సేవా కూటాల పట్టిక
మే 9తో ప్రారంభమయ్యే వారం
పాట 9 (37)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. మే 15 కావలికోటను, ఏప్రిల్-జూన్ తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించడానికి 8వ పేజీలోని సూచనలు (మీ క్షేత్రానికి అనువైనవైతే) ఉపయోగించండి. ఆచరణాత్మకమైన ఇతర ప్రతిపాదనలను కూడా ఉపయోగించవచ్చు. ఒక ప్రదర్శనలో, ప్రజా రవాణా వాహనాల్లో అనియతంగా పత్రికలను ప్రతిపాదించడాన్ని ప్రదర్శించండి. అప్రమత్తంగా ఉండండి! బ్రోషుర్‌ను పంచిపెట్టే ప్రత్యేక కార్యక్రమం మే 15న ముగుస్తుంది. ఆ నెలలోని మిగతా రోజుల్లో మనం పత్రికలను ప్రతిపాదిస్తాం.
15 నిమి: క్రొత్త బ్రోషుర్‌ను ఉపయోగించి ఆసక్తిని పెంపొందించండి. ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ, సేవా పైవిచారణకర్త నిర్వహించాలి. అప్రమత్తంగా ఉండండి! బ్రోషుర్‌ను తీసుకున్న ప్రతీ వ్యక్తిలో ఆసక్తిని పెంపొందించేందుకు మనం పునర్దర్శనాలు చేయాలి. 2వ పేజీలోని విషయసూచికను ఉపయోగించి బ్రోషుర్‌లోని విషయాలను సమీక్షిస్తూ ముద్దక్షరాలలో ఉన్న శీర్షికల క్రింద ఉన్న అంశాలు వైపు వారి అవధానం మళ్ళించండి. ఇంతకు ముందు జరిగిన చర్చను కొనసాగించేందుకు ఈ క్లుప్తమైన, ఉపదేశాత్మకమైన సమాచారాన్ని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మొదట కలిసినప్పుడు 3-4 పేజీలను చర్చిస్తే, 5వ పేజీలోని “దేవునికి మనమంటే నిజంగా పట్టింపు ఉందా?” అనే భాగాన్ని పునర్దర్శనం చేయడానికి ఉపయోగించవచ్చు. దానిని ఎలా ఉపయోగించాలో చర్చించండి. 6-8 పేజీలలోని ఇతర ప్రత్యేక భాగాలను, 17-18 పేజీలలోని లేక స్థానిక క్షేత్రానికి అనువైన ఇతర భాగాలను సమీక్షించండి. ప్రత్యేకంగా ఉన్న ఒక భాగాన్ని ఉపయోగించి పునర్దర్శనాన్ని ప్రదర్శించండి. ఉల్లేఖించబడిన ఒకటి లేక అనేక లేఖనాలను చదివి, చర్చించాలి. తర్వాత సందర్శనంలో చర్చించగల ప్రత్యేకంగా ఉన్న వేరే భాగం వైపు అవధానం మళ్ళించి ప్రచారకుడు ముగిస్తాడు.
20 నిమి: “ఆచరణాత్మకమైన కుటుంబ కార్యక్రమ పట్టికను తయారు చేసుకోండి.” రెండు నిమిషాల కన్నా తక్కువగా ఉండే ఉపోద్ఘాత ప్రసంగంలో వ్రాతపూర్వకంగా తయారు చేసుకునే కార్యక్రమ పట్టికకు ఉన్న విలువను నొక్కి చెబుతూ 6వ పేజీలోని ఖాళీ పట్టికను పూరించే విధానాన్ని చర్చించండి. దాని తర్వాత “కుటుంబ కార్యక్రమ పట్టిక—సంఘ కూటాలు” అనే శీర్షికను ప్రశ్నాజవాబుల రూపంలో చర్చించండి. ఇతర కార్యకలాపాలు సంఘ కూటాలకు ఆటంకం కలిగించకుండా ఎలా చూసుకుంటారో వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి. కుటుంబ కార్యక్రమ పట్టికలోని అదనపు భాగాలు తర్వాతి వారాల్లో పరిశీలించబడతాయి.
పాట 25 (204), ముగింపు ప్రార్థన.
మే 16తో ప్రారంభమయ్యే వారం
పాట 8 (53)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: “కుటుంబ కార్యక్రమ పట్టిక—కుటుంబ క్షేత్రసేవ.”a ఒక కుటుంబంగా పరిచర్యలో క్రమంగా కలిసి పనిచేయడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.
20 నిమి: క్రొత్త బ్రోషుర్‌ను తీసుకున్న వారితో బైబిలు అధ్యయనాలను ప్రారంభించడం. ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ, సేవా పైవిచారణకర్త నిర్వహించాలి. గత సేవా కూటంలో ప్రదర్శించిన పునర్దర్శనాన్ని క్లుప్తంగా పునఃసమీక్షిస్తూ సందర్శన ముగింపులో పేర్కొన్న ముద్దక్షరాలలో ఉన్న భాగం గురించి ప్రత్యేకంగా చెప్పండి. ఆ సమాచారాన్ని ఉపయోగించి తర్వాతి పునర్దర్శనాన్ని (సాధ్యమైతే) అదే ప్రచారకుడు(రాలు) ప్రదర్శించేలా చూడండి. ప్రచారకుడు బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించడానికి బ్రోషుర్ చివరి పేజీని ఉపయోగించి, తర్వాతి సందర్శనంలో దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లోని 1వ పాఠాన్ని పరిశీలించేందుకు ఏర్పాట్లు చేస్తాడు. అప్రమత్తంగా ఉండండి! ప్రతిని తీసుకున్న వారితో బైబిలు అధ్యయనాలు ప్రారంభించడం మీద అవధానం నిలపమని అందరినీ ప్రోత్సహించండి.
పాట 26 (212), ముగింపు ప్రార్థన.
మే 23తో ప్రారంభమయ్యే వారం
పాట 20 (93)
12 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. 8వ పేజీలోని సలహాలను (మీ క్షేత్రానికి సముచితమైతే) ఉపయోగిస్తూ జూన్ 1 కావలికోట, ఏప్రిల్-జూన్ తేజరిల్లు! ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ఆచరణాత్మకమైన ఇతర ప్రతిపాదనలను ఉపయోగించవచ్చు.
18 నిమి: “యెహోవా దినం సమీపంలో ఉంది.”b ఈ భాగాన్ని సిద్ధపడుతున్నప్పుడు దానియేలు ప్రవచనం (ఆంగ్లం) పుస్తకంలోని 59వ పేజీలోని 28వ పేరాను చూడండి.
15 నిమి: “కుటుంబ కార్యక్రమ పట్టిక—కుటుంబ అధ్యయనం.”c కుటుంబ అధ్యయనానికి సమయం కేటాయించే విధానాన్ని గురించి వ్యాఖ్యానించేందుకు, దానిని క్రమంగా నిర్వహించడానికి అవసరమైన కృషిని గురించి వ్యాఖ్యానించడానికి ఒకరు లేక ఇద్దరిని ముందుగా ఏర్పాటు చేసుకోండి.
పాట 1 (13), ముగింపు ప్రార్థన.
మే 30తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (45)
15 నిమి: స్థానిక ప్రకటనలు. మే క్షేత్ర సేవా రిపోర్టులు ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి. జూన్ నెలలో అందించాల్సిన సాహిత్యాన్ని పేర్కొనండి. జనవరి 2005, మన రాజ్య పరిచర్యలో సూచించిన ఒకటి లేక రెండు ప్రతిపాదనలను ఉపయోగిస్తూ (మీ క్షేత్రానికి సముచితమైతే) ఆ సాహిత్యాలను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ఇతర ఆచరణాత్మక ప్రతిపాదనలను ఉపయోగించవచ్చు.
20 నిమి: “కుటుంబ కార్యక్రమ పట్టిక—దినవచనం.”d కుటుంబమంతా కలిసి దినవచనాన్ని పరిశీలించడం ద్వారా తమ కుటుంబాలు ఎలా ప్రయోజనం పొందాయో వ్యాఖ్యానించమని, దినవచనం పరిశీలించేందుకు ఏ కార్యక్రమ పట్టిక ఆచరణాత్మకంగా ఉన్నట్లు కనుగొన్నారో వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.
15 నిమి: “ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం—9వ భాగం.”e 2వ పేరా చర్చిస్తున్నప్పుడు డిసెంబరు 2004 మన రాజ్య పరిచర్యలోని 8వ పేజీలో ఉన్న ఒకటి లేక రెండు అంశాలను నొక్కి చెప్పండి. ఒక బైబిలు అధ్యయనానికి సంబంధించిన క్లుప్తమైన ప్రదర్శనను చేర్చండి. దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లోని 2వ పాఠాన్ని పూర్తి చేసిన తర్వాత అధ్యయన నిర్వాహకుడు విద్యార్థిని ఇలా అడుగుతాడు: “దేవుని పేరు ఏమిటి అనే అంశాన్ని మీరు మీ స్నేహితునికి ఎలా వివరిస్తారు?” కీర్తన 83:18ను తాను ఎలా ఉపయోగిస్తాడో విద్యార్థి వివరిస్తాడు, ఆ తర్వాత అధ్యయన నిర్వాహకుడు ఆయనను మెచ్చుకుంటాడు
పాట 28 (224), ముగింపు ప్రార్థన.
జూన్ 6తో ప్రారంభమయ్యే వారం
పాట 23 (200)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: స్థానిక అవసరతలు.
20 నిమి: “పత్రికా మార్గం ద్వారా ఆసక్తిని పెంపొందించండి.”f 3వ పేరా చర్చిస్తున్నప్పుడు తర్కించడం (ఆంగ్లం) పుస్తకం 227-32 పేజీల వైపు దృష్టి మళ్ళించండి. దేవుని రాజ్యం నెరవేర్చేదాని గురించి ఒకే ఒక లేఖనాన్ని చర్చించే పరంపరకు సిద్ధపడేందుకు ఆ సమాచారాన్ని ఉపయోగించవచ్చు. ఒక ప్రచారకుడు తన పత్రికా మార్గంలో ఒక వ్యక్తితో ఒకే ఒక లేఖనాన్ని ఉపయోగిస్తూ ఎలా చర్చిస్తాడో చూపించే ఒక ప్రదర్శనను చేర్చండి. గృహస్థుడు లేఖనాన్ని సరిగ్గా అర్థం చేసుకొని తన జీవితంలో దాని విలువను గ్రహించేందుకు సహాయం చేయడానికి ప్రచారకుడు లేఖన అన్వయింపును క్లుప్తంగా చర్చించి, విశదీకరించాలి.
పాట 4 (43), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
e ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
f ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.