సేవా కూటాల పట్టిక
నవంబరు 14తో ప్రారంభమయ్యే వారం
పాట 29 (222)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. నవంబరు 15 కావలికోటను, అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించడానికి 4వ పేజీలోని సూచనలు (మీ క్షేత్రానికి అనువైనవైతే) ఉపయోగించండి. ఆచరణాత్మకమైన ఇతర ప్రతిపాదనలను కూడా ఉపయోగించవచ్చు. ప్రతి ప్రదర్శనలోనూ, “మతమంటే నాకిష్టం లేదు” అని సంభాషణను ఆటంకపరిచే వారితో విభిన్న రీతుల్లో ఎలా వ్యవహరించాలో చూపించండి.—బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకంలో 9వ పేజీ చూడండి.
15 నిమి: దేవుణ్ణి సంతోషపెట్టే విరాళాలు. కావలికోట, నవంబరు 1, 2005, 26-30 పేజీల ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం.
20 నిమి: “యెహోవా మహిమను ప్రకటించండి.”a 4వ పేరా చర్చిస్తున్నప్పుడు మంచి ప్రవర్తన, సాక్ష్యమిచ్చే అవకాశాన్ని ఎలా ఇవ్వగలదో చూపించే క్లుప్త అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి.
పాట 13 (124), ముగింపు ప్రార్థన.
నవంబరు 21తో ప్రారంభమయ్యే వారం
పాట 5 (46)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
20 నిమి: యెహోవాను మీ దేవునిగా చేసుకోవడం. కావలికోట, ఏప్రిల్ 1, 2005, 25-8 పేజీల ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం. అబ్రాహాము, దావీదు, ఏలీయా ఉదాహరణల నుండి మనం నేర్చుకోగల పాఠాలను ఆచరణాత్మకంగా ఎలా అన్వయించుకోవచ్చో వివరించండి.
15 నిమి: “గమనించేవారిగా ఉండడం ద్వారా వ్యక్తిగత ఆసక్తి చూపించండి.”b ఒక ప్రచారకుడు, గృహస్థుడి ఆసక్తిని వెల్లడి చేసే ఏదో ఒక విషయాన్ని గమనించి తన వ్యాఖ్యానాలను దానికి అనుగుణంగా మలచుకోవడాన్ని చూపించే ఒక ప్రదర్శనను చేర్చండి.
పాట 26 (212), ముగింపు ప్రార్థన.
నవంబరు 28తో ప్రారంభమయ్యే వారం
పాట 17 (187)
12 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. నవంబరు క్షేత్ర సేవా రిపోర్టులు ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి. డిసెంబరు 1 కావలికోటను, అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించడానికి 4వ పేజీలోని సూచనలు (మీ క్షేత్రానికి అనువైనవైతే) ఉపయోగించండి. ఆచరణాత్మకమైన ఇతర ప్రతిపాదనలను కూడా ఉపయోగించవచ్చు. విరాళ ఏర్పాటు గురించి కూడా చెప్పండి.
15 నిమి: “మనం ఎలా సహాయం చేయవచ్చు?” ప్రసంగం. తీవ్ర అవసరంలో ఉన్న తోటి విశ్వాసులకు యెహోవా సేవకులు చేసిన సహాయక చర్యల గురించిన కొన్ని ఉదాహరణలు చెప్పండి. (తేజరిల్లు! (ఆంగ్లం) ఆగస్టు 8, 2003, 10-15 పేజీలు; నవంబరు 22, 2002, 19-24 పేజీలు; అక్టోబరు 22, 2001, 23-7 పేజీలు చూడండి. ఇతర ఉదాహరణలను కూడా ఉపయోగించవచ్చు.) ఆ తర్వాత మన రాజ్య పరిచర్యలోని 3వ పేజీలో ఉన్న ఆర్టికల్ నుండి కీలకాంశాలను చర్చించండి. ఎవరైనా మానవతా దృక్పథంతో చేసే సేవ కోసం, సహాయక చర్యల కోసం విరాళాలు ఇవ్వాలనుకుంటున్నట్లయితే వారు ఆ నిధులను ప్రపంచవ్యాప్త పని కోసమనే పంపించడం మంచిదని నొక్కి చెప్పండి.
18 నిమి: డిసెంబరులో సువార్తను ప్రకటించడం. ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. ఐదు నిమిషాల ఉపోద్ఘాతంలో మన రాజ్య పరిచర్య జనవరి 2005లోని 8వ పేజీలో ఉన్న “సూచించబడిన ప్రతిపాదనలను ఉపయోగించే విధానం” అనే శీర్షిక నుండి క్రింది అంశాలు క్లుప్తంగా సమీక్షించండి: (1) మనం ప్రతిపాదనలను సొంత మాటల్లో చెబితే పరిచర్యలో మరింత సమర్థవంతంగా ఉంటాం. (2) మనం సరైన వివేచనను ఉపయోగించి, స్థానికంగా ఆమోదకరంగా ఉండే విధంగా మన ప్రతిపాదనలను పరిస్థితులకు అనుగుణంగా మలచుకోవాలి. (3) మన క్షేత్రంలోని ప్రజల నేపథ్యాన్ని, ఆలోచనా విధానాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. (4) మనం పరిచయం చేయదలచిన అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివి ఆసక్తి రేకెత్తించే అంశాల కోసం చూడాలి. (5) మనం సూచించబడిన ప్రతిపాదనలను మాత్రమే ఉపయోగించాలని లేదు. ఆ తర్వాత, డిసెంబరు సాహిత్య ప్రతిపాదనలను అందిస్తున్నప్పుడు ఆ అంశాలను ఎలా అన్వయించుకోవచ్చో చర్చించండి. మీరు మన రాజ్య పరిచర్య జనవరి 2005లోని మాదిరి ప్రతిపాదనలను ఉపయోగించవచ్చు లేక స్థానికంగా సమర్థవంతంగా ఉండే ఇతర ప్రతిపాదనలను ఉపయోగించవచ్చు. ఒకటి రెండు ప్రతిపాదనలను ప్రదర్శించండి.
పాట 4 (43), ముగింపు ప్రార్థన.
డిసెంబరు 5తో ప్రారంభమయ్యే వారం
పాట 16 (143)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి:స్థానిక అవసరాలు.
20 నిమి: “మన పరిచర్య ఏమి నెరవేరుస్తుంది?”c 5వ పేరా చర్చిస్తున్నప్పుడు కావలికోట, ఫిబ్రవరి 15, 2004, 32వ పేజీలోని వ్యాఖ్యానాలను చేర్చండి.
పాట 3 (32), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.