దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, 2005 ఆగస్టు 29వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు మౌఖికంగా పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2005 జూలై 4 నుండి ఆగస్టు 29 మధ్య వారాల్లోని నియామకాల సమాచారంపై 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేకపోతే, మీరే స్వయంగా పరిశోధించి జవాబులను తెలుసుకోవాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]
ప్రసంగ లక్షణాలు
1. మన నిరీక్షణను ఇతరులతో పంచుకునేటప్పుడు మనం మన “సహేతుకతను సకల జనులకు” ఎలా ‘తెలియబడనివ్వవచ్చు,’ అది ఎందుకు ప్రాముఖ్యం? (ఫిలి. 4:5; యాకో. 3:17) [be 251వ పేజీ 1-3 పేరాలు, బాక్సు]
2. ఎప్పుడు సహేతుకంగా ఉండాలో తెలుసుకోవడం ఇతరులతో విజయవంతంగా వ్యవహరించడానికి మనకు ఎలా సహాయం చేస్తుంది? [be 253వ పేజీ 1-2 పేరాలు]
3. ఒక విషయంపై తర్కించడానికి ఇతరులకు మనం సహాయం చేసేటప్పుడు ప్రశ్నలను సమర్థవంతంగా ఉపయోగించడం ఎందుకు ప్రాముఖ్యం? [be 253వ పేజీ 3-4 పేరాలు]
4. చెప్పే విషయం ఒప్పించేదిగా ఉండాలంటే ఏ అంశాలను పరిశీలించాలి? [be 255వ పేజీ 1-4 పేరాలు, బాక్సు; 256వ పేజీ 1వ పేరా, బాక్సు]
5. మనం లేఖనాల్లోని సహేతుకతకు మద్దతుగా బైబిలు కాకుండా ఒక నమ్మదగిన మూలం నుండి రుజువును ఉపయోగించాలనుకుంటే మనస్సులో ఉంచుకోవాల్సినది ఏమిటి? [be 256వ పేజీ 3-5 పేరాలు, బాక్సు]
ఒకటవ నియామకం
6. యేసు చారిత్రకతను ఏ స్పష్టమైన రుజువు నిరూపిస్తోంది? [w03 6/15 4-7 పేజీలు]
7. ‘యథార్థవంతుల నోరు వారిని’ ఎలా ‘విడిపిస్తుంది,’ నీతిమంతుల ఇల్లు ఎలా ‘నిలిచే’ ఉంటుంది? (సామె. 12:6, 7) [w03 1/15 30వ పేజీ 1-3 పేరాలు]
8. బైబిలు “ఇలా చెయ్యండి,” “ఇలా చెయ్యొద్దు” అనేవి ఉన్న పట్టిక రూపంలో వ్రాయబడలేదు కాబట్టి ‘యెహోవా చిత్తమేమిటో’ మనమెలా గ్రహించవచ్చు? [w03 12/1 21వ పేజీ 3వ పేరా-22వ పేజీ 3వ పేరా]
9. బైబిలులోని ఏ సూత్రాలను అన్వయించుకోవడం, పేదరికాన్ని లేదా కష్టభరితమైన ఆర్థిక పరిస్థితులను తట్టుకోవడానికి సహాయం చేస్తుంది? [w03 8/1 5వ పేజీ 2-5 పేరాలు]
10. ఉదారంగా ఇవ్వడంలో యెహోవా మాదిరి మనల్ని ఎలా ప్రభావితం చేయాలి? (మత్త. 10:8) [w03 8/1 20-2 పేజీలు]
వారపు బైబిలు పఠనం
11. సొలొమోను నిర్మించిన ఆలయ ద్వారానికి ఇరువైపుల ఉన్న యాకీను, బోయజు అనే పేర్లుగల రెండు స్తంభములు దేన్ని సూచిస్తున్నాయి? (1 రాజు. 7:15-22)
12. సొలొమోను గలిలయ దేశంలోని 20 పట్టణాలను తూరు రాజైన హీరాముకు ఇవ్వడం మోషే ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఉందా? (1 రాజు. 9:10-13)
13. “దైవజనుడైన యొకడు” చూపించిన అవిధేయత నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (1 రాజు. 13:1-25)
14. యూదా రాజైన ఆసా తన ధైర్యాన్ని ఏ విధంగా ప్రదర్శించాడు, ఆయన ఉదాహరణ నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (1 రాజు. 15:11-13)
15. ఆహాబు రాజుకు, నాబోతుకు సంబంధించిన ఒక సంఘటన, మన మీద మనం జాలిపడడంవల్ల కలిగే ప్రమాదాన్ని ఎలా చూపిస్తోంది? (1 రాజు. 21:1-16)