సేవా కూటాల పట్టిక
గమనిక: “దైవిక విధేయత” జిల్లా సమావేశానికి సంఘం హాజరైన ఒకటి లేక రెండు నెలల తర్వాత సేవా కూటంలో (బహుశా స్థానిక అవసరాల భాగాన్ని ఉపయోగిస్తూ), ప్రచారకులు సమావేశంలోని ఏ అంశాలను క్షేత్ర సేవలో సహాయకరంగా ఉన్నట్లు కనుగొన్నారో వాటిని సమీక్షించడానికి 15, 20 నిమిషాలు కేటాయించండి. మనం సమావేశంలో నేర్చుకున్నవాటిని ఎలా ఉపయోగిస్తున్నామో వివరించేందుకు, అలా ఉపయోగించడం ద్వారా మన పరిచర్యను మరింత సమర్థవంతం చేసుకోవడానికి ఎలా సహాయం చేసిందో వివరించేందుకు ఆ సేవా కూటంలోని భాగం మనకు అవకాశాన్నిస్తుంది.—మన రాజ్య పరిచర్య, ఏప్రిల్ 2005, 2వ పేజీ చూడండి.
ఆగస్టు 8తో ప్రారంభమయ్యే వారం
పాట 23 (200)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 2006వ సేవా సంవత్సరపు ప్రాంతీయ, ప్రత్యేక దిన సమావేశ కార్యక్రమాల తేదీలు తెలిసినట్లయితే గుర్తుచేయండి.
10 నిమి: “మీరు హ్యాండ్ బిల్లులను ఉపయోగిస్తున్నారా?” ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. హ్యాండ్ బిల్లులను ఉపయోగించడం ద్వారా లభించిన మంచి ఫలితాల గురించి వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి. ఒక ప్రచారకుడు, హ్యాండ్ బిల్లును ఉపయోగిస్తూ ఆసక్తిగల వ్యక్తిని కూటానికి ఆహ్వానిస్తున్న ఒక క్లుప్త ప్రదర్శనను చేర్చండి.
25 నిమి: “ప్రకటించవలసిన సమయం ఇదే!”a పయినీరు సేవ చేయడానికి తాము చేసుకున్న సర్దుబాట్ల గురించి, తత్ఫలితంగా తాము పొందిన మంచి ఫలితాల గురించి వ్యాఖ్యానించడానికి ఒకరు లేక ఇద్దరు క్రమ పయినీర్లను ముందుగానే ఏర్పాటు చేసుకోండి.
పాట 20 (93), ముగింపు ప్రార్థన.
ఆగస్టు 15తో ప్రారంభమయ్యే వారం
పాట 9 (37)
10 నిమి: స్థానిక ప్రకటనలు. ఆగస్టు 15 కావలికోటను, జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించడానికి 8వ పేజీలోని సూచనలు (మీ క్షేత్రానికి అనువైనవైతే) ఉపయోగించండి. ఒక పెద్ద, అనారోగ్యంతో ఉన్న ఒక ప్రచారకుడు టెలిఫోన్ సాక్ష్యమివ్వడాన్ని ప్రదర్శించండి.
15 నిమి: మీకు జ్ఞాపకమున్నాయా? కావలికోట, ఏప్రిల్ 15, 2005, 30వ పేజీ ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. ప్రతీ ప్రశ్న మీద వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి. సమాచారానికి సంబంధించిన ఆచరణాత్మక విలువను నొక్కి చెప్పండి. కావలికోట, తేజరిల్లు!ల ప్రతీ సంచికను జాగ్రత్తగా చదవమని అందరినీ ప్రోత్సహించండి.
20 నిమి: “ఇంటి గుమ్మం దగ్గర, టెలిఫోన్ ద్వారా బైబిలు అధ్యయనాలను ప్రారంభించడం.”b క్లుప్త ప్రదర్శనను చేర్చండి, మొదటిసారి కలుసుకున్నప్పుడే దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లోని కేవలం ఒకటి రెండు పేరాలను ఉపయోగించి బైబిలు అధ్యయనాన్ని ఎలా ప్రారంభించవచ్చో చూపించండి. ఫోన్ ద్వారా అధ్యయనం ప్రారంభించిన ఒకటి, రెండు ప్రోత్సాహకరమైన అనుభవాలను క్లుప్తంగా చెప్పండి.
పాట 22 (130), ముగింపు ప్రార్థన.
ఆగస్టు 22తో ప్రారంభమయ్యే వారం
పాట 26 (212)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి.
15 నిమి: స్థానిక అవసరాలు.
20 నిమి: “రాజ్యాన్ని ప్రకటించడం—అమూల్యమైన ఒక ఆధిక్యత.”c 4వ పేరాను చర్చిస్తున్నప్పుడు, వృద్ధాప్యం లేక ఆరోగ్య సమస్యల కారణంగా చాలా పరిమితంగా సేవ చేయగలిగినవారు 15 నిమిషాల చొప్పున క్షేత్రసేవ సమయాన్ని రిపోర్టు చేయడానికి వీలుగా చేయబడిన ప్రత్యేక ఏర్పాటును సమీక్షించండి.—మన రాజ్య పరిచర్య, అక్టోబరు 2002, 8వ పేజీ, 6వ పేరా చూడండి.
పాట 25 (204), ముగింపు ప్రార్థన.
ఆగస్టు 29తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (45)
10 నిమి: స్థానిక ప్రకటనలు. ఆగస్టు క్షేత్ర సేవా రిపోర్టులు ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి. 8వ పేజీలోని సలహాలను (మీ క్షేత్రానికి సముచితమైతే) ఉపయోగిస్తూ సెప్టెంబరు 1 కావలికోట, జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ఒక ప్రదర్శనలో పత్రికా మార్గంలో పునర్దర్శనాన్ని ప్రదర్శించండి.
15 నిమి: “వాక్యం లేకుండానే సాక్ష్యం”d దేవుని ప్రజల మంచి ప్రవర్తనను గమనించడంవల్ల, యెహోవా సేవకులయ్యేందుకు తమకు ఎలా సహాయం చేసిందో వ్యాఖ్యానించడానికి ఎన్నుకోబడిన ప్రచారకులను ఆహ్వానించండి.
20 నిమి: మొదటి సందర్శనాల్లోనే బైబిలును ఉపయోగించండి. ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. మొదటి సందర్శనాల్లోనే దేవుని వాక్యం వైపు దృష్టి మళ్ళించేందుకు మన రాజ్య పరిచర్య, సెప్టెంబరు 2004, 4వ పేజీ, 2వ పేరాలోని సూచనలను సమీక్షించండి. సెప్టెంబరు సాహిత్య ప్రతిపాదనలకు, అక్కడ సూచించబడిన ఒకటి లేక రెండు ప్రతిపాదనలను ఎలా ఉపయోగించవచ్చో ప్రదర్శించండి. సమయం అనుమతిస్తే, ప్రతిపాదనలను ఇచ్చే విషయంలో మన రాజ్య పరిచర్య జనవరి 2005 మధ్య పేజీల్లోని సూచనలను కూడా చర్చించవచ్చు, ప్రదర్శించవచ్చు.
పాట 4 (43), ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 5తో ప్రారంభమయ్యే వారం
పాట 16 (143)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: “ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం—12వ భాగం.”e బైబిలు అధ్యయనాలను ప్రారంభించి, వాటిని నిర్వహించడంలో ప్రగతి సాధించడానికి తమకు ఏమి సహాయం చేసిందో వ్యాఖ్యానించడానికి ఒకరు లేక ఇద్దరు ప్రచారకులను ముందుగానే ఏర్పాటు చేసుకోండి.
20 నిమి: వృద్ధులకు సహాయం చేసే పనిని వ్యవస్థీకరించడం. కావలికోట, ఆగస్టు 15, 1993, 28-9 పేజీల్లో ఉన్న “వ్యవస్థీకరణ ఎంతో విలువైనది” అనే ఉపశీర్షిక ఆధారంగా ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం. అనారోగ్యంగా ఉన్నవారికి, వృద్ధులకు సహాయం చేయడానికి సంఘంలో చేయబడిన ఏర్పాట్లను పేర్కొనండి.
పాట 19 (164), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
e ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.