవా కూటంలో, ఈ నెల ప్రతిలోని మధ్యపేజీల్లో నుండి స్థానికంగా అన్వయించే సలహాలను, జ్ఞాపికలను మరోసారి గుర్తుచేయడానికి 15 నిమిషాలను వెచ్చించండి. సమావేశం ముగిసిన ఒకటి లేదా రెండు నెలల తర్వాత ఒక సేవా కూటంలో (బహుశా స్థానిక అవసరాలు భాగాన్ని నిర్వహించే బదులు) సమావేశ ముఖ్యాంశాలను సమీక్షించడానికి 15 నుండి 20 నిమిషాలను కేటాయించండి. అది సమావేశ కార్యక్రమమంతటినీ సమీక్షిస్తున్నట్లుగా ఉండకూడదు. దానికి బదులు నేరుగా క్షేత్రసేవతో సంబంధమున్న భాగాలను మాత్రమే నొక్కిచెప్పండి. ఆ సమాచారాన్ని ప్రచారకులు తమ పరిచర్యలో ఎలా అన్వయించుకుంటున్నారో తెలపమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

ఏప్రిల్‌ 10తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (45)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 8వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగించి, ఏప్రిల్‌ 15 కావలికోటను, ఏప్రిల్‌-జూన్‌ తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. బైబిలు సందేశంపై అమితాసక్తి కనబరిచిన గృహస్థునికి ప్రచారకుడు బైబిలు బోధిస్తోంది పుస్తకం అందించడాన్ని ఒక ప్రదర్శనలో చూపించండి.

15 నిమి: “ఉత్సాహాన్ని కాపాడుకొనే విధానం.”a కావలికోట జూన్‌ 15, 2002 14వ పేజీ, 13వ పేరాపై ఆధారితమైన వ్యాఖ్యానాలను చేర్చండి.

20 నిమి: “ప్రకటించేందుకు వీలుగా మీరు మీ సమయ పట్టికను మార్చుకోగలరా?”b సమాచారం స్థానికంగా ఎలా అన్వయిస్తుందో వివరించండి. సాయంత్రవేళల్లో చేసే సాక్ష్యపు పనికి సంఘం చేసిన ఏర్పాట్లను పేర్కొనండి.

పాట 1 (13), ముగింపు ప్రార్థన.

ఏప్రిల్‌ 17తో ప్రారంభమయ్యే వారం

పాట 8 (53)

15 నిమి: స్థానిక ప్రకటనలు. ప్రత్యేక బహిరంగ ప్రసంగం కొరకు స్థానికంగా చేసిన ఏర్పాట్ల గురించి నొక్కిచెప్పండి. బైబిలు విద్యార్థులను, ఆసక్తిగల ఇతరులను, జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవారిని ఆ ప్రసంగానికి ఆహ్వానించడానికి కావలికోట ఏప్రిల్‌ 1 సంచికలోని, 32వ పేజీని ఉపయోగించడంలో కొనసాగమని ప్రతీ ఒక్కరిని ప్రోత్సహించండి. ప్రజలను ప్రత్యేక బహిరంగ ప్రసంగానికి ఆహ్వానించడానికి కావలికోటను ఉపయోగించడంలో ఎదురైన రెండు లేదా మూడు అనుభవాలను సంక్షిప్తంగా చెప్పండి.

12 నిమి: స్థానిక అవసరాలు.

18 నిమి: “ఇంటిగమ్మం దగ్గర, టెలిఫోన్‌లో ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించండి.”c ఇంటిగుమ్మం దగ్గర చేసే అధ్యయనాన్ని ఇంట్లో చేసే అధ్యయనంగా మార్చేందుకు ప్రచారకుడు ఏమి చెప్పవచ్చో చూపే ఒక సంక్షిప్త ప్రదర్శనను చేర్చండి.

పాట 18 (162), ముగింపు ప్రార్థన.

ఏప్రిల్‌ 24తో ప్రారంభమయ్యే వారం

పాట 9 (37)

15 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. మే నెలలో మనం మళ్లీ కావలికోట, తేజరిల్లు! పత్రికలనే అందిస్తున్నాం. 8వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ మే 1 కావలికోటను, ఏప్రిల్‌-జూన్‌ తేజరిల్లు! పత్రికలను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ప్రదర్శనల తర్వాత, మీ క్షేత్రంలో ప్రజలను ఆకట్టుకొనే ఆ పత్రికల్లోని ఇతర ఆర్టికల్స్‌వైపు అవధానాన్ని మళ్ళించండి.

30 నిమి: “యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండండి.”d సంఘ కార్యదర్శి నిర్వహించాలి. సంఘం నియమించబడిన సమావేశాన్ని పేర్కొనండి. సమావేశం జరిగే నగరంలో అన్ని సందర్భాల్లోనూ బ్యాడ్జి కార్డును ధరించడంవల్ల సాక్ష్యమిచ్చేందుకు అవకాశాలు ఎలా లభిస్తాయో వ్యాఖ్యానించమని ప్రేక్షకులను అడగండి. అనియత సాక్ష్యమిచ్చేందుకు దొరికే అవకాశాలను సద్వినియోగం చేసుకోమని ప్రేక్షకులను ప్రోత్సహించండి. ఆసక్తిగలవారిని కలిసినప్పుడు దానిని గురించి తెలియజేయడానికి ప్లీజ్‌ ఫాలో అప్‌ (S-43) ఫారమ్‌ను ఉపయోగించమని కూడా ప్రోత్సహించండి.

పాట 21 (191), ముగింపు ప్రార్థన.

మే 1తో ప్రారంభమయ్యే వారం

పాట 22 (130)

5 నిమి: స్థానిక ప్రకటనలు. ఏప్రిల్‌ క్షేత్ర సేవా రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి. 6వ పేజీలో ఉన్న “ఆసక్తిగల వ్యక్తుల గురించి అడిగి తెలుసుకుంటున్నారా?” అనే బాక్సును చర్చించండి.

10 నిమి: “ముఖకవళికలను గమనించడం ద్వారా​—⁠వ్యక్తిగత ఆసక్తి చూపించండి.”e ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో ప్రచారకుడు ఒక వ్యక్తితో చూపులు కలిపి, సంభాషణ మొదలుపెట్టి, సాక్ష్యమిస్తున్నట్లు చూపించే సంక్షిప్త ప్రదర్శనను చేర్చండి.

15 నిమి: యెహోవా కార్యాల గురించి ధ్యానించండి. (కీర్త. 77:12) మార్చి 2006, మన రాజ్య పరిచర్యలోని మధ్యపేజీ ఉపయోగిస్తూ ఇచ్చే ప్రసంగం, సభికులతో చర్చ. పరిపాలక సభ వ్రాసిన ఉత్తరంలోని ప్రోత్సాహకరమైన అంశాలను చర్చించండి.

15 నిమి: “‘విడుదల సమీపించింది!’ అనే జిల్లా సమావేశం గురించి తెలియజేసేందుకు ప్రపంచవ్యాప్త ప్రచార కార్యక్రమం.”f పేరాలన్నీ చదవబడేలా చూడండి.

పాట 10 (82), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

e ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

f ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి