కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/06 పేజీ 7
  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల
  • మన రాజ్య పరిచర్య—2006
మన రాజ్య పరిచర్య—2006
km 4/06 పేజీ 7

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల

పునఃసమీక్ష దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, 2006 ఏప్రిల్‌ 4వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు మౌఖికంగా పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2006 మార్చి 6 నుండి ఏప్రిల్‌ 24 మధ్య వారాల్లోని నియామకాల సమాచారంపై 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేకపోతే, మీరే స్వయంగా పరిశోధించి జవాబులను తెలుసుకోవాలి.​—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]

ప్రసంగ లక్షణాలు

1. బోధించేటప్పుడు ఒక తలంపు నుండి మరొక తలంపుకు వెళ్లేటప్పుడు కాస్సేపు ఎందుకు ఆగాలి, అయితే అలా చేయకుండా ఏది మనల్ని అడ్డగించవచ్చు? [be 98వ పేజీ 2-3 పేరాలు]

2. ఇతరులకు సాక్ష్యమిచ్చేటప్పుడు కాస్సేపు ఆగడం ఎందుకు ప్రాముఖ్యం? [be 99వ పేజీ 5వ పేరా నుండి 100వ పేజీ 4వ పేరా వరకు]

3. ప్రసంగమిచ్చేటప్పుడు భావాన్ని నొక్కిచెప్పడం ఎందుకు ప్రాముఖ్యం, చక్కగా నొక్కిచెప్పడాన్ని మనమెలా అలవరచుకోవచ్చు? [be 101వ పేజీ 1-5 పేరాలు, బాక్సు]

4. బహిరంగముగా చదివేటప్పుడు, మన సమాచారంలోని ప్రధాన తలంపులు నొక్కిచెప్పబడ్డాయని మనమెలా నిశ్చయపరచుకోవచ్చు? [be 105వ పేజీ 1-6 పేరాలు]

5. బోధించేటప్పుడు సముచితమైన స్వరం ఎందుకు ప్రాముఖ్యం, ఎంత బిగ్గరగా మాట్లాడాలో మనమెలా నిర్ణయించుకోవచ్చు? [be 107-108 పేజీలు]

ఒకటవ నియామకం

6. నేటి క్రైస్తవుల పరిస్థితి ఏ విధంగా ఎస్తేరు, మొర్దెకైల పరిస్థితిలాగే ఉంది, వారి మాదిరిని మనమెలా అనుకరించవచ్చు? [bsi 11వ పేజీ, 17వ పేరా]

7. ‘అన్నియూ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను’ ఉన్నాయని సొలొమోను అన్నప్పుడు, ఆయన దేనిని వర్ణిస్తున్నాడు? (ప్రసం. 2:11) [w04 10/15 4వ పేజీ 3-4 పేరాలు]

8. దేవునిపట్ల మనం ప్రేమను ఎలా పెంపొందించుకోవచ్చు? (మార్కు 12:30) [w04 3/1 19-21 పేజీలు]

9. ఆధ్యాత్మిక విలువలకు, ఐశ్వర్యాసక్తికి మధ్య ఎలాంటి వైరుధ్యాలను చూడవచ్చు? [w04 10/15 5-7 పేజీలు]

10. సమావేశాల్లో ఏకాగ్రతతో వినేందుకు మనకేది సహాయం చేయగలదు? [be 15-16 పేజీలు]

వారపు బైబిలు పఠనం

11. హామాను ముఖానికి ముసుకు ఎందుకు వేయబడింది? (ఎస్తేరు 7:⁠8)

12. ఏ విధమైన శ్వాసము లేదా ఆత్మప్రాణి ఎలీఫజు ఆలోచనను ప్రభావితం చేసింది? (యోబు 4:15, 16) [w05 9/15 26వ పేజీ, 2వ పేరా]

13. యోబు 7:9, 10 మరియు యోబు 10:⁠20, 21 వచనాల్లో వ్రాయబడిన యోబు మాటలు ఆయన పునరుత్థానాన్ని నమ్మలేదని సూచిస్తున్నాయా?

14. “దంతముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలింపబడి యున్నది” అన్నప్పుడు యోబు మాటల భావమేమిటి? (యోబు 19:20)

15. “నేనెంతమాత్రమును యథార్థతను విడువను” అన్నప్పుడు యోబు భావమేమిటి, దీనినుండి మనమేమి నేర్చుకోవచ్చు? (యోబు 27:5)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి