దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, 2005 అక్టోబరు 31వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు మౌఖికంగా పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2005 సెప్టెంబరు 5 నుండి అక్టోబరు 31 మధ్య వారాల్లోని నియామకాల సమాచారంపై 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేకపోతే, మీరే స్వయంగా పరిశోధించి జవాబులను తెలుసుకోవాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]
ప్రసంగ లక్షణాలు
1. దేవుని వాక్యం నుండి మనం బోధించేది ప్రజల సూచనార్థక హృదయాన్ని చేరుకునేలా మనం ఎలా చేయవచ్చు? (మత్త. 13:19) [be 258వ పేజీ 1-2 పేరాలు, బాక్సు]
2. అవతలి వ్యక్తి హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి మనకు ఏవి సహాయం చేయగలవు, అయితే మనం ఏ విషయాలను గుర్తుంచుకోవాలి? [be 259వ పేజీ 2-3 పేరాలు]
3. మనం బోధిస్తున్నప్పుడు యెహోవా అద్భుతమైన లక్షణాలను నొక్కి చెప్పడం ఎందుకు ప్రాముఖ్యం? [be 260వ పేజీ 1వ పేరా]
4. మన బైబిలు విద్యార్థులు తాము అభివృద్ధి సాధించాల్సిన రంగాలను గుర్తించేలా మనం వారికి ఎలా సహాయం చేయవచ్చు? [be 260వ పేజీ 4-261వ పేజీ 1వ పేరా]
5. మన బైబిలు విద్యార్థులు గానీ ప్రేక్షకులు గానీ తాము ఏమి చేసినా దాని వెనకున్న ఉద్దేశాలను విశ్లేషించుకొనేలా సహాయం చేయడానికి మనమేమి చేయవచ్చు? [be 262వ పేజీ 2-3 పేరాలు]
ఒకటవ నియామకం
6. యెహోవాను “మనస్ఫూర్తిగా వెదకడం” అంటే భావమేమిటి, మనమలా మనస్ఫూర్తిగా వెదుకుతున్నామని ఎలా చూపించవచ్చు? (హెబ్రీ. 11:6, NW) [w03 8/15 25వ పేజీ 2వ పేరా; 26వ పేజీ 1, 2 పేరాలు; 27వ పేజీ 2వ పేరా]
7. “హితవాక్యప్రమాణము” అంటే ఏమిటి, పెద్దలు తాము ఆ ప్రమాణానికి హత్తుకొని ఉన్నామని ఎలా చూపించవచ్చు? (2 తిమో. 1:13, 14) [w03 1/1 29వ పేజీ 3వ పేరా-30వ పేజీ 1వ పేరా]
8. ఇప్పుడు ఏయే విధాలుగా నిజమైన ఐక్యత సాధ్యమవుతుంది? [wt 8వ పేజీ, 9వ పేరా]
9. మనం దేవుని గురించి తెలుసుకుంటుండగా మన జీవితాలు ఎలా ప్రభావితమవుతాయి? [wt 15వ పేజీ, 2వ పేరా]
10. బైబిలు సత్యాల గురించిన ఎలాంటి వివరణలు, బైబిలుపట్ల కొంతమంది ప్రజల దృక్పథాన్ని మార్చాయి, ఎందుకు? [wt 24వ పేజీ, 4వ పేరా]
వారపు బైబిలు పఠనం
11. మతసంబంధమైన అస్థికలను పూజించడమనే నమ్మకాన్ని 2 రాజులు 13:21 సమర్థిస్తోందా?
12. హిజ్కియా ఐగుప్తుతో పొత్తు కుదుర్చుకున్నాడా? (2 రాజు. 18:19-21, 25)
13. అష్షూరీయుల చారిత్రక పత్రాలు యెహోవా అద్భుతమైన రీతిలో సన్హెరీబును ఓడించడం గురించి ప్రత్యేకంగా చెప్పకపోయినా, ఆ పత్రాల్లో చెప్పబడినవాటిలో మీరు ఏ ఆసక్తికరమైన విషయాలు కనుగొంటారు? (2 రాజులు 19:35, 36)
14. షయల్తీయేలు తండ్రి ఎవరు? (1 దిన. 3:16-18)
15. సౌలు రాజు దినాల్లో రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థ గోత్రములవారు నేటి దేవుని సేవకులందరికీ మంచి మాదిరిని ఎలా ఉంచారు? (1 దిన. 5:18-22)