దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, 2006 ఫిబ్రవరి 27వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు మౌఖికంగా పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2006 జనవరి 2 నుండి ఫిబ్రవరి 27 మధ్య వారాల్లోని నియామకాల సమాచారంపై 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేకపోతే, మీరే స్వయంగా పరిశోధించి జవాబులను తెలుసుకోవాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]
ప్రసంగ లక్షణాలు
1. ‘దేవునికి ఎల్లప్పుడు స్తుతియాగము చేయుచు, ఆయన నామమును ఒప్పుకోవడానికి’ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల మనకు ఏయే విధాలుగా సహాయం చేస్తుంది? (హెబ్రీ. 13:15) [be 5వ పేజీ, 3వ పేరా నుండి 6వ పేజీ, 1వ పేరా వరకు]
2. తప్పులు లేకుండా చదివేందుకు మనమెందుకు శ్రద్ధగా కృషిచేయాలి? [be 83వ పేజీ 1వ పేరా నుండి 84వ పేజీ 1వ పేరా వరకు]
3. మనం మాట్లాడేటప్పుడు, బోధించేటప్పుడు స్పష్టంగా మాట్లాడడం ఎందుకు చాలా ప్రాముఖ్యం? [be 86వ పేజీ 1-6 పేరాలు]
4. సరైన ఉచ్చారణ ఎందుకు ప్రాముఖ్యం, ఏ విషయాలను పరిగణలోకి తీసుకోవాలి? [be 89వ పేజీ 1వ పేరా నుండి 90వ పేజీ 2వ పేరా వరకు, బాక్సు]
5. మరింత అనర్గళంగా సంభాషించేందుకు మనకు సహాయం చేయగల కొన్ని సూచనలు ఏమిటి? [be 94వ పేజీ, 4-5 పేరాలు, బాక్సు]
ఒకటవ నియామకం
6. రెండవ దినవృత్తాంతములు 36:17-23 వచనాలు బైబిలు ప్రవచన విశ్వసనీయతను ఎలా ధృవీకరిస్తున్నాయి? [bsi06 4వ పేజీ, 35వ పేరా]
7. యూదులు యెహోవా ఆలయాన్ని పునర్నిర్మించడానికి సా.శ.పూ. 537లో తమ స్వదేశానికి తిరిగి రావడాన్ని సాధ్యం చేసిన వరుస సంఘటనలు ఏవి? [bsi06 5వ పేజీ, 1-3 పేరాలు]
8. ఎజ్రా పుస్తకం యెహోవా సత్యదేవుడని ఎలా నిరూపిస్తోంది, ఆయనమీద నమ్మకాన్ని ఎలా పెంపొందింపజేస్తోంది? [bsi06 6, 7 పేజీలు, 14, 18 పేరాలు]
9. బైబిలు సంఘటనల వృత్తాంతంలో, “అర్తహషస్త రాజు ఏలుబడికాలమున ఇరువదియవ సంవత్సరము” ఎందుకు ప్రాముఖ్యమైనది? (నెహె. 2:1, 5, 6, 11, 17, 18) [bsi06 7, 8 పేజీలు, 2, 5 పేరాలు]
10. నెహెమ్యా నేడు దేవుని సేవకులకు ఎలా మంచి మాదిరిగా ఉన్నాడు? [bsi06 8వ పేజీ, 16-17 పేరాలు]
వారపు బైబిలు పఠనం
11. యెహోవా నుండి జవాబు అవసరమైనప్పుడు ఉపయోగించబడిన ఊరీము, తుమ్మీము, చెరనుండి తిరిగివస్తున్న వారికి అందుబాటులో ఉన్నాయా? (ఎజ్రా 2:61-63)
12. బబులోనులో ఉన్న చాలామంది యూదులు ఎజ్రాతోపాటు యెరూషలేముకు వెళ్లడానికి ఎందుకు ఇష్టపడలేదు? (ఎజ్రా 7:28-8:20)
13. ప్రాకారాన్ని తిరిగి నిర్మించే పని ఒంటి చేత్తోనే ఎలా నిర్వహించబడుతుంది? (నెహె. 4:17, 18)
14. ఆంతరంగిక లేఖలు సాధారణంగా సీలువేసిన సంచిలో ఉంచబడతాయి, కానీ సన్బల్లటు నెహెమ్యాకు “విప్పియున్న” పత్రికను ఎందుకు పంపించాడు? (నెహె. 6:5)
15. అంతకుముందు అధిపతులతో, అధికారులతో వాదించినట్లే, వెనుదీస్తున్న యూదులతో ‘వాదించడంతోపాటు’ నెహెమ్యా ఇంకా ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నాడు? (నెహె. 13:25, 28)