సేవా కూటాల పట్టిక
గమనిక: మన రాజ్య పరిచర్య, సమావేశపు నెలల్లో జరిగే ప్రతీ వారపు సేవా కూటం కోసం సమయ పట్టిక వేస్తుంది. “దైవిక విధేయత” జిల్లా సమావేశానికి హాజరు కావడానికి అవసరమైన సర్దుబాట్లు సంఘాలు చేసుకోవచ్చు. సమంజసమైన చోట, సమావేశానికి హాజరయ్యే ముందు, చివరి సేవా కూటంలో, ఈ నెల మన రాజ్య పరిచర్యలోని మధ్య పేజీల్లో నుండి స్థానికంగా అన్వయించే సలహాలను, గుర్తుంచుకోవలసిన విషయాలను మళ్ళీ చర్చించేందుకు 15 నిమిషాలు ఉపయోగించండి. మీ సమావేశం ముగిసిన ఒకటి లేక రెండు నెలల తర్వాత, ఒకానొక సేవా కూటంలో (బహుశా స్థానిక అవసరతల భాగాన్ని ఉపయోగిస్తూ), ప్రచారకులు క్షేత్ర పరిచర్యలో తమకు సహాయకరంగా ఉన్నట్లు కనుగొన్న సమావేశపు ముఖ్యాంశాలను పునఃసమీక్షించండి. మనం సమావేశంలో నేర్చుకున్నవాటిని ఎలా ఉపయోగిస్తున్నామో వివరించేందుకు, మన పరిచర్యను మరింత ప్రతిభావంతం చేసుకోవడానికి అది ఎలా సహాయం చేసిందో వివరించేందుకు ఆ ప్రత్యేక సేవా కూటానికి సంబంధించిన భాగం మనకు అవకాశాన్నిస్తుంది.
ఏప్రిల్ 11తో ప్రారంభమయ్యే వారం
పాట 2 (15)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. ఏప్రిల్ 15 కావలికోటను, ఏప్రిల్-జూన్ తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించడానికి 8వ పేజీలోని సూచనలు (మీ క్షేత్రానికి అనువైనవైతే) ఉపయోగించండి. ఆచరణాత్మకమైన ఇతర ప్రతిపాదనలను ఉపయోగించవచ్చు. ఒక ప్రదర్శనలో, ప్రచారకుడు వీధి సాక్ష్యంలో పాల్గొంటున్నట్లు చూపించండి.
15 నిమి: “ప్రకటించడంలో పట్టుదలతో కొనసాగండి.”a సమయం అనుమతిస్తే, ఉదాహరించబడిన లేఖనాల మీద వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.
20 నిమి: “క్రొత్త బ్రోషుర్‌ను పంచిపెట్టేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం.”b సేవా పైవిచారణకర్త నిర్వహించాలి. సూచించబడిన ప్రతిపాదనలను ప్రదర్శించండి. ఒక ప్రదర్శనలో గృహస్థుడు లేఖన ప్రతిపాదన మీద తక్కువ ఆసక్తి చూపిస్తే ఆయనకు బ్రోషుర్‌కు బదులు కరపత్రం ఇచ్చినట్లు చూపించాలి.
పాట 6 (45), ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 18తో ప్రారంభమయ్యే వారం
పాట 15 (127)
10 నిమి: స్థానిక ప్రకటనలు. క్రొత్త బ్రోషుర్‌ను పంచే ప్రత్యేక కార్యక్రమం కోసం చేసిన ఏర్పాట్లను పునఃసమీక్షించండి. స్థానిక క్షేత్రంలో క్రొత్త బ్రోషుర్‌ను అందించడంలో మంచి ఫలితాలు ఇస్తున్న ఒక ప్రతిపాదనను ప్రదర్శించండి.
20 నిమి: “ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం—8వ భాగం.”c ఒక ప్రచారకుడు క్రొత్త బైబిలు విద్యార్థికి యెహోవాసాక్షులు—వారు ఎవరు? వారి నమ్మకాలు ఏమిటి? అనే బ్రోషుర్‌ను ఇచ్చే ఒక క్లుప్తమైన ప్రదర్శనను చేర్చండి. ప్రచారకుడు ఆ బ్రోషుర్‌లోని 20వ పేజీకి విద్యార్థి అవధానాన్ని మళ్ళించి బహిరంగ ప్రసంగం గురించి క్లుప్తంగా వివరిస్తాడు. ఆయన తర్వాతి వారంలో ఇవ్వబడే ప్రసంగ శీర్షికను చెప్పి విద్యార్థిని హాజరుకమ్మని ఆహ్వానిస్తాడు.
15 నిమి: స్థానిక అనుభవాలు. క్రొత్త బ్రోషుర్‌ను పంచిపెట్టేందుకు ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పటివరకు చవిచూసిన అనుభవాలను వివరించమని ప్రేక్షకులను కోరండి. విశిష్టమైన అనుభవాలను పునర్నటించడానికి ముందుగా ఏర్పాటు చేసుకోండి. సంఘంలో బ్రోషుర్‌లు తక్కువగా ఉంటే, అదనపు కాపీలను లిటరేచర్ కౌంటర్‌కు తిరిగి ఇవ్వమని కోరండి.
పాట 17 (187), ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 25తో ప్రారంభమయ్యే వారం
పాట 8 (53)
15 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. ఏప్రిల్ క్షేత్ర సేవా రిపోర్టులు ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి. 8వ పేజీలోని సలహాలను (మీ క్షేత్రానికి సముచితమైతే) ఉపయోగిస్తూ మే 1 కావలికోట, ఏప్రిల్-జూన్ తేజరిల్లు! ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ఆచరణాత్మకమైన ఇతర ప్రతిపాదనలను ఉపయోగించవచ్చు. ఒక ప్రదర్శనలో “నాకు ఇష్టం లేదు” అని చెప్పి సంభాషణను ఆటంకపర్చే వ్యక్తితో ఎలా వ్యవహరించాలో చూపించండి. (బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకంలో 8వ పేజీ చూడండి.) క్షేత్రంలోని ప్రజల దృష్టిని వెంటనే ఎక్కువగా ఆకర్షించగల ఆర్టికల్‌లను పేర్కొనండి.
30 నిమి: “మహా సమాజంలో యెహోవాను స్తుతించండి.”d సంఘ కార్యదర్శి నిర్వహించాలి. సంఘం నియమించబడిన సమావేశాన్ని గురించి పేర్కొనండి. నంబర్లు ఉన్న పేరాలను కావలికోట అధ్యయనం చేసే పద్ధతిలో చర్చించండి. పేరాలను ఒక నియమిత సహోదరునితో చదివించండి. “జిల్లా సమావేశపు జ్ఞాపికలు” అనే బాక్సును సమీక్షించండి.
పాట 16 (143), ముగింపు ప్రార్థన.
మే 2తో ప్రారంభమయ్యే వారం
పాట 18 (162)
10 నిమి: స్థానిక ప్రకటనలు. 6వపేజీలోని “అప్రమత్తంగా ఉండండి! బ్రోషుర్‌ను అధ్యయనం చేయడం” అనే ఆర్టికల్‌ను క్లుప్తంగా సమీక్షించండి. చర్చించనున్న బ్రోషుర్ షెడ్యూల్ ఆ ఆర్టికల్లో ఉందని పేర్కొనండి. మే 23వ వారంతో మొదలుకొని ప్రతీవారం జరిగే అధ్యయనానికి చక్కగా సిద్ధపడి, భాగం వహించమని అందరినీ ప్రోత్సహించండి.
20 నిమి: క్రొత్త బ్రోషుర్‌ను ఉపయోగించి ఆసక్తి రేకెత్తించండి. ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ, సేవా పైవిచారణకర్త నిర్వహించాలి. అప్రమత్తంగా ఉండండి! బ్రోషుర్‌లోని అనేక బాక్సుల గురించి నొక్కి చెబుతూ, పునర్దర్శనాలు చేసేటప్పుడు వాటిని ఎలా ఉపయోగించవచ్చో చర్చించండి. స్థానిక క్షేత్రంలో ఏ బాక్సులోని సమాచారం ఎక్కువ ఆసక్తి రేకెత్తించగలదని వారు భావిస్తున్నారో వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి. బాక్సుల్లో ఒక దానిని ఉపయోగించి పునర్దర్శనం చేస్తున్నట్లుగా ఒక ప్రదర్శనలో చూపించండి. మళ్ళీ సందర్శించేటప్పుడు చర్చించే మరొక బాక్సు వైపు గృహస్థుడి అవధానాన్ని మళ్ళించడం ద్వారా ప్రచారకుడు ప్రతిపాదనను ముగిస్తాడు. భవిష్యత్తు సేవా కూటంలో ఆ సందర్శనానికి సంబంధించిన ప్రదర్శన ఉంటుంది.
15 నిమి: “ఉపకారం చేయండి, ఇతరులతో పంచుకోండి.”e సమాచారాన్ని స్థానికంగా అన్వయిస్తూ మనం ఇతరులకు సహకారం అందించగల ఆచరణాత్మకమైన మార్గాలను పేర్కొనండి.
పాట 11 (85), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
e ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.