ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు అక్టోబరులో: కావలికోట, తేజరిల్లు! విడి పత్రికలు అందించండి. ఆసక్తి చూపించిన చోట దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను పరిచయం చేయండి. నవంబరులో: గొప్ప బోధకుని నుండి నేర్చుకోండి (ఆంగ్లం) పుస్తకం అందించండి. తమకు పిల్లలులేరని గృహస్థులు చెప్పినప్పుడు, వారికి జ్ఞానము పుస్తకాన్ని లేదా మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్ని ఇవ్వండి. డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని ప్రతిపాదించండి. లేనట్లయితే ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము, బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం), లేదా మీరు పరదైసు భూమిపై నిరంతరం జీవించగలరు వంటి పుస్తకాలను ప్రతిపాదించండి. జనవరిలో: 192 పేజీల ఏ పాత పుస్తకమైనా లేక 1991వ సంవత్సరానికి ముందు ప్రచురించబడిన ఏ పుస్తకాన్నైనా ప్రతిపాదించవచ్చు. గృహస్థులు పుస్తక ప్రతిపాదనను అంగీకరించకపోతే, అప్రమత్తంగా ఉండండి! అనే బ్రోషుర్‌ను ప్రతిపాదించండి.
◼ అక్టోబరులో ఐదు వారాంతాలు ఉన్నాయి కాబట్టి, సహాయ పయినీరు సేవ చేయడానికి అది చాలా అనువైన నెల
◼ ఈ సంచిక మన రాజ్య పరిచర్య మధ్య పేజీల్లో “2006వ సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక” ఉంది, సమాచార నిర్దేశం కోసం దీనిని 2006వ సంవత్సరమంతా జాగ్రత్తగా ఉంచుకోవాలి.