ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు ఏప్రిల్, మేలలో: కావలికోట, తేజరిల్లు! విడి పత్రికలు అందించండి. ఆసక్తిగలవారిని పునర్దర్శించేటప్పుడు లేదా జ్ఞాపకార్థ ఆచరణకు లేదా సంఘంలోని ఇతర ప్రత్యేక సంఘటనలకు హాజరవుతూ సంఘంతో మాత్రం క్రియాశీలంగా సహవసించని వారిని సందర్శిస్తున్నప్పుడు, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది అనే క్రొత్త పుస్తకాన్ని ప్రతిపాదించడంపై దృష్టి నిలపండి. వారితో బైబిలు అధ్యయనం ఆరంభించే లక్ష్యంతో ఆ పుస్తకాన్ని ప్రతిపాదించండి. జూన్: గొప్ప బోధకుడి నుంచి నేర్చుకోండి (ఆంగ్లం) పుస్తకం అందించండి. ఈ ప్రచురణ గృహస్థుని భాషలో అందుబాటులో లేకపోతే, జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషి లేదా నా బైబిలు కథల పుస్తకము అందించండి. జూలై, ఆగస్టులలో: ఈ క్రింద ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే, అప్రమత్తంగా ఉండండి! కొన్ని ప్రాంతాల్లో ఈ క్రింద సూచించబడిన బ్రోషుర్లు అందించడానికి సముచితంగా ఉండవచ్చు: సర్వమానవాళి కొరకైన గ్రంథం, యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం), మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా?అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు?
◼ ఏప్రిల్ నెల మొదలుకొని మీరు రిక్వెస్టు చేయకుండానే మీ సంఘ ప్రాథమిక భాషలో 2006 జిల్లా సమావేశ బ్యాడ్జి కార్డులు మీ సాహిత్యాలతోపాటు పంపించబడతాయి. సంఘ ప్రచారకుల సంఖ్యబట్టి, 25 కార్డులుండే కట్టలు పంపించబడతాయి. మీ సంఘ ప్రాథమిక భాష కాకుండా వేరే భాషలో అవసరమైతే తప్ప మీరు వాటికోసం రిక్వెస్టు చేయాల్సిన అవసరం లేదు. మీ సంఘంలో మరిన్ని బ్యాడ్జి కార్డులు అవసరమైతే, వాటిని లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్‌ను (S-14) ఉపయోగించి రిక్వెస్టు చేయాలి.
◼ అప్లికేషన్ ఫర్ రెగ్యులర్ పయినీర్ సర్వీస్ (S-205) ఫారాలూ, అప్లికేషన్ ఫర్ ఆగ్జిలరీ పయినీర్ సర్వీస్ (S-205b) ఫారాలూ సంఘంలో కావలసినన్ని ఉండేలా సంఘ కార్యదర్శులు చూసుకోవాలి. ఈ ఫారాలను లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్ (S-14) ద్వారా ఆర్డర్ చేయవచ్చు. ఒక సంవత్సరానికి సరిపడే ఫారాలు అందుబాటులో ఉండేలా చూసుకోండి. క్రమ పయినీరు అప్లికేషన్‌లను బ్రాంచికి పంపే ముందు వాటిలో వివరాలన్నీ నింపబడేలా చూడండి.
◼ క్రొత్త రాజ్యమందిరాన్ని నిర్మించే ప్రాజెక్టును, లేదా దాన్ని పునర్నవీకరించే ప్రాజెక్టును ప్రారంభించే ముందు, సంఘంలోని పెద్దలు బ్రాంచి కార్యాలయంలో ఉన్న కింగ్‌డమ్‌హాల్ కన్‌స్ట్రక్షన్ డెస్క్‌ను సంప్రదించాలి. స్థలాన్ని, నిర్మాణ సామాగ్రిని కొనడంలో, ఇతర విషయాల్లో సంఘాలు వివేకవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు సహాయం చేసే సమాచారం వారి దగ్గర ఉంది.
◼ సంఘ పైవిచారణకర్తల, కార్యదర్శులందరి చిరునామాలనూ టెలిఫోన్ నంబర్లనూ బ్రాంచి కార్యాలయం తాజాగా నమోదు చేసుకోవాలి. కాబట్టి చిరునామా లేదా టెలిఫోన్ నంబరు మారితే సంఘ సేవా కమిటీ, ప్రిసైడింగ్ ఓవర్‌సీయర్/సెక్రటరీ చేంజ్ ఆఫ్ అడ్రస్ (S-29) ఫారమ్‌ను పూరించి, సంతకం చేసి వెంటనే బ్రాంచి కార్యాలయానికి పంపించాలి. టెలిఫోన్ ఎస్‌టిడి కోడ్‌లు మారితే వాటిని కూడా తెలియజేయాలి.
◼ తర్వాతి సేవా సంవత్సరానికి కావాల్సిన లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్‌లో (S-14)పేర్కొనబడిన ఫారాలు, ప్రతీ సంవత్సరం ఏప్రిల్ నెలలో మాత్రమే రిక్వెస్టు చేయాలని దయచేసి గుర్తుపెట్టుకోండి. కాబట్టి లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్ (S-14)లో రెండవ పేజీలో పట్టిక వేయబడిన ఫారాల్లో మీ సంఘానికి సంవత్సరంలో ఎన్ని అవసరమౌతాయో బేరీజు వేసుకుని వచ్చే నెల మీ సాహిత్య రిక్వెస్టుతోపాటు ఆ రిక్వెస్టును పంపించండి. తరచూ సంఘాలు కంగారులో ఒకటి లేదా రెండు ఫారాలకు మాత్రమే రిక్వెస్టులు పంపిస్తున్నట్లు గమనించబడింది. ఫారాల రిక్వెస్టును సాహిత్య రిక్వెస్టుతో జతచేసి పంపించాలి, అలా చేస్తే వాటిని పంపించడానికయ్యే ఖర్చు, సమయం ఆదా అవుతాయి.