ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు జూలై, ఆగస్టుల్లో: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే, అనే 32-పేజీల బ్రోషుర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు. సెప్టెంబరు: మీ పట్ల శ్రద్ధచూపే సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) పుస్తకం ప్రతిపాదించండి, ప్రత్యామ్నాయ ప్రతిపాదనగా, జీవం—ఇక్కడికెలా వచ్చింది? పరిణామం ద్వారానా, సృష్టి ద్వారానా? (ఆంగ్లం) పుస్తకం లేదా 192 పేజీల ఒక పాత పుస్తకం ఉపయోగించవచ్చు. గృహస్థులు పుస్తకాన్ని తీసుకోనట్లయితే అప్రమత్తంగా ఉండండి! బ్రోషుర్‌ను ప్రతిపాదించండి.
◼ సెప్టెంబరు మొదలుకొని జిల్లా పైవిచారణకర్తలు “బైబిలుచేత ఎందుకు నిర్దేశించబడాలి?” అనే అంశం మీద బహిరంగ ప్రసంగాన్ని ఇస్తారు.
◼ క్రమ పయినీరు సేవ కోసం దరఖాస్తులను, పయినీరింగు ప్రారంభించడానికి అనుమతి కోసం అడిగిన తేదీకి కనీసం 30 రోజుల కన్నా ముందు బ్రాంచి కార్యాలయానికి పంపించాలని సిఫారసు చేయబడుతోంది. సంఘ కార్యదర్శి ఫారాలు పూర్తిగా పూరించబడ్డాయో లేదో చూడడానికి వాటిని సమీక్షించాలి. దరఖాస్తుదారులకు తాము బాప్తిస్మం తీసుకున్న తేదీ జ్ఞాపకం లేకపోతే వారు ఆ తేదీని అంచనా వేసుకొని ఆ తర్వాత ఎల్లప్పుడూ ఆ తేదీని ఉపయోగించాలి. సంఘ కార్యదర్శి ఆ తేదీని కాంగ్రిగేషన్స్ పబ్లిషర్ రికార్డ్ కార్డు (S-21) మీద వ్రాయాలి.
◼ జ్ఞాపిక: స్పెషల్ రిక్వెస్ట్ ఫామ్ ఫర్ ఏన్యువల్ ఐటమ్స్ సంఘాలకు పంపించబడుతోంది. 2006వ సంవత్సరానికి సంబంధించిన వార్షిక పుస్తకము (ఆంగ్లం), క్యాలెండర్ (ఆంగ్లం), లేఖనాలను పరిశోధించడం వంటి వార్షిక ఐటమ్స్ సరఫరా కోసం ఇంకా రిక్వెస్ట్ చేయని సంఘాలు, వెంటనే రిక్వెస్టులను పంపించాలి. కింగ్‌డమ్ హాల్ లిటరేటర్ ఇన్వెంటరీ అరెంజ్‌మెంట్ క్రింద వచ్చే సంఘాలు తమ రిక్వెస్టులను “కో-ఆర్డినేటింగ్ కాంగ్రిగేషన్” ద్వారానే పంపించాలి. అయితే, కో-ఆర్డినేటింగ్ కాంగ్రిగేషన్‌కు చెందిన కార్యదర్శి తమ లిటరేటర్ గ్రూప్‌లో ఉన్న సంఘాలన్నిటికీ సరిపోయేంత సాహిత్యం ఆర్డర్ చేయబడేలా చూసుకోవాలి.
◼ మళ్ళీ లభ్యమవుతున్న ప్రచురణలు:
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి—కన్నడ
మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?—నేపాలీ