సేవా కూటాల పట్టిక
జూన్ 13తో ప్రారంభమయ్యే వారం
పాట 7 (51)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. జూన్ 15 కావలికోటను, ఏప్రిల్-జూన్ తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించడానికి 8వ పేజీలోని సూచనలు (మీ క్షేత్రానికి అనువైనవైతే) ఉపయోగించండి. ఆచరణాత్మకమైన ఇతర ప్రతిపాదనలను కూడా ఉపయోగించవచ్చు. ఒక ప్రదర్శనలో, అనియత పరిస్థితుల్లో పత్రికలను ప్రతిపాదించడాన్ని ప్రదర్శించండి.
15 నిమి: బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులయ్యేందుకు ఇతురులకు సహాయం చేయండి. యెహోవా చిత్తాన్ని చేయడానికి సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 78-81 పేజీల ఆధారంగా ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. ఒక బైబిలు విద్యార్థి సంఘంతో కలిసి క్షేత్ర సేవలో భాగం వహించేందుకు లేఖనార్హతలు ఉన్నాయో లేదో నిర్ణయించడానికి చేసిన ఏర్పాటు గురించి చర్చించండి. బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులుగా అర్హులైన బైబిలు విద్యార్థులు ఇంటింటి పరిచర్యలో భాగం వహించేలా మనం ఎలా శిక్షణనివ్వవచ్చో వచ్చే వారం మనం పరిశీలిస్తాం.
20 నిమి: “సహనంతో ఉండడానికి ప్రకటనా పని మనకు సహాయం చేస్తుంది.”a సమయం అనుమతిస్తే ఉదాహరించబడిన లేఖనాల మీద వ్యాఖ్యానించడానికి ప్రేక్షకులను ఆహ్వానించండి.
పాట 16 (143), ముగింపు ప్రార్థన.
జూన్ 20తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (45)
10 నిమి: స్థానిక ప్రకటనలు. జూలై 2003 మన రాజ్య పరిచర్య 8వ పేజీలోని ముఖ్యాంశాలను సమీక్షించండి. ప్రచారకులు ఒక విదేశీ భాషలో సాహిత్యాన్ని ఎలా పొందవచ్చో వివరించండి. ఈ సమాచారం స్థానిక క్షేత్రానికి ఎలా వర్తిస్తుందో చర్చించండి. విదేశీ భాషల్లో ఒకే సాహిత్యం అవసరమైనా, అనవసరమైన కాలయాపన కాకుండా వాటిని పొందడానికి సాహిత్య సేవకుని ద్వారానే ఏ రిక్వెస్టు అయినా చేయాలి.
15 నిమి: మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎదురైన క్షేత్రసేవా అనుభవాలను వివరించండి లేక పునర్నటింపజేయండి. జ్ఞాపకార్థ ఆచరణా కాలంలో తమ పరిచర్యను విస్తృతం చేసుకోవడానికి చేసిన కృషి గురించి, తత్ఫలితంగా లభించిన ఆశీర్వాదాల గురించి వ్యాఖ్యానించేందుకు ఒకరిని గానీ ఇద్దరిని గానీ ముందుగా ఏర్పాటు చేసుకోండి. అప్రమత్తంగా ఉండండి! బ్రోషుర్‌ను అందించడం ద్వారా తమకు ఎదురైన అనుభవాలను వివరించమని ప్రేక్షకులను ఆహ్వానించండి. గమనార్హమైన అనుభవాలను పునర్నటించేందుకు ముందుగా ఏర్పాటు చేసుకోండి. ఆ ప్రత్యేక కార్యక్రమానికి మద్దతు ఇచ్చినందుకు అందరినీ మెచ్చుకోండి.
20 నిమి: “ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం—10వ భాగం.”b అభ్యాస కార్యక్రమాలు చేస్తున్నట్లు చూపించే ఒక ప్రదర్శనను చేర్చండి. విద్యార్థి ఒక ప్రతిపాదనను పూర్వాభ్యాసం చేస్తున్నప్పుడు గృహస్థుని పాత్ర పోషిస్తున్న పుస్తక అధ్యయన నిర్వాహకుడు స్థానిక క్షేత్రంలో సాధారణంగా ఎదురయ్యే అభ్యంతరాన్ని లేవనెత్తుతాడు, విద్యార్థి ఏమి చెప్పాలి అనే విషయంలో అనిశ్చయతతో ఉంటే అలాంటి అభ్యంతరాలతో ఎలా వ్యవహరించాలో పుస్తక అధ్యయన నిర్వాహకుడు వివరిస్తాడు. ఇంటింటి పరిచర్యలో భాగం వహించడం ప్రారంభించినప్పుడు తమకు దొరికిన శిక్షణ గురించి వ్యాఖ్యానించడానికి ఒకరిని గానీ ఇద్దరిని గానీ ముందుగా ఏర్పాటు చేసుకోండి.
పాట 8 (53), ముగింపు ప్రార్థన.
జూన్ 27తో ప్రారంభమయ్యే వారం
పాట 12 (113)
10 నిమి: స్థానిక ప్రకటనలు. జూన్ క్షేత్ర సేవా రిపోర్టులు ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి. అక్కౌంట్స్ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. జూలై 1 కావలికోటను లేక జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించడానికి 8వ పేజీలోని సూచనలు (మీ క్షేత్రానికి అనువైనవైతే) ఉపయోగించండి. ఆచరణాత్మకమైన ఇతర ప్రతిపాదనలను కూడా ఉపయోగించవచ్చు. ప్రదర్శన ముగిసిన తర్వాత గృహస్థుని ఆసక్తిని రేకెత్తించడానికి ఉపయోగించిన ప్రారంభ వ్యాఖ్యానాలను మళ్ళీ చెప్పండి.
15 నిమి: స్థానిక అవసరాలు.
20 నిమి: జూలై, ఆగస్టు నెలల్లో బ్రోషుర్‌లను ప్రతిపాదించడం. మధ్యపేజీల ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. జనవరి 2005 మన రాజ్య పరిచర్యలోని 8వ పేజీలోవున్న ముఖ్యాంశాలతో పాటు 3వ పేజీలోని బాక్సులోవున్న సమాచారాన్ని కూడా నొక్కి చెబుతూ మధ్యపేజీలను ఎలా ఉపయోగించాలో క్లుప్తంగా వివరించండి. మొదటిసారి కలుసుకున్నప్పుడు బ్రోషుర్‌లను ప్రతిపాదించడానికి స్థానిక క్షేత్రానికి అనువైన సూచనలను చర్చించండి. రెండు లేక మూడు ప్రతిపాదనలను ప్రదర్శించండి. ఒక్క ప్రదర్శనలోనైనా ఒక యువ ప్రచారకుడు పాల్గొనేలా చేయండి.
పాట 9 (37), ముగింపు ప్రార్థన.
జూలై 4తో ప్రారంభమయ్యే వారం
పాట 22 (130)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: కుటుంబ కార్యక్రమ పట్టిక నుండి మీరు ప్రయోజనం పొందుతున్నారా? మే 2005 మన రాజ్య పరిచర్య మధ్యపేజీల్లో ఉన్న సలహాలను పునఃసమీక్షించి, సలహాలను అన్వయించుకోవడానికి తాము చేసిన కృషిని గురించి, అలా కృషి చేయడం ద్వారా తాము పొందిన ప్రయోజనాల గురించి వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.
20 నిమి: “బహిరంగ ప్రదేశాల్లో సమర్థవంతంగా సాక్ష్యమివ్వడం”c స్థానిక క్షేత్రానికి అన్వయించండి. అనువైన చోట ప్లీజ్ ఫాలో అప్ (S-43) ఫారమ్ ఉపయోగించమని ప్రచారకులకు గుర్తు చేయండి.—ఫిబ్రవరి 2005 మన రాజ్య పరిచర్య, 6వ పేజీ చూడండి.
పాట 25 (204), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.