ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు ఫిబ్రవరిలో: యెహోవాకు సన్నిహితమవండి పుస్తకాన్ని అందించాలి. ఈ పుస్తకం స్టాకులోలేని సంఘాలు, ప్రకటన ముగింపు! పుస్తకాన్ని లేక స్టాకులో అధికంగా ఉన్న వేరే పాత పుస్తకాన్ని ఉపయోగించవచ్చు. మార్చిలో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకాన్ని ప్రతిపాదించి బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రత్యేక కృషి చేయండి. ఏప్రిల్, మేలలో: కావలికోట, తేజరిల్లు! విడి పత్రికలు అందించండి. ఆసక్తిగలవారిని పునర్దర్శించేటప్పుడు, జ్ఞాపకార్థ ఆచరణకు లేదా సంఘంలోని ఇతర ప్రత్యేక సంఘటనలకు హాజరవుతూ సంఘంతో మాత్రం క్రియాశీలంగా సహవసించని వారిని సందర్శిస్తున్నప్పుడు, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది అనే క్రొత్త పుస్తకాన్ని ప్రతిపాదించడం మీద దృష్టి నిలపండి. వారితో బైబిలు అధ్యయనం ఆరంభించే లక్ష్యంతో ఆ పుస్తకాన్ని ప్రతిపాదించండి.
◼ ఏప్రిల్‌లో ఐదు పూర్తి వారాంతాలు ఉన్నాయి కాబట్టి సహాయ పయినీరు సేవ చేయడానికి అది అనువైన నెల.
◼ “పరిస్థితులు ఇప్పటికీ దేవుని ఆధీనంలోనే ఉన్నాయా?” అనే శీర్షికగల ప్రత్యేక బహిరంగ ప్రసంగం 2006 జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఇవ్వబడుతుంది. దీనికి సంబంధించిన ప్రకటనను సెప్టెంబరు 2005 మన రాజ్య పరిచర్యలో చూడండి.
◼ “బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తక అధ్యయనాన్ని ఆస్వాదించండి” అనే శీర్షికతో 6వ పేజీలో ఉన్న ఆర్టికల్, ఏప్రిల్ 3తో ప్రారంభమయ్యే వారంలో నిర్వహించబడే సేవాకూటంలో చర్చించబడుతుంది. మీరు ఆ ఆర్టికల్‌ను, దానితోపాటు ఉన్న అధ్యయన పట్టికను భద్రపరచుకోండి.
◼ సంఘ పైవిచారణకర్త లేదా ఆయన నియమించిన మరొకరు మార్చి 1న లేదా ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా సంఘ అకౌంట్స్ ఆడిట్ చేయాలి. నిర్వహణ లేక నిర్మాణం లాంటి వాటికి వేరే అకౌంట్ ఉంటే దాన్ని కూడా ఆడిట్ చేయడానికి ఏర్పాటు చేయాలి. ఆడిటింగ్ పూర్తైన తర్వాత, సంఘంలో తర్వాతి అకౌంట్స్ రిపోర్టుతోపాటు దాన్ని చదవాలి.
◼ కార్యదర్శి, సేవా పైవిచారణకర్త క్రమ పయినీర్లందరి కార్యకలాపాలను సమీక్షించాలి. చేరుకోవలసిన గంటలను పూర్తి చేయడం ఎవరికైనా కష్టంగా ఉంటే, వారికి పెద్దలు సహాయాన్ని ఏర్పాటు చేయాలి. సూచనల కోసం S-201 వార్షిక ఉత్తరాలను పునఃసమీక్షించండి.
◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:
బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?—బెంగాలీ