పత్రికల గురించి ఏమని చెప్పాలి?
కావలికోట మే 15
“అసలు పేదరికమేలేని లోకాన్ని మనం ఎప్పుడైనా చూడగలమని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] దేవుడు చేసిన ఈ వాగ్దానాలను గమనించండి. [యెషయా 65:21 చదవండి.] ఈ వాగ్దానం ఎలా నిజమవుతుందో ఈ కావలికోట సంచిక చర్చిస్తోంది.” వాగ్దానం చేయబడిన ఆ మార్పు ఎప్పుడు వస్తుంది? అనే ప్రశ్నను తర్వాతి సందర్శనంలో చర్చించేందుకు ఏర్పాట్లు చేసుకోండి.
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“భార్యలకు, తల్లులకు తగిన గౌరవం, సన్మానం లభిస్తోందని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి, తర్వాత ఎఫెసీయులు 6: 2 చదవండి.] మన సన్మానానికి, గౌరవానికి వారు ఎందుకు తగిన వారో ఈ ఆర్టికల్స్ వివరిస్తున్నాయి.”
కావలికోట జూన్ 1
“శాంతి గురించి దాదాపు ప్రతీవారు మాట్లాడుతున్నా, మానవజాతికి ప్రపంచ ఐక్యత అందని ద్రాక్షల్లాగే ఉంది. దానిని సాధించడం కేవలం కలే అని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] ప్రపంచాన్ని ఐక్యపరిచే సామర్థ్యం ఉన్న ఒక ప్రభుత్వాన్ని గురించి ఈ పత్రిక చర్చిస్తోంది.” కీర్తన 72:7, 8 చదివి, అది ఎలా నెరవేరుతుందో అనే విషయాన్ని తర్వాతి సందర్శనంలో చర్చించేందుకు ఏర్పాట్లు చేసుకోండి.
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“పిల్లలు తమ తల్లిని తండ్రిని సన్మానించాలని ప్రాచీన కాలాల్లో దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. [నిర్గమకాండము 20:12 చదవండి.] నేడు తల్లులకు సరైన సన్మానం దొరకుతుందని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] అనేక దేశాల్లో తల్లులు ఎదుర్కొంటున్న సమస్యలను, వాటిని వారు ఎదుర్కొంటున్న విధానాన్ని ఈ పత్రిక పరిశీలిస్తోంది.”