కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/05 పేజీ 8
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2005
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2004
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2003
  • పత్రిక గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2008
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2005
km 8/05 పేజీ 8

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

కావలికోట ఆగ. 15

“విషాదకర పరిస్థితుల్లో ఎవరినైనా మరణంలో కోల్పోతే వారికి ఆ తర్వాత ఏమి సంభవిస్తుందని చాలామంది ఆలోచిస్తారు. మరణాన్ని అర్థం చేసుకోవడం సాధ్యమేనని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ పత్రిక, మరణించినవారి పరిస్థితి గురించి బైబిలు ఏమి చెబుతోందో వివరిస్తుంది. మరణించిన మన ప్రియమైనవారి పునరుత్థానం విషయంలో దేవుని వాగ్దానం గురించి కూడా ఇది చర్చిస్తోంది.” యోహాను 5:28, 29 చదవండి.

తేజరిల్లు! జూలై-సెప్టెం.

“ఇదివరకు సాధారణంగా విదేశాలకే పరిమితమైన సమస్యలను, మన యౌవనుల్లో చాలామంది నేడు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. మరి మీరేమంటారు? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ ఉదాహరణను పరిశీలించండి. [పత్రికలోని 18వ పేజీలోవున్న ఆర్టికల్‌ను చూపించండి.] యౌవనులకు ఇవ్వబడిన మంచి సలహాను గమనించండి [సామెతలు 18:13 చదివి, 18వ పేజీలోవున్న ఆర్టికల్‌ను చూపించండి.] మనం బాగా ఆలోచించాల్సిన అంశాలను ఈ ఆర్టికల్‌ నొక్కిచెబుతోంది.”

కావలికోట సెప్టెం. 1

“నేటి లోకంలో విశ్వసనీయత, సాధారణంగా ఎక్కువగా కొనియాడబడుతున్నప్పటికీ అది అంతగా అనుసరించబడని ఒక సద్గుణం. చాలామంది ఇక్కడ వర్ణించబడిన స్నేహితునిలా ఉన్నట్లయితే అది అద్భుతంగా ఉండదా? [సామెతలు 17:17 చదవండి. ఆ తర్వాత ప్రతిస్పందించనివ్వండి.] ఈ పత్రిక, మన కుటుంబానికి, స్నేహితులకు విశ్వసనీయంగా ఉండడంవల్ల వచ్చే ప్రయోజనాల గురించి చర్చిస్తుంది.”

తేజరిల్లు! జూలై-సెప్టెం.

“చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలాంటి సినిమాలు చూడడానికి అనుమతించాలనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మీ కుటుంబానికి తగిన సినిమాలేమిటో తెలుసుకోవడం సవాలుగా ఉంటోందా? [ప్రతిస్పందించనివ్వండి. తర్వాత ఎఫెసీయులు 4:17 చదవండి.] తమ పిల్లలకు మంచి వినోదాన్ని ఎంపిక చేసుకోవడానికి తల్లిదండ్రులు ఎలా సహాయం చేయవచ్చో ఈ పత్రిక చూపిస్తోంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి